ఉరుకుల పరుగల జీవనంలో వృత్తి, వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయం సాధించడానికి నిరంతం పోరాటం తప్పడం లేదు. ఈ రెండింటి మధ్య సమతౌల్యత సాధించే క్రమంలో నిద్రకు తీవ్ర భంగం కలుగుతుంది. కానీ ప్రతి ఒక్కరికీ కనీసం 8 గంటల నిద్ర అవసరం. అది కూడా ప్రశాంతమైంది. ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ కొన్ని చిట్కాలను, సూచనలను పాటించడం ద్వారా భంగం కలగకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
- రాత్రి నిద్రపోయే సమయంలో కొన్ని ఏలకులను వస్త్రంలో చుట్టి దిండుకు దగ్గరగా ఉంచితే పీడకలలు, రాత్రిపూట భయాన్ని నిరోధించవచ్చు.
- నిద్రపోయేటప్పుడు దక్షిణం వైపు తల, ఉత్తరం దిక్కునకు కాళ్లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల సుఖ నిద్రతోపాటు వచ్చిన కలలు కూడా నిజమవుతాయి.
- నిద్రకు ముందు ఇష్టదైవం లేదా ఇష్టమైన మంత్రాలను ఉచ్ఛరిస్తే ప్రశాంతమైన నిద్ర ఖాయం.
- రాగి పాత్రలో నీరు నింపి రాత్రిపూట దిండు పక్కన ఉంచి, ఉదయాన్నే ఆ నీటిని మొక్కలకు పోయడం వల్ల శుభఫలితం ఉంటుంది.
- పడకగది లేదా మంచానికి సమీపంలో చెత్త బుట్ట, షూ, చెప్పుల స్టాండ్ ఉండకుండా చూసుకోవాలి. పడకగది చిందర వందరగా ఉంటే ఇంట్లో ప్రతికూలతలను పెంచుతుంది.