నమో! చంద్రా! అంతర్జాతీయ యోగా భ్రష్టుపడుతోంది!!??
యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన ఇంద్రుడు, యోగచంద్రుడు అని మోడీని అందరూ పొగిడేస్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. అయితే ఇదే సమయంలో యోగాకు పొంచి ఉన్న పెను ముప్పు గురించి జరగాల్సింత చర్చ జరగడంలేదు. అంతర్జాతీయంగా యోగాకు పొంచి ఉన్న ముప్పు ఏమిటి? అంతర్జాతీయ యోగా దినోత్సవాలు విజయవంతంగా పూర్తి చేసుకుని చేతులు దులిపేసుకున్న తరుణంలో అత్యవసరంగా ఆలోచించాల్సిన అంశాన్ని మీ ముందుకు తెస్తున్నాము. అంతర్జాతీయంగా భారతీయ ఆధ్యాత్మిక, ఆరోగ్య రంగాల ఆయువుపట్టు యోగాకు రానున్న పెను ముప్పు ఇదే.
ఇది అర్థం కావాలంటే హైందవ జాతి ఉన్నత శిఖరాలైన హిమాలయాల చరణాల దగ్గర ఉన్న రిషీకేశ్ కు మనం వెళ్లాలి. పవిత్ర గంగానది సాక్షిగా భారత యోగాను కొంత మంది పాశ్చాత్యులు భ్రష్టుపట్టిస్తున్నారని అక్కడి స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రిషీకేశ్ లోని గంగా నదీ పరీవాహక ప్రాంతంలోని ఇసుక తిన్నెల మీద ఒక విచిత్ర విన్యాసాలు విదేశీయులు అభ్యసిస్తున్నారు. దీని పేరు ఆక్రోయోగా. ఇది భోగలాలస పాశ్చాత్య ఆక్రోబేటిక్స్ కి, ఆధ్యాత్మసాగర భారతీయ యోగాకు పుట్టిన సంకర క్రీడ. ఇది 2003లో విదేశాల్లో జేసెన్ నేమర్, జెన్నీ సౌవర్ -క్లీన్ ల మేధస్సులో రూపుదిద్దుకుంది. వీరి మేధస్సు మరింత పరిఢవిల్లి 2006లో ఆక్రో యోగాగా రూపుదిద్దుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ నెలా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. దీని వల్ల పెద్ద ఇబ్బందేమీ లేదు కానీ, వీరి విన్యాసాలు, వ్యాపారాత్మకధోరణి యువతను పెడతోవ పట్టించేదిగా ఉండడమే నేడు అంతర్జాతీయంగా ముంచుకొస్తున్న ప్రమాదం.
ఇది కామకేళికి ఏమాత్రం తీసిపోదని అనేక మంది దుమ్మెత్తి పోస్తున్నారు.
పాశ్చాత్య సంప్రదాయంలో రూపుదిద్దుకున్న ఆక్రోబేటిక్స్ వారి ఇష్టం. ఇది దేవతావస్ర్తాలతో రతీమన్మథుల ఆనంద తాండవం అన్నా, మరొకటి అన్నా మనకు సంబంధంలేదు. ఇది క్రీడా విన్యాసం అని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టినా భారతదేశానికి ఏ మాత్రం అభ్యంతరం లేదు. కానీ దీన్ని తీసుకువచ్చి యోగాతో ముడిపెట్టడమే సంప్రదాయ వాదులకు చికాకు తెప్పిస్తోంది.
అన్నిటికీ మించి యోగ శాస్త్రానికి మూలమైన పతంజలి యోగ సూత్రాలలో యోగ అంటే చిత్తవృత్తి నిరోధం అని మొదటి సూత్రంలో నిర్వచించారు. అంతేకానీ ఆడా మగా పాముల్లా పెనవేసుకునేది, కామవికారాలు కలిగించేదిగా, ఎక్కడా చెప్పలేదని ధార్మికవాదులు మండిపడుతున్నారు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

యోగా అంటే సంయోగంగా అర్థం చేసుకున్న పాశ్చాత్యులు ఆక్రోయోగాతో కామకేళీ విన్యాసాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు.భారతీయ సంస్కృతిలో యోగా అనే పదానికి సంస్కృతంలో అనేక అర్థాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైద్య రంగాల్లో శారీరక, మానసిక, తాంత్రిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ విడిచి ‘‘కూడిక‘‘, ‘‘సంయోగం‘‘ అనే సంకుచిత అర్థంలో యోగాను ఆక్రోయోగా నిర్వాహకులు నిర్వచించడం విచారకరమని హైందవధర్మపరిరక్షకులు అంటున్నారు.
అన్నిటికీ మించి యోగ శాస్త్రానికి మూలమైన పతంజలి యోగ సూత్రాలలో యోగ అంటే చిత్తవృత్తి నిరోధం అని మొదటి సూత్రంలో నిర్వచించారు. అంతేకానీ ఆడా మగా పాముల్లా పెనవేసుకునేది, కామవికారాలు కలిగించేదిగా, ఎక్కడా చెప్పలేదని ధార్మికవాదులు మండిపడుతున్నారు.
ఆక్రోయోగా రావాలంటే అటు ఆక్రోబేటిక్స్, ఇటు యోగాలోనూ నైపుణ్యం రావాలని చెప్పుకొస్తున్నా ఇది యువతలో కామప్రవృత్తులు రగిల్చేదిగా ఉంది కానీ ఆధ్యాత్మికం కానీ, ఆరోగ్యం కానీ కాదని వాదిస్తున్నారు.సామాన్యంగా యోగా క్లాసులకు వేయి రూపాయలు ఖర్చు అయితే దీని కోసం అక్షరాలా మూడు లక్షల రూపాయలు శిక్షణా రుసుముగా విదేశాల్లో వసూలు చేస్తున్నారు. ఇది భారత దేశంలో కూడా ప్రవేశించి నిన్నటి వరకూ యోగా శిక్షణలో మునిగి తేలిన యోగసాధకులు తక్కువ సమయంలో కోటీశ్వరులను చేసే ఆక్రోయోగా శిక్షణదారులుగా మారిపోతున్నారు. పాశ్చాత్య వ్యాపారాత్మక ధోరణితో విధిలేక పోరాడాల్సి వస్తోంది. అంతేకాక, మోక్ష మార్గానికి, ఆరోగ్యానికీ ఉపయోగించే యోగాను కామ ప్రకోప క్రీడగా మార్చలేక సతమతమవుతున్నామని కొందరు శిక్షణదారులు విచారం వెలిబుచ్చారు. సాధారణ యోగా శిక్షణతో పోల్చితే దీని ఖరీదు కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉండడం ప్రధాన కారణమని అంటున్నారు. దీనిని అరికట్టక పోతే ప్రపంచ దేశాల్లో యోగా అంటే కామకేళిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి