అన్నవరంలో:
అన్నవరం : అన్నవరం శ్రీ వీరవెంకటసత్యనారాయణస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కాగా ప్రతి రోజూ తెల్లవారుఝామునుంచి స్వామి, అమ్మవార్లకు సుప్రభాతసేవ నిర్వహిస్తారు. ఆరుగంటలకు భక్తుల్ని సర్వదర్శనాలకు అనుమతిస్తారు. స్వామివారి వ్రతాలను ఉదయం 5గంటలకు ప్రారంభిస్తారు. స్వామివారి నివేధన కోసం 7గంటల నుంచి 7.15 గంటల వరకు దర్శనాల్ని నిలిపేస్తారు. అలాగే మధ్యాహ్నం 12.30 నుంచి 1గంట వరకు మహానివేధన కోసం సర్వదర్శనాల్ని నిలిపేస్తారు. రాత్రి 8గంటలకు దర్భారు సేవ అనంతరం 8.45గంటలకు దర్శనాల్ని నిలిపేస్తారు. రాత్రి 9గంటలకు ప్రధానాలయం తలుపుల్ని మూసేస్తారు. ఉదయం 10.30గంటల నుంచి స్వామివారి నిత్యాన్నదాన టికెట్లను ఇస్తారు. వసతి సదుపాయం అందుబాటులో ఉంది. ఇందు కోసం సిఆర్ఓ కార్యాలయం 08868 239173 నెంబరున సంప్రదించాలి. వివాహాలకు సంబంధించి గదుల అడ్వాన్స్ బుకింగ్ కోసం ముహూర్తానికి నెలరోజుల ముందు సుముహుర్త పత్రంతో పాటు వధూవరుల గుర్తింపు కార్డులు, వారి తల్లిదండ్రుల గుర్తింపుకార్డులు సిఆర్ఓ కార్యాలయంలో సమర్పిం చాల్సి ఉంటుంది.
అంతర్వేది నర్సన్న ఆలయ సమాచారం
అంతర్వేది : అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి వేకువ జామునుంచే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. స్వామివార్కి అభిషేకం, అష్టోత్తర, గోత్రనామాల్తో పూజలు, సుదర్శన హోమాల్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 5గంటల నుంచి భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు నివేధన కోసం దర్శనాల్ని నిలిపేస్తారు. తిరిగి సాయంత్రం 3గంటలకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8గంటలకు ఏకాంతసేవల అనంతరం ఆలయ ప్రధాన ద్వారాల్ని మూసేస్తారు. స్వామివారి నిత్యాన్నదాన కొనసాగుతోంది. వసతి, పూజల వివరాల, నమోదు కోసం 9701703940, 9912988662, 9440219241నెంబర్లలో సంప్రదించవచ్చు.
అప్పనపల్లి సమాచారం
మామిడికుదురు : అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 15నిమిషాల సమయం పడుతోంది. స్వామివార్కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేకువఝాము 5గంటలకు సుప్రభాత సేవ నిర్వహి స్తారు. అనంతరం నివేదన, బలిహరన హోమం నిర్వహిస్తారు. తొమ్మిదిగంటల వరకు వేదపారాయణం జగుతుంది. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రారంభమౌతాయి. పాత ఆలయంలో ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి 12.30 నుంచి రాత్రి 7గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. అలాగే కొత్త ఆలయంలో ఉదయం 6.30నుంచి మద్యాహ్నం 12గంటల వరకు, తిరిగి 2గంటల నుంచి 7.15గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8గ ంటలకు పవళింపు సేవ అనంతరం స్వామివారి దర్శనాలకు భక్తుల్ని అనుమతించరు. ప్రత్యేక పూజల పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం 08862 239562నెంబర్లో ఆలయాధికారుల్ని సంప్రదించాలి.
అయినవిల్లిలో రద్దీ నామమాత్రం
అయినవిల్లి : అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివార్కి ప్రత్యేక పూజలు జరుగుతాయి. వేకువఝామున వినాయకునికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 12గ ంటలకు దర్శనాల్ని నిలిపేస్తారు. తిరిగి సాయంత్రం 4గంటల నుంచి స్వామివారి దర ్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8గంటలకు స్వామివారికి సేవలు నిర్వహించి ఆలయ ప్రధాన ద్వారాల్ని మూసే స్తారు.
