తెలుగులో అవధూత అనుపదమునకు పూర్తి అర్థము ఇచ్చుటకు ప్రయత్నిస్తాను.
అవధూతగీత ప్రకారముః"అక్షరాత్, వరేణ్యాత్, ధూతసంసారబంధనాత్, తత్వమస్యాధిలక్ష్యత్వాత్, అవధూత ఇతీర్యతే".అవధూతగీత
అవధూత పదంలోని
అ పదానికి ఆశాపాశమునుండి విముక్తి పొందినవాడు, ఆదిమధ్యాంతములందు నిర్మలుడు, ఆనందాన్ని నిరంతరము పొందుతుండేవాడు అని.
వ పదానికి వాసనలనుండి (పూర్వకర్మలనుండి) విడివడినవాడు, నిరామయమైన, పరబ్రహ్మగా పేర్కొనదగినవాడు, వర్తమానములోనే (భూతభవిష్యత్తుల గురించిన ఆలోచనలేక) ఉండేవాడు అని
ధూ పదానికి ధూళితో కూడిన శరీరము కలిగినవాడు, మనస్సును స్వాధీనము చేసుకొన్నవాడు, దోషరహితుడు, ధ్యాన ధారణలు లేనివాడు అని
త పదానికి తత్వ చింతన కలిగినవాడు, తమోగుణమును, అహంకారమును విడచినవాడు అని
అర్ధము.
ఇక అవధూతోపనిషత్తు ప్రకారము
అ - అనగా అక్షరుడు, నాశములేనివాడు,
వ - అనగా వరేణ్యుడు (బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు),
ధూ - అనగా ధూత (విదిలించుకొన్న) సంసార బంధనములు కలవాడు,
త - అనగా తత్వమస్యాది వాక్యములకు లక్ష్యమైనవాడు
ఇలాంటివారిని అవధూత అని పిలవబడుతున్నారని అవధూతగీత మరియు అవధూతోపనిషత్తు చెప్తున్నాయి.
అయితే అవధూతోపనిషత్తు మరియు అవధూత గీత రెండూ శ్రీ గురు దత్తాత్రేయులు చెప్పినవే.
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి