అమ్మ |
ఆడవారిని మన సమాజము ఏ యే దశలలో ఏ విధంగా గౌరవించాలి పూజించాలి?
యత్ర నార్యోస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃకావున ఆడవారిని మన సమాజము ఏ యే దశలలో ఏ విధంగా గౌరవించాలి పూజించాలి. ప్రతి స్త్రీ లో మనం అమ్మ ను చూడాలి అంటారు పెద్దవాళ్లు .శాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. మరి మహిళలను అమ్మ గా చూడాలి అన్నారు.
అది ఎలా??? అమ్మ అంటే ఆ జగన్మాత అయినటువంటి ఆది పరాశక్తి ని చూడాలి అని అర్థము . అది ఎట్లా చూడాలి.మనుష్యులము అయినవంటి మనము మన బుధ్ధితో జ్ఞానముతో అమ్మవారి స్వరూపాన్ని చూడటుము ఎలా సాధ్యము అవుతుంది?ఈ అంశము పై చాలా కాలము పరిశోధన చేసిన పెద్దలు అందించిన విజ్ఞానాన్ని సేకరించి పోస్ట్ చేస్తున్నాను ఆచరించండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి.
అమ్మవారి 9 రూపములలో స్త్రీ యొక్క పరిపూర్ణ జీవన విధానము మనకు ప్రతిబింబిస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే..
- స్త్రీ యొక్క జననము అమ్మవారి మొదటి స్వరూపము (బాలా) .పేరు శైలపుత్రీ దుర్గ.
- కౌమార దశ అనగా విద్య ఇతరత్రా అన్నీ నేర్చుకుంటూ చిన్న పిల్లలు చేసే అల్లరి చేయడము రెండవ స్వరూపము పేరు (బ్రహ్మచారణీ దుర్గ)
- వివాహానికి పూర్వము చంద్రుడి తో సమానమైనటువంటి కళలు కలిగి ప్రశాంతమయిన ముఖవర్చస్సు కలిగి ఉండటం మూడవ స్వరూపము .పేరు(చంద్ర ఘంటా దుర్గ)
- కొత్త జీవికి జన్మనివ్వడము కోసము గర్భధారణ చేయడమనేది నాల్గవ స్వరూపము.పేరు(కూష్మాండా దుర్గ)
- సంతాన ప్రాప్తి తరువాత తన పిల్లలను చూసుకునే క్రమము ఐదవ స్వరూపము.పేరు( స్కందమాత దుర్గ)
- తన జీవితములో జరిగే అనేక సంఘటనలు చూస్తూ దైవాన్ని సాధన చేస్తూ జీవించే పధ్ధతి ఆరవ స్వరూపము.పేరు(కాత్యాయని దుర్గ)
- తన సంకల్పము చే భర్త యొక్క అకాల మృత్యువును కూడా జయించేటప్పుడు తన ఏడవ స్వరూపము .పేరు(కాళరాత్రి దుర్గ)
- తన వారికి మరియు కుటుంబానికీ తన ద్వారా ఉపకారము చేస్తూ ఉండేది ఎనిమిదవ స్వరూపము.పేరు (మహాగౌరీ దుర్గ )
- భూమిని విడిచి పెట్టి స్వర్గ ప్రయాణము చేసే ముందు తన సంతానానికి సిధ్ధి(( సమస్త-- సుఖ సంపదలు)) కలగాలని ఆశీర్వాదము ఇచ్చే క్రమములో తన తొమ్మిదవ స్వరూపము.పేరు( సిధ్ధిధాత్రీ దుర్గ) అందుకే స్త్రీ ని గౌరవించాలి.