ఈ భూ ప్రపంచంలో ప్రతి కొడుకు, కూతురు నూరేళ్ళ తమ జీవన సార్ధక సాఫల్యానికి జనని జనకులను బ్రతికున్నంత కాలము వారి స్వీయ బ్రహ్మత్మానంద సంతృప్తికై సర్వ సపరియలు చేస్తూ తదుపరి తల్లితండ్రులు స్వర్గస్టులైన పిమ్మట త్రయోదిన కర్మలు శ్రద్ధగా క్రమం తప్పకుండ శాత్రోక్తంగా సద్బ్రాహ్మలతో ఆచరించి, కాశీకి వెళ్లి గంగానది సంగమంలో హస్తికలు కలిపి , గృహ పుణ్యావాచనం చేయించుకొని, శుద్ధియై ప్రతి మాసం మాసికాలు పెట్టి, సంవత్సరీకాలు మూడు రోజులు ఆచరించించి, గయకు వెళ్లి శ్రాద్ధం పెట్టి, ప్రతి సంవత్సరం మాత, పితుల తిధి రోజున శ్రాద్ధం పెడుతూ పితరం, పితామహం, ప్రపితామహం మరియు మాతరం, పితామహీమ్, ప్రపితామహీమ్, విష్ణువు, విశ్వేశ్వర స్థానాలలో ఏడుగురు భోక్తలతో మాతు, పితురులను ఆహ్వానించి వారి ఆత్మల్ని తృప్తి పరుస్తూ వారి ఆశీర్వచనాలు ఇంట్లో అందరు పొందాలి..
తరువాత ప్రత్యక్ష దేవతులైన జననీజనకులు పుణ్యలోకాల్లో మరో జన్మ లేకుండా మోక్షగాములు, కైవల్యగాములుగా నిత్యము అండపిండ బ్రహ్మ్న్దండ విశ్వ సృష్టికర్తలకు రేయింబవళ్లు శతసహస్రకోటి లింగార్చన చేస్తూ , లలితాసహస్రనామ స్తోత్రం శతసహస్ర కోటి మాట్లు పారాయణం చేస్తూ పూజిస్తూ నిత్య నూతన భోగ ,భాగ్య సౌకర్యాలతో తులతూగుతూ, పంచ భక్ష, లేహ్య, చోద్య, భోజ్య మహారాజ అన్నపానీయ విందులు సేవిస్తూ సృష్టి అంతం వరకు పుణ్య లోకాల్లో నిత్య శాశ్వత నివాసం ఉండాలని సూర్యోదయం నుండి చంద్రాస్తమం వరకు మనస, వాచా, కర్మణా ఆ భగవంతుణ్ణి ప్రతి పుత్రుడు, పుత్రిక జీవితాంతం ప్రాణం ఉన్నంతవరకు ప్రార్థించాలి., ఈ కార్యా చరణలే ప్రతి పుత్ర సంతతి మాతృ,పితృ రుణ విముక్తికి ఇలలోనే సువర్ణ సోపా నావకాశాలకు మూలాధార సిద్ధాంత ప్రక్రియలవుతాయని గ్రహించాలి. .
రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి
త్రయోదిన కర్మలు శ్రద్ధగా క్రమం |
ఈ ధర్మ సూక్ష్మాలను ప్రతి సనాతన వైదిక బ్రాహ్మణ మహాశయులు తు.చ తప్పక పాటించాలని మన వంశజుల శుభాశీష్యులు శత సర్వదా పొందేందుకు స్వయం కృషి చేయాలనీ వ్యక్తిగత నూరేళ్ళ జీవితాన్ని పావనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి
సర్వేజనా సుఖినోభవంతు, సత్మంగళానిభవంతు
స్వీయ మిదం స్వస్తి
శుభంభూయాత్.
ఓం