అందుబాటులో లేని నిత్యకళ్యాణం టికెట్లు
ఐ పోలవరం : నిత్యకళ్యాణం.. పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళీసమేత వీరేశ్వరస్వామివారికి నిర్వహించే నిత్యకళ్యాణం టికెట్లు అందుబాటులో లేవు. వసతి గదులు ఖాళీగా ఉన్నాయి. వీరేశ్వరునికి ప్రత్యేకాభిషేకాల్ని నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయి. స్వామివార్కి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో వీరేశ్వరస్వామివార్కి ప్రతిరోజు నందివాహన కళ్యాణం, బహరి కళ్యాణం, మక్తకళ్యాణం, పంచామృతాభిషేకం, శాశ్వతాభిషేకం, మండపాలంకరణలు నిర్వహిస్తారు. అలాగే గోపూజ, సహస్రకుంకుమపూజ, రుద్రాభిషేకం, మహన్యాసం, అష్టోత్తర నామ కుంకుమపూజ లను నిర్వహిస్తారు. నిత్యకళ్యాణం చేయించుకునేవారి జన్మనక్షత్రం ఆధారంగా ఈ టికెట్లను జారీ చేస్తారు. రాత్రి 7గంటలకు ప్రారంభమయ్యే ఈ కళ్యాణం అర్ధరాత్రి 11గంటలకు ముగుస్తుంది. వసతి, పూజల నమోదు కోసం 08856 278424నెంబర్లో సంప్రదించాలి.
మందపల్లిలో రద్దీ సాధారణం
కొత్తపేట : మందపల్లి శ్రీ మందేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ రద్దీ సాధారణంగా ఉంది. . దోషనివారణ పూజలు సాధారణసంఖ్యలోనే జరుగుతున్నాయి. దూరప్రాంతాల నుంచొచ్చిన భక్తులు ఇక్కడ శనీశ్వరునికి ఈ పూజలు జరిపి దానాలు చేస్తున్నారు. అలాగే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. శనిదేవుని ప్రభావనికి గురైన వారు ఈ రోజు ఆలయానికి విచ్చేసి దోష నివారణ పూజలు చేయించుకుని, దానాలు చేస్తారు. ఆన్లైన్లో స్వామివారి అభిషేకాలను ముందుగానే నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 08855 243208, 94910 00721నెంబర్లలో సంప్రదించాలి.
ర్యాలి జగన్మోహినిస్వామివారి ఆలయ సమాచారం
రావులపాలెం : ర్యాలి శ్రీ జగన్మోహిని స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ రద్దీ సాధారణంగా ఉంది. ఉదయం 5గంటల నుంచే ఇక్కడి స్వామివార్కి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ జగన్మోహిని కేశవస్వామివార్ని దర్శించుకునేందుకు భక్తులు తరలొస్తున్నారు. దూరప్రాంతాల నుంచొచ్చే భక్తుల కోసం నిర్మించిన వసతి గదులు అందుబాటులో ఉన్నాయి.
ద్రాక్షారామలో భక్తుల రద్దీ సాధారణం
రామచంద్రపురం : ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ రద్దీ సాధారణంగా ఉంది. స్వామివార్కి ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు. ఇక్కడ పైండా ట్రస్ట్ నిర్వహిస్తున్న సత్రంలో వసతిగదులు అందుబాటులో ఉన్నాయి. కాగా , భీమేశ్వాంలయంలో నిత్య చండీ రు ద్రహోమాలు నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయంలో నిత్యాన్న పధకం, పై ండావారి ఉచిత అన్నదాన వసతి కలదు.
వాహనాల పూజలు చేయించుకునేందుకు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
స్కూటర్ కు రూ. 50 , ట్రాక్టర్ , వ్యాన్, కారు, ఆటోలకురూ. 50, లారీ , బస్సులకు రూ. 100లు వసూలు చేస్తారు. పూజా ద్రవ్యాలు పురోహితులను భక్తులే సమకూర్చుకోవాలి. ఆలయంలో నిర్వహించే నిత్య సామూహిక చండీ , రు ద్ర , లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి నారాయణ, నవ గ్రహ హోమాలు, గో త్రనామాలు చదివేందుకు రూ. 5వేలు చె ల్లించాలి. ఏ డాదిలో 1 రోజు నేరుగా హోమ కార్య క్రమాల్లో పాల్గొన్నవారికి ఒకరోజు ఉచితంగా శాంతికళ్యాణం చేస్తారు. ప్రతీనెల పోస్టులో ప్రసాదాలు పంపిస్తారు.
