ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమంది పురోహితులు కూడా అందరిలాగే కలి ప్రభావానికి గురి ఆవు తున్నారు. మనసా, వాచ,కర్మణా వారి దైనందిక పౌరోహిత్య కార్యక్రమాలు విధిగ, నిష్ఠగా, వైదిక , స్మార్త ప్రాచీన కఠిన నిబంధలకు అనుగుణంగా కాక ప్రతికూలంగ క్రమ క్రమంగా ప్రతి రోజు యదేశ్చగా సాగిస్తున్నారు.పండితులు, పామరులు ఎవరు ఇదేమిటని ,ఎందుకిలా చేస్తున్నారని జ్యోక్యం చేసుకొని ప్రశ్నించటంలేదు. దీనికి తోడుగా అపరం, పరం మరియు పంచ దశ,షోడశ కర్మలు, వ్రతాలు, దైవ అర్ఛనులు, అభిషేకాలు, వడుగులు, పెళ్లిళ్లు, లింగార్చనులు, జపాలు, తపాలు,హోమాలు, తర్పణాలు, శార్దలు, సంవత్సరీకాలు అవలీలగా లాంఛనప్రాయంగా ఓ సినిమా షూటింగ్ తంతు లాగా జరిపిస్తున్నారు.
ఆధునిక పురోహితులు పౌరోహిత్యంలో స్వీయ శాస్త్ర ప్రమాణములు, ఘనాపాటి పటుత్వములేక , మంత్రాల , శ్లోకాల ఉచ్చారణ విధాన, ప్రక్రియలు శుద్ధిగా, విధిగా సంపూర్ణంగా శాస్త్రోత్తంగా సర్వానుష్ఠాన కార్యాచరణంగా నిర్వహించే అనుభవం లేక మన పూర్వీకుల ఘన కీర్తి దిగ జార్చేలా ఆధునిక అలవాట్ల మోజులో అవరోహణ పద్ధతుల్లో నేటి పౌరోహిత్యంలో అపశృతులు జరుపుతుండటం మన వైదిక బ్రాహ్మణ భవిష్యత్ మనుగడకి అఘాతం కలిగిస్తోందని ప్రతి బ్రాహ్మణాత్మ నఖ శిఖ పర్యంతం ప్రతిరోజు సూర్యోదయం నుండి చంద్రాస్తమయం వరకు భయంతో, పుట్టెడు దుఃఖంతో క్షణం క్షణం ఘోషిత్తోంది. ఈ పౌరోహిత్య కార్యాచరణ అపశృతులు స్వతః పురోహితుల తిరోగాభివృద్ధికేకాకుండా, వారి ద్వారా పూజ,వ్రత, అర్చన,అభిషేకాలు తదితర దైవానుష్ఠాన కార్యాచరణం నిర్వహించే సమస్త గృహ,ఆలయ యజమానులకు తీవ్ర కర్ణ, చక్షు కఠోర భవిషత్ విపరీత జీవిత సంకటాలకు, గ్రామా, నగర, రాష్ట్ర, దేశ, ప్రపంచ ప్రళయాళ సంభవాలకు ప్రత్యక్ష నిదర్శనాలవుతున్నాయి. కనుక అనుభవం లేని ధనార్జనే ధేయంగా నిత్య పౌరోహిత్య సాంప్రదాయ కార్యాచరణ విధానాలకు తిలోదకాలిస్తోన్న పురోహితులతో దైవ కార్యాలు, పితృకార్యాలు చేయించడం భవిష్యత్తులో కర్తలుగా మన కెంత శ్రయస్కరమో? చేసిన దైవ,పితృకార్యాల ఫలితం ఎంతమేర, ఎన్ని పాళ్ళలో కర్తలకు దక్కుతుందో లేక పుట్టెడు పాపం తలాపిడికెడు ఎంత మూటకట్టుకోవాలో ?? ఇకనైనా ఆలోచించాలి.
అసలే బ్రాహ్మణ పౌరోహిత్యం పఞ్చ బ్రహ్మ రౌరవాతి మహా పాపాలకు మూలం అన్నారు మన పూర్వికులు. అటువంటిది, నేటి ఆధునిక ప్రపంచంలో కొంతమంది పురోహితులు తెలిసి తెలియక అమాయకం, మూర్ఖత్వంతో అఖండంగా తగిన నిష్ఠ, గరిష్ట నిబంధనలు పాటించక తెలిసిన పెద్దల సాంగత్యం లో పౌరోహిత్యం కార్యాచరణం అభ్యసించక ,ఈ ఇరువై ఒకటవ శతాబ్దిలో స్వీయ కవిత్వంతో ఓ తంతులా ప్రతి దైవ పితృకార్యాలు నిర్వహించటం బహు దురదృష్టకరం, గర్హణీయం కూడా. దీనికి తగిన స్వీయ పరిహారం, ప్రాయశ్చిత్తం గురు, దైవ భయంతో నిత్యం స్వతః ప్రతి పురోహితుడు జప,తప, హోమాదులుతో నిర్విఘ్నంగా నిర్వహించకో కున్న, సృష్టికర్త ఆ భగవంతుని ఆగ్రహంతో ధర్మ దేవత ఒక్క పాదంతో కూడా నడవని నేటి కాలమ్ లో బ్రాహ్మణ సమాజం ఎలా భూమ్మీద బట్ట కట్టి బ్రతకగలదో ముందు తరాల్లో అర్థం కానీ అగమ్య, అగోచర దైవ గూడ రహస్యం గా వర్తమానంలో అంతు చిక్కటం లేదు.
ఈ శృతిమించిన ఆధునిక పౌరోహిత్య కార్యాచరణం నిర్వాహక ప్రతి బ్రాహ్మణ ఆత్మ ఇలలోనే రౌరవాతి నరకాలు అనుభవించటం ఖాయం.గరుడ పురాణం ప్రకారం ఈ శృతిమించిన నిర్వాకానికి శత సహస్ర కోట్ల జన్మల నరక ప్రాప్తి ప్రతి పురోహితుడికి ఉంటుందనడంలో కించిత్ సందేహం ఏ క్రోసాన లేదనటం అతిశయోక్తి కాదు.కనుక కలియుగ పురోహిత మహాశయు లారా మేల్కొనండి!! స్వీయ ప్రతి పౌరోహిత్య కార్యాచరణం ఆచరణలో పొల్లుపోకుండా అపరాధాలు జరగకుండా కూలంకషంగా శాస్త్రాధ్యయనం, కార్యాచరణం ప్రారంభించండి . మనస్సును, శరీరాన్నీ, మేధస్సును అప్రమత్తం చేసి పౌరోహిత్య విధుల్లో అపశృతులు మోగకుండా ఇక పై ప్రతి రోజు ప్రతి క్షణం కంటి రెప్ప వాలకుండా జాగ్రత్త పడండి. యజమానులకు, పురోహితులకు ఉభయాత్ భగవత్ శుభమంగళాశీస్సులు అష్టైశ్వర్య అదృష్ట ఆశీర్వచనాలై శతసర్వదా జీవితాంతం లభిస్తాయి.
ఆధునిక పురోహితులకు సెల్ ఫోన్లు రోజు వారి పూజలు, వ్రతాలు , అర్చనల్లో,తదితర దైవ కార్యాచరణలో ఆలయాలలో, గృహ సాంప్రదాయ దైవ అనుష్ఠానంలో ఆధ్యాత్మిక నిగ్రహ శక్తిని తగ్గిస్తున్నాయి. కనుక సెల్ ఫోన్ల వాడకం పౌరోహిత్య సంస్కార క్రియాచరణ సందర్భాలలో నిషేదించటం అన్ని విధాలా శ్రేయస్కరం.ఆలయ మరియు గృహ యజమానులు ఈ ఆధునిక పౌరోహిత్య పోకడలకు స్వస్తి చెప్పేందుకు కంకణం కట్టాలి.బలవంతంగా ఈ నూతన పౌరోహిత్య పోకడలకు మంగళం పడాలి.
పురోహితులకు డబ్బే ముఖ్యం కాదు, పౌరోహిత్య పాండిత్యము క్రియ కార్యాచరణం మీద శ్రద్ధ,నిష్ఠ, దైవ భయ ఆలోచన ఉండాలి.లేకుంటే కలియుగ ప్రభావం నఖ,శిఖ పర్యంతం ప్రతి ఆత్మను ఆవహిస్త్తుంది. బహు జాగ్రత్త సుమా.
ఈ ఆధునిక సమాజం లో సమాజం సంస్కర్తలే కాకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు ప్రభుత్వ అధికారులు కూడా పౌరోహిత్య ఆలయ, గృహ కార్య క్రమాల పై విహంగ విక్షణ చేయాలనీ కోరుతున్నాను. మన భారత దేశ పూర్వీక సాంప్రదాయ పద్ధతులను తు.చ.తప్పక భవిష్యత్తులో గృహ,ఆలయ పౌరోహిత్య కార్యక్రమాలలో యధావిధిగా సర్వవేళలా పాటించేలా అడుగడుగునా గ్రామ, నగర, రాష్ట్ర, దేశ ప్రభుత్వ యాజమాన్యం జన్మ సంకల్పంగా బాధ్యత వహించాలని కోరుతున్నాను.
ఈ ఆధునిక కాలములో ప్రాచ్యాత్య దేశాల వారు కలియుగ విచిత్రంగా నేడు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను, పూజా పునస్కారాలు,వేదం పఠనము పొల్లు పోకుండా విధి విధాన పద్ధతులను అణువణువునా పుణికి పుచ్చుకొని, ఆపోసన పట్టి, జీర్ణించుకోని మనతో పోటీపడుతూ సవాలు చేస్తున్నారు కనుక మన బ్రాహ్మణ ఆధునిక పౌరోహిత్య ప్రవుత్తిని మార్చుకోకపోతే ఈ యావత్ ప్రపంచంలో వర్తమాన దైవ కార్య, సాంప్రదాయ కార్యాచరణ పోటీలో ముందు తరాల్లో మన బ్రాహ్మణులు మన పొరుగు దేశాల ఆధ్యాత్మిక తేజో ప్రాభవాల హోరులో కనుమరుగై అభాసుపాలు కాకతప్పదు ..బహుపరాక్.
అండ, పిండ భ్రహ్మాండ నాయకుడు సృష్టి కర్త భగవంతుడు ఈ భారత దేశ యావత్ బ్రాహ్మణ సమాజాన్ని, పురోహితుల్నిమన పూర్వీకుల అనుష్టాన నిష్ఠ,గరిష్ట, ఘనాపాటి పౌరోహిత్య పౌరుష అడుగుజాడల్లో ఎల్లప్పుడూ యెల్ల వేళల్లో సూర్యోదయ నుండి చంద్రాస్థమయం వరకు నిర్విఘ్నంగా ఎద్విధమైన అనాచారాశుభాలుకు లోనుకాకుండా ఆచంద్రార్కం సృష్ట్టిలో భగవంతం సాక్షాత్కరించినంత వరకు శతసహస్రకోటి సూర్యుళ్ళ తేజో ప్రకాశవంత వెలుగులతో బ్రాహ్మణ్య మనుగడ సవిస్తరంగా వర్ధిల్లాలని,దిన దిన ప్రవర్ధమానం కావాలని యావత్ బ్రాహ్మణ మహాశయులు తరఫున ఆ సృష్టి జనని జనకులైన వైష్ణవి దేవిని, కేదారనాథ,బద్రినాథుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను.
రచన: H.V.S.R.C. SHARMA - C.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి
శుభంభూయాత్
సర్వ బ్రాహ్మణానాం యిల ఆచంద్రార్కం భవిష్యత్ సుఖినోభవంతు. స్వీయ మిదం స్వస్తి .
XXI CENTURY FEW MODERN ANDHRA PRIESTS PROFESSIONAL POUROHITYA ETHICAL ATTITUDES ARE NOT UP THE MARK AS PER THE OUR GREAT ANCIENT INDIAN CUSTOMS &TRADITIONAL STANDARDS HAVE TO BE NEEDS CHANGE BY FORCE BY OUR HONORABLE ANDHRA PRIESTHOOD MASTERS WITH IMMEDIATE EFFECT.
FOR HAVING BLESSED WITH ACTUAL MYTHOLOGICAL EFFECTIVE RESULTS BY DEVOTEES DOING OCCULT PERFORMING'S BY THEM 24/7 AT EVERY HOME&TEMPLE AND OTHER RELIGIOUS FUNCTION SPOTS ON THIS INDIAN SOIL MODERN INDIA.
TODAY,IT VERY SAD AND SHAMELESS TO NOTE THE FACTS IN OUR DAILY LIFE IN EVERY OCCASION. FOR GOD FEAR SAKE DO STOP THE NONSENSE WITHOUT ANY COMPROMISE BY HOOK OR COOK.
SARVEJANA SUKHINOBHAVANTHU.
ఓం