అమ్మ ప్రత్యక్ష దైవం. జగద్గురువైన ఆదిశంకరులు సైతం అమ్మ మాటకు కట్టుబడి ఉన్నారు. తల్లి అవసాన దశలో తప్పక వస్తానని మాటిచ్చిన శంకరులు.. యతిగా ఉన్నా.. ఆర్యాంబకు అంత్యేష్ఠి సంస్కారాలు నిర్వహించారు. ఆధునిక భారతంలో పరమయోగిగా భాసిల్లిన రమణ మహర్షి సైతం అమ్మ దగ్గరకు వచ్చేసరికి మామూలు మనిషైపోయారు.
ఐహిక విషయాలను విసర్జించి రమణులు కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి.. అరుణాచలం వచ్చేశారు. రమణుల జాడ తెలిసిన బాబాయి నెల్లియప్ప అయ్యర్ అరుణాచలం వచ్చారు. ఇంటికి రావాలని కోరగా.. స్వామి స్పందించలేదు. ఇదే విషయాన్ని నెల్లియప్ప.. రమణుల తల్లి అళగమ్మకు తెలియజేశారు. కొడుకుపై అవ్యాజమైన ప్రేమ కలిగిన ఆ మాతృమూర్తి.. నిమిషం నిలువక అరుణాచలం చేరుకుంది. తనతో పాటు ఇంటికి రావాల్సిందిగా రమణులను కోరింది. అప్పుడూ స్వామి మౌనాన్ని ఆశ్రయించారు. తల్లికి ఒక కాగితంపై.. ‘కర్త వారి ప్రారబ్ధానుసారం జీవులను ఆడించును. జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు. జరిగేది ఎవరెంత అడ్డుపెట్టినా జరగక మానదు. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండటమే ఉత్తమం’ అని రాసిచ్చారు. ఆ సమాధానం చదివి బరువెక్కిన గుండెతో ఆ తల్లి వెనుదిరిగింది.
ఆ తర్వాత చాలాసార్లు రమణుల దగ్గరికి ఆ తల్లి వస్తూ, పోతూ ఉండేది. ఓసారి అళగమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది. తల్లికి రమణులు ఎన్నో సపర్యలు చేశారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మనామదురైకి తిరిగి వెళ్లారు. 1916లో తిరువణ్ణామలై వచ్చిన ఆమె.. రమణుల వద్దనే స్థిరపడాలని నిశ్చయించారు. తర్వాత నాలుగేళ్లకు అళగమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. రమణులు కంటి మీద కునుకు లేకుండా తల్లికి సేవలు చేస్తూ గడిపారు. స్వామి ఆజ్ఞ చేస్తే చాలు.. ఆ తల్లికి సేవ చేయడానికి ఎందరో సిద్ధంగా ఉన్నారు. అయినా.. తల్లికి రమణులే సపర్యలు చేశారు. అమ్మకు వేదాంత సారాన్ని బోధిస్తూ ఉండేవారు. చివరగా.. రమణుల కుడిచేతిని ఆమె హృదయంపైన.. ఎడమచేతిని శిరస్సుపైన ఉంచి.. తదేక దృష్టితో తల్లిని వీక్షిస్తూ.. ముక్తిని ప్రసాదించారు. ఏ స్థాయి వ్యక్తులైనా.. తల్లికి కొడుకులేనని.. తల్లికి సేవ చేయడం కొడుకుల బాధ్యత అని జగతికి చాటారు రమణులు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి