భారతదేశంలో వేర్వేరు ప్రాంతాలలో నెలకొన్న సంగీత స్థంభాలు వాటి వివరాలు Musical pillars-stones in various indian temples
సంగీత స్థంభాలంటే వాటిని తాటనం చేస్తే(అంటే తడితే) సరిగమలు పలుకుతాయి..
ఇలాంటి రాతి సంగీత మన దేవాలయాలలో దాదాపు ఒక 5000 ఏళ్ళ క్రితమే ఉన్నాయి..
అసలు మామూలు సంగీత వాయిద్యాలతో సంగీత సాధన చేయటమే కష్ట మయితే... భారత దేశంలో రాతిని తాకినా సంగితం వస్తుందంటే అది అద్భుతమే కదా... వారి భవన నిర్మాణ సాంకేతికత ఎంతగా అభివృద్ధి అయిందో...అది ఏ స్థాయిదో అర్థం చేసుకోండి.. ఇవి మన భారతీయ కళలు, సాంకేతిక గొప్పదనాన్ని వివరిస్తూ అబ్బురపరుస్తున్నాయి..
మన ఆలయాలలో కంపించే సంగీత రాతి స్తంభాలు - భూగర్భ శాస్త్రం మరియు సంగీత శాస్త్రంలో మధ్య యుగాలనాటి భారతీయుల అసాధారణ విజ్ఞానికి స్పష్టమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 500 ఏళ్ళనాటి నల్ల రాతి స్తంభాలపై ఒక కర్రతో కొట్టినప్పుడు యాత్రికులకు దిగ్భ్రమ కలిగిస్తూ వాటినుండి వివిధ రకాల సంగీత స్వరాలు ఉద్భవిస్తాయి.
ఈ దేవాలయాన్ని దర్శించే సందర్శకులు తమ పిడికిళ్ళతో స్తంభాలను కొట్టి, అవి ఉత్పత్తి చేసే సంగీత ధ్వనులను ఆలకిస్తుంటారు. ఈ సంగీత రాతి స్తంభాల నిర్మాతలకు శరీరం కంపించే సూత్రాలు స్పష్టంగా తెలుసు. సంగీత శబ్దం రాతి యొక్క వర్గం మరియు సాంద్రతపై ఆధారపడుతుందని కూడా వారికి తెలుసు. ఒక ధ్వనింపజేసే వర్గానికి చెందిన రాతినే వారు జాగ్రత్తగా ఎంచుకుంటారు. దీన్ని నైపుణ్యంతో నిలువు పట్టెలుగా, ఒక్కొక్కసారి ఒక స్తంభంపై 22 పెట్టెల వరకు చెక్కుతారు. ఈ పట్టేలన్నీ ఒకే రాతి ముక్కలో భాగాలై ఉంటాయి. ఈ పట్టెలన్నీ యావత్ నిర్మాణానికి స్థిరత్వం సమకూర్చే ఒక కేంద్రీయ పట్టె చుట్టూ క్రమబద్ధంగా తీర్చిదిద్దటం జరుగుతుంది. ఒక స్తంభం యొక్క వివిధ పట్టెలకు విభిన్న ఆకారాలు ఇవ్వబడతాయి. ఒకే స్తంభం, ఒకే రాతిలో అన్ని పట్టెలు భాగంగా ఉన్నప్పటికీ సరికూర్చిన స్తంభంలోని ప్రతి పట్టెను తట్టగానే విభిన్న శబ్దాలు వెలువరిస్తాయి. ప్రతి పట్టెకు పలువిధాలైన పొడవు మరియు మందం, విభిన్న ఆకారం-వర్తులాకారం, చదరం, అష్టా భుజి లేదా వంపు ఇస్తారు.
ప్రాచీన కలంలో సంగీతకారులు పట్టెలను దేవాలయంలో సంగీత ధ్వనులను ఉత్పత్తి చేసేందుకు చేతి పిడులుగ కర్రలతో కొట్టేవారు. దాదాపు 1560 ఏ.డి.లో నిర్మించబడిన ఈ వెయ్యి స్తంభాల మందిరపు వసారాలో రెండు సంగీత స్తంభాలను, దేవాలయం ఉత్తర ద్వారం వద్ద ఐదు స్తంభాలను చూడవచ్చు. తట్టగానే ప్రతి స్తంభం ఒక స్వరాన్నీ లేదా ఒక శ్రుతినీ ఉత్పత్తి చేస్తుంది. సంగీత విభావరిలో రాజు దేవాలయం మధ్యలో కూర్చుంటే ఈ స్థంభాల దగ్గర విద్వాంసులు తమ ప్రతిభతో వాయిస్తూంటే నర్తకీ మణులు నాట్యం చేసే వారట.. ఒకేసారి చాలా మంది విద్వాంసులు ఈ సంగీత స్థంభాలపై ఒకేసారి తాటనం చేసి వివిధ ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించే వారట..
ఇటువంటి సంగీత రాతి స్థంభాలు మనకు క్రింది ఆలయాలలో కనపడతాయి:
1. విజయ విఠ్ఠల దేవాలయం, హంపి
Musical Pillars, in vijaya vittala temple, Hampi

![]() |
విజయ విఠ్ఠల దేవాలయం, హంపి - సంగీత స్తంబాలు |

2. నెల్లయప్పార్ దేవాలయం, తిరునల్వేలి - Musical pillara, Nellayappan Temple, Thrunalveli
![]() |
నెల్లయప్పార్ దేవాలయం, తిరునల్వేలి |
3. తనుమాలయన్ దేవాలయం, సుచీంద్రం, నాగర్ కోయిల్, తమిళనాడు - Thanumalayan Temple, Suchindram, Nagercoil
![]() |
తనుమాలయన్ దేవాలయం, సుచీంద్రం, నాగర్ కోయిల్, తమిళనాడు |
![]() |
ఆయిరంకాల్ మండపం(వేయిస్థంభాల గుడి), మధుర మీనాక్షి దేవాలయం సంగీత స్తంబాలు |
![]() |
వ్రేలాడే రాతి స్థంభాలు:: మల్లికార్జునేశ్వరార్ దేవాలయం, ధర్మపురి, తమిళనాడు |
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి