బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
ధర్మో రక్షతి రక్షితః
ఆత్మీయ హిందూ బంధువులకు కాషాయ నమస్కారములతో హృదయాంజలి ..
ఎన్నో జన్మల పుణ్య ఫలం చేత మనం ఈ కర్మభూమిలో సనాతన ధర్మంలో పుట్టాము. యుగ ప్రభావం వలన మన ధర్మం పై అనేక రకాల దుష్ట శక్తులు నానా విధాలా దాడి చేస్తున్నాయి.
నేటి సమాజంలో సనాతనధర్మం, వేదాలు, పురాణాలు మరియు ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలపై విష ప్రచారాలు, వక్రీకరణలు, బహిరంగ తప్పుడు విమర్శలు సర్వ సాధారణమైపోయాయి. మన వారిలో మన ధర్మం కనీస అవగాహన ఉండటం లేదు. అందువలన స్వార్ధ చింతనతో కొంతమంది చేస్తున్న మాయలో పడిపోతున్నారు.
హిందువులలో ఐక్యత లేని కారణంగా, రాజకీయ నాయకులు హిందువుల మనోభావాలు కాని, సంక్షేమాన్ని కాని పట్టించుకోవడం లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితులలో శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల వారు, శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు వారు, స్వామి వివేకానందుల వారు సనాతనధర్మాన్ని తమ భుజ స్కందాలపై నిలబెట్టారు.
వారి అవిళర కృషి ఫలితంగానే, ఈ నాటికీ సనాతన ధర్మం యొక్క పునాదులు ధృడంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహనీయుల కృషిని, త్యాగ ఫలాన్ని మనం వ్యర్థం కానీయకూడదు. వారి స్పూర్తితో మనమంతా ఆది శంకరాచార్య, రామానుజాచార్య, స్వామి వివేకానందుల వలె మారాల్సిన అవసరం వచ్చింది.
స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, ధర్మ రక్షణలో భాగస్వాములమై, మన జీవితాలను సార్ధకం చేసుకుందాము.
ఈ సంకల్పంతోనే, 2015 ఆగస్టు 31న "శివశక్తి" ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగ సమావేశాలలో కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు, పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్త్రుతుంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
విరాళాలు:
శాంతి కాముకులైన హిందువుల సహనాన్ని, స్నేహభావాన్ని ఆసరాగా తీసుకుని, ఆదరించిన చేతినే నరకడానికి చూస్తున్న పరమత ప్రచారకుల ఆటకట్టించడానికి నడుంకట్టిన యువకుల సంగమమే శివశక్తి. ఎవరో వస్తారు – ఏదో చేస్తారనే వినాశకర ధోరణి మాని, కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మన గురువుల సూచనను అనుసరించి పోరాటం సాగిస్తున్న సంస్థ శివశక్తి. హిందూధర్మం పై జరుగుతున్న సిద్ధాంతపరమైన దాడిని, అసత్య ప్రచారాలను అత్యంత చాకచక్యంగా చర్చల ద్వారా, ప్రసంగాల ద్వారా, పుస్తకాల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా ఎదుర్కుంటున్న యుక్తి శివశక్తి. హిందువులుగా నటిస్తూ ప్రభుత్వ రాయితీలను దొంగిలిస్తున్న అన్యమతస్తుల ఆట కట్టిస్తున్న శక్తి శివశక్తి.
తమ ఆర్ధిక పరిస్తితి అంతంతమాత్రమైనప్పటికీ ధర్మరక్షణ కోసం ఓ గుప్పెడు స్వయంసేవకులు ప్రారంభించిన ఈ ప్రతిఘటన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉద్యమంగా మారడానికి, ఓ సోదరా, నీ సహాయం అవసరం.
ధర్మపోరాట విరాళాల బ్యాంకు ఖాతా సమాచారం
Shiva Shakti Adhyatmika Chaithanya Vedika
HDFC Bank, Kukatpally Village Branch, Bhagyanagar, Telangana, 500072
A/C Number : 50200027609646
IFSC Code : HDFC0009168
IFSC from SBI: HDFC0000045
విరాళాల గురుంచి తరచూ అడిగే ప్రశ్నలు
శివశక్తి సంస్థ విరాళాలు ఎందుకు సేకరిస్తుంది?
ఇది స్వచ్చందంగా చేతులు కలిపిన యువకుల ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా, లఘుచిత్రాలు రికార్డు చేయాలన్నా నిధులు అవసరం.
శివశక్తి విరాళాలు ఎలా ఖర్చు పెడుతుంది?
మీరు ఇచ్చిన ప్రతి రూపాయి నిస్సందేహంగా ధర్మం కోసమే ఖర్చు పెట్టబడుతుంది. జిల్లాల వారీగా కార్యాచరణ సంఘాలను తయారు చేయడానికి, కార్యక్రమాలను విస్తరించడానికి, కార్యక్రమ ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, సెల్ ఫోన్ ఖర్చులు, గౌరవ వేతనాలు, ఉద్యోగుల వేతనాలు మరియు ఇంకా ఏదైనా ధర్మం కోసం ఉపయోగపడే ఖర్చు లాంటివి.
శివశక్తి ఎలాంటి పారదర్శకత పాటిస్తుంది?
ప్రతి లావాదేవీ బ్యాంకు ద్వారా జరిపే విధానం ఉంది. విరాళాల వివరాలు ఈ వెబ్ సైట్ లో అందించ బడతాయి. ప్రతి ఆర్ధిక సంవత్సరం పన్ను నమోదు పత్రం కూడా website లో పొందు పరచబడుతుంది.
సమర్పణ: కోటి మాధవ్ బాలు చౌదరి