కోటిపల్లి సోమేశ్వరుని ఆలయం
కె గంగవరం : కె గంగవరం మండలం కోటిపల్లిలో కొలువైన శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
భీమేశ్వరునికి ప్రత్యేక పూజలు
సామర్లకోట : సామర్లకోట శ్రీ కుమారరామభీమేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భీమేశ్వరునికి ప్ర త్యేక పూజలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభిషేకాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా వివిధ ఫలాల్తో రసాల్ని సిద్ధం చేశారు. ఈ అభిషేకాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేస్తున్నారు.
పాదగయలో భక్తుల రద్దీ
పిఠాపురం : ప్రముఖ పాద గయ క్షేత్రం పిఠాపురం శ్రీకుక్కుటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. . అష్టాదశ శక్తీపీ ఠాల్లో ఒకటైన శ్రీ పురుహూతిక అమ్మవారు కూడా ఇక్కడై కొలువై ఉండడంతో అమ్మవార్ని దర్శించుకుని భక్తులు తీర్ధప్రసాదాల్ని స్వీకరిస్తున్నారు.
తలుపులమ్మలోవ సమాచారం
తుని : కొండల్లో కొలువైన తలుపులమ్మ అమ్మవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇక్కడ అమ్మవారికి నిత్యపూజలు జరుగుతాయి. కుంకుమార్చనలు, సహస్రనామపూజలు జరుపుతారు. వసతిగదులు అందుబాటులో ఉన్నాయి.
అప్పనపల్లి ఆలయ దర్శిని
మామిడికుదురు : తిరుపతిగా ప్రసిద్ధి చెందిన అప్పనపల్లి బాల బాలాజీ స్వామివారికి ప్రతిరోజు జరిగే సేవలు నిర్వహిస్తారు. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ , 5గంటలకు ఉషకాలార్చన, 6.30 గంటలకు నిత్యహోమం, బలిహరణ, 7.30 గంటలకు నీరాజన మంత్ర పుష్పాలతో అభిషేకం, 8 గంటలకు వేదపారాయణ, 10 నుంచి 12 గంటల వరుకు లక్ష్మి నారాయణ హోమం, అనంతరం స్వామివారికి మహా నివేదన, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పున:దర్శనం. రాత్రి 8 గంటల వరకు దర్శించుకునేందుకు అవకాశముంది. స్వామివారికి ఆరాధన, నిత్యహోమం, బలి హరణ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహిస్తారు. 7.45 నిమిషాలకు స్వామివారికి ఏకాంత సేవ, అనంతరం 8 గంటలకు సర్వ సేవలు పూర్తి చేస్తారు. అనంతరం దేవాలయ దర్శనాన్ని నిలిపివేస్తారు.
వసతి సౌకర్యం..
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం 12 గదులు కలవు. శ్లాట్ బుకింగ్ రోజుకు రూ. 100 మాత్రమే. న్యూ గెస్ట్ హౌస్ లో రోజుకు రూ. 300లు ధరలు నిర్ణయించారు. ఇతర వివరాలకు 08862 -239562కు సంప్రదించవచ్చు.
లక్ష్మీ నారాయణ హోమం రుసుము వివరాలు :
బాల బాలాజి సన్నిధిలో నిత్యం నిర్వహించే లక్ష్మినారాయణ హోమం ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరుకు నిర్వహిస్తారు. భక్తులు కోరిన రోజున గో త్రనామాలతో ఈ కార్య క్రమాన్ని నిర్వహిస్తారు. లక్ష్మీ నారాయణ హోమంలో పాల్గొనదలచిన వారు నేరుగా ఆలయ అధికారులను సం ప్రదించి రుసుము చెల్లించాలి. రోజుకు రూ. 200, నెలకు రూ. 2వేలు, మూడు నెలలకు రూ.5వేలు, ఆరు నెలలకు రూ. 10వేలు, ఏడాదికి రూ. 20వేలుగా రేట్లను నిర్ధారించారు.
భావన్నారాయణ స్వామి ఆలయ సమాచారం
కాకినాడ : కాకినాడ రూరల్ మండలం సర్పవరం భావన్నారాయణస్వామివారి ఆలయానికి భక్తుల తాకిడి పెద్దగాలేదు. ఉదయం 6గంటలకు స్వామివారి పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం దర్శనాలకు భక్తుల్ని అనుమతించారు. మధ్యాహ్నం 12గంటలకు నివేధన జరుపుతారు. అనంతరం దర్శనాల్ని నిలిపేస్తారు. తిరిగి సాయంత్రం 4గంటలకు దర్శనాలకు అనుమతిస్తారు. పర్యాటక శాఖ నిర్మించిన అతిథిగృహంలో గదులు అందుబాటులో ఉన్నాయి. వసతి కోసం ఆలయ కార్యనిర్వహణాధికారిని సంప్రదించాలి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి