ఆధునిక సమాజంలో 1970 సంవత్సరం తరువాత ప్రతీ ఇంట్లో ముసలి తల్లితండ్రుల్ని కొడుకులు కోడళ్ళు కన్నవారి ఆలనా పాలనా బాగోగులు చూసుకోకుండా వీధిలోకి గెంటి వేయటం ప్రారంభమైంది. వృద్ధ ఆశ్రమాలు కూడా క్రమక్రంగా దేశ వ్యాప్తంగా తెరిచారు. అటు పిమ్మట గత నాలుగున్నర దశాబ్దాల నుండి అమ్మ నాన్నలను కన్న వదిలించుకోవటం పెంచిన పిల్లలకు జీవిత నాటకములో మామూలు విద్యుక్త ధర్మంగా మారింది. ఈ అప్రాచ్యపు అలవాటు ఆధునిక ప్రాపంచిక వైరసుగా మన భారత దేశ సనాతన కుటుంబవ్యవస్థలోకి ప్రవేశించటానికి ప్రధాన కారణం.
మన పురాతన సంప్రదాయ సామజిక కట్టుబాట్లు సమూలంగా క్రూకటివేళ్ళతో సడలిపోవటమే. మన నవనూతన తరములో ఏకో నారాయణ లాంటి విడిపోయిన నేటి ప్రతి ఇంట్లో పూర్తి ప్రాపంచిక, జీవిత అనుభవం లేని ధనార్జనే మిదం జగత్ అని భావించిన ఈనాటి తల్లితండ్రుల కన్నపిల్లల అనుభవరాహిత్య పెంపకంలో, సంసారాలు సాగటం.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నా, భిన్న మవటం, అఖండ జీవిత, ప్రాపంచిక అనుభవ కలిగిన తాత గారు, బామ్మ గారు, అమ్మమ గారి యాజమాన్యం లేని లోటుతో ప్రతి కుటుంబం నేడు నడవటం. వారి అమ్మ,నాన్న తిట్లు, బుద్ది చెప్పేందుకు మొక్కలు విరిగేలా దండన లేకపోవడం. సంఘలో, నలుగురు మన ప్రవర్తన చూసి ఏమనుకుంటారో అన్న సిగ్గు,లజ్జ లేకుండా బరి తెగించి పెద్ద, చిన్న విచక్షణ లేకుండా ఆడా,మగా, వయస్సుతో నిమిత్తం లేకుండా హద్దులు మరిచి అతితేవితేటలతో పేట్రేగాటమే ఒక కారణంగా మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెతను మన పిల్లల పెంపకం భాగవతం గుర్తు చేస్తున్నది. .ఇందుకు ఆజ్యం పోసిన, పోస్తున్న విషయాలు చాలా ఉన్నాయి.
కలికాలం ప్రభావంగా మనుషులు ఆడ,మగా తేడా లేకుండా స్వార్థ బుద్ధితో తమ విద్యుక్త ధర్మాలు మరవడము, మానటమే. అందరికి సర్వస్వాతంత్రం, మాటలాడటం, ప్రతిపనీ విచ్చలవిడిగా ఎదురు బెదురూ లేకుండా చేయడం, పుష్కలంగా చేతుల్లోకి డబ్బు రావడం , ఖర్చుచేయడం, ఉచ్చు విప్పిన ఆంబోతులా ఎప్పుడైతే ఇంట,బైట చిన్న,పెద్దలకు యాజమాన్య దండన భయం పోయిందో. ఆ రోజు నుంచే మన కుటుంబ వ్యవస్థ, దేశ వ్యవస్థ పరిపాలన గాడి తప్పి సర్వనాశనమైయింది.
సింహాం లాంటి మన పూర్వీకులు ఇంట్లో మరియు దేశంలో పరమపదించిన తరువాత క్రమశిక్షణా చర్యలు నామరూపాలు లేకుండా పోయాయి. అందుకు తగ్గ కీలెరిగి వాత పెట్టె కఠిన శిక్ష ఇంట,బైట మరుగై పోయాయి.
- మరొక ముఖ్య కారణం, ఈ కాలం స్త్రీలకు డబ్బు సంపాయించాలన్న కోరికతో ఇల్లు, సంసారం పిల్లల ఆలన, పాలన, కన్న పిల్లల్ని క్రమ శిక్షణతో పెంచాలన్న విషయం మరిచిపోవడం?
- ఆడవాళ్ళు ఉద్యోగ సమస్యలకు ,బరువు బాధ్యతలో తమ శక్తి,యుక్తుల్ని ధార పోయడం.
- పిల్లల పెంపకం అనే మహా క్రతువును ఎలా నీరు కరుస్తున్నదో? ఒకదాని కొకటి లింకుగా ఈనాడు మన సమాజ అస్తవ్యస్త తీరుతెన్నుల రంగుల వలలో కొట్టు మిట్టాడుతున్న మన అందరికి తెలిసిన విషయమే.
కన్నపిల్లలు ఆడా,మగా ఎవరైనా సరే తల్లి తండ్రుల చెప్పు చేతుల్లో గత తరాల మన పూర్వికుల యాజమాన్య పాలనలో లా, విద్య, బుద్ధులు ప్రాపంచిక జ్ఞానం వచ్చేవరకు శిక్షణ పొందని పక్షంలో ఈనాటి తరం పిల్లలు వంశ ద్రోహులుగా,దేశ ద్రోహులుగా తయారయితారు. ఆ ముచ్చట, మురిపం ప్రస్తుతం మన సమాజంలో ప్రతి తల్లి తండ్రి అనుభవిస్తున్న జీర్ణించుకోలేని జీవం మరణ సమస్యాత్మక విషయం. నేటి పౌరులే రేపటి దేశ నిర్మాతలన్నట్లు ,నేటి కన్న పిల్లలే రేపటి వంశోద్ధారకులు.ఇంట్లో తల్లి తండ్రులు,పాఠశాలలో గురువులు నేడు పిల్లల్ని సంస్క రిస్తేనే మన కన్న పిల్లలు భవిషత్తులో కుటుంబాలు,యావత్ దేశాన్ని నడిపే ఆణిముత్యాలుగా తయారవుతారు.
కాబట్టి మన పిల్లలకు వారి చిన్నతనం నుండి జీవిత నాటకానికి కావాల్సిన మన ప్రాపంచిక జీవితానుభం నరనరాన నూరి పోయడం తల్లితండ్రులుగా మన విద్యుక్త ధర్మం.మన కన్న పిల్లలే మన భవిష్యత్తుకు ఆసరా.ఆడ,మగా పిల్లలకు జీవిత నాటక దిన చర్య అనుభవాలు అడుగడునా ప్రతి విషయంలో క్షుణ్ణంగా తెలియజేస్తే వారు అనుభవజ్ఞులై మనల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని మనకు సహకరిస్తారు.పిల్లలు పెడచెవిన పెడితే నయనా, భయానా వారిని దండించి సన్మార్గంలో పెట్టె సర్వ హక్కులు తల్లితండ్రుగా మనకున్నవి.
ఇక ఆడ పిల్లలకు, మగ పిల్లలకు ఇంటి బాధ్యతలు, ప్రాపంచిక బాధ్యతలు ఉగ్గు పాల ప్రాయం నుండి నేర్పుతే రెండు విధాలా మన పిల్లలు మన కుటుంబానికి మరియు మన దేశానికి వన్నె తెస్తారు.దానికి రుజువు గత శతాబ్దాల మన మహామహుల కుటుంబ పాలనే సాక్షం. తల్లితండ్రులు, గురువులు చెక్కిన శిల్పాలుగా జీవితానుభవం కల్గిన మన సంతానము మన చరమాంకంలో మన జీవీతానికి శ్రీరామరక్ష.
జీవీతానుభవం అణువణువునా పుణికిపుచ్చుకున్న ప్రతి ఆడ పిల్ల రేపు వివాహమై ఓ ఇంటి కోడలుగా వెళ్లిన తరువాత ఒక అనుభవజ్ఞురాలైన తల్లిగా మెట్టినింట్లో అత్తా, మామగార్ల, యావత్ మెట్టినింటి కుటుంబ సభ్యుల ఆలనా పాలన తన కన్న పిల్లలతో సమానంగా చూసుకుంటుందనటంలో అతిశయోక్తిలేదు అలాగే ఒక మగ పిల్లవాడు వివాహం ఆయన తర్వాత ఓ తండ్రిగా తన తల్లితండ్రుల్ని అంత్య కాలము వరకు బాధ్యతాయుతంగా కాపాడుతాడని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
కనుక ఈనాడు కన్న పిల్లలకు ప్రాపంచిక జీవిత నాటక అనుభవాల్ని,మానవ విలువల్ని అడుగడుగునా ఉగ్గుపాల ప్రాయం నుండి నరనరాన జీర్ణించుకునేలా తమ పాత్రను బాధ్యతా రహితంగా విస్మరించిన కన్న తల్లీతండ్రులే నేటి కుటుంబ,సామాజిక అస్తవ్యస్త ఘోర పరిస్థితులకు బాధ్యులు అని ఘంటాపధంగా చెప్పవచ్చు .ప్రాపంచిక జ్ఞానం లేని నేటి నవతారాన్ని దుయ్యబట్టి ప్రయోజనంలేదు. ఇప్పుడు చేతులు కాలింతవాత ఆకులు పట్టుకొని లాభమేంటి???
ఆనందమైన సాంప్రదాయ కుటుంబం |
ఈనాడు భూమ్మీద స్వంత తల్లితండ్రులు పరమపదించిన తరువాత ప్రతి గృహాంలో ప్రతి కన్నవారి జీవితాలు సర్వ జీవిత రంగాల్లో ఎలా అడవిని గాచిన వెన్నెలలా సాగుతున్నాయి మన అందరికి స్పష్టంగా సువిదితమే.
కనుక, ప్రతి కన్నసంతానం ప్రతి ఇంట్లో కలియుగ మాయలోనించి పూజ పునస్కారాలతో,నిత్య దైవ ధ్యానంతో బైటపడి మాత,పితృ సన్నిధానంలో వారికీ రేయింబవళ్లు పరిచర్యలు చేసి వారిని తృప్తిపరిచి వారి కృపకు,ఆశీర్వచన భాగ్యం పొందేందుకు కృషిచేస్తే ప్రతి కన్నసంతానం జన్మ ధన్యమౌతుంది.
.ఇక మరొహ కోణంలో ఈ విషయాన్ని ఆలోచిస్తే ,తల్లితండ్రులు మారాలి. ప్రపంచ నాటకంలో సంపాదనే ముఖ్యకాదని, కుటుంబ వ్యవస్థను కూడా సంస్కరించాలని సింహావలోకనం చేసుకొని తమ కన్న పిల్లల్ని వంశోద్దారకుల్లా, దేశోద్దారకుల్లా తయారు చేయడం తమ జన్మ హక్కుగా భావించి ప్రతీ కుటుంబంలో మనస్ఫూర్తిగా శపథం చేసి నడుం బిగించి కంకణం కట్టుకున్న నాడు మళ్ళీ ఈ భువిపై మన పూర్వీక కుటుంబ వ్యవస్థ చిగురిస్తుంది.ప్రతి కుటుంబం,యావత్ సమాజము, దేశము, ప్రపంచము మానవతా విలువలతో సువాసనా భరితమై ఈ భువి స్వర్గతుల్యమౌతుంది.
రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి
""""AS PARENTS WE ARE NOT ONLY BODY GUARDS TO OUR CHILDREN.BUT ALSO,STRINGENTLY PUNISHING GOD FATHERS.WE HAVE TO INTERACT WITH OUR KIDS DAILY ONE HOUR TO ASSESS THEIR MORAL VALUES SPIRITUALITY STANDARDS AND WORLD KNOWLEDGE ACQUAINTANCE& PRACTICE FOR FAVOR OF OUR KIDS POSITIVE LIFE AFFAIRS ENACT FUTURE NEXT. IF,ANY, DISCREPANCY OBSERVED IN THEIR BEHAVIOR,WE SHOULD HAVE TAKE ACTION IMMEDIATELY TO RECTIFY THE NEGATIVE FLASHING THOUGHT&ACTIONS OF OUR KIDS ON WAR FOOT SPIRIT WITHOUT ANY FURTHER COMPROMISE AND DELAY. IT IS OUR BIRTH FUNDAMENTAL RESPONSIBILITY AS PARENTS OF CHILDREN CONCERNED,
IF ANY THING GOES WRONG &FOUND ABNORMAL WORST WITH RESPECT TO CHILDREN CHARACTER MORALITY& ETHICS ASPECT POINT OF VIEW AND FINALLY JUDGED BY COURT OF LAW. THE MOTHER WHO HAS HAD GIVEN BIRTH TO CHILDREN BY BEARING NINE MONTH IN HER BELLY.HAVING CENT PERCENT LEGAL RIGHTS TO HANG OR SHOOT TO MURDER THE CULPRIT KID CONCERNED FOR THE SAKE OF SOCIETY, COUNTRY &WORLD MORAL VALUES SHIELD POINT OF VIEW BY INTERNATIONAL COURT OF LAW. """""
రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి
""""AS PARENTS WE ARE NOT ONLY BODY GUARDS TO OUR CHILDREN.BUT ALSO,STRINGENTLY PUNISHING GOD FATHERS.WE HAVE TO INTERACT WITH OUR KIDS DAILY ONE HOUR TO ASSESS THEIR MORAL VALUES SPIRITUALITY STANDARDS AND WORLD KNOWLEDGE ACQUAINTANCE& PRACTICE FOR FAVOR OF OUR KIDS POSITIVE LIFE AFFAIRS ENACT FUTURE NEXT. IF,ANY, DISCREPANCY OBSERVED IN THEIR BEHAVIOR,WE SHOULD HAVE TAKE ACTION IMMEDIATELY TO RECTIFY THE NEGATIVE FLASHING THOUGHT&ACTIONS OF OUR KIDS ON WAR FOOT SPIRIT WITHOUT ANY FURTHER COMPROMISE AND DELAY. IT IS OUR BIRTH FUNDAMENTAL RESPONSIBILITY AS PARENTS OF CHILDREN CONCERNED,
IF ANY THING GOES WRONG &FOUND ABNORMAL WORST WITH RESPECT TO CHILDREN CHARACTER MORALITY& ETHICS ASPECT POINT OF VIEW AND FINALLY JUDGED BY COURT OF LAW. THE MOTHER WHO HAS HAD GIVEN BIRTH TO CHILDREN BY BEARING NINE MONTH IN HER BELLY.HAVING CENT PERCENT LEGAL RIGHTS TO HANG OR SHOOT TO MURDER THE CULPRIT KID CONCERNED FOR THE SAKE OF SOCIETY, COUNTRY &WORLD MORAL VALUES SHIELD POINT OF VIEW BY INTERNATIONAL COURT OF LAW. """""
సర్వేజనాసుఖినోభవంతూ.
ఓం