రైతుల నేటి పరిస్థితి
సామాజిక పరంగా:ప్రస్తుత కాలంలో ప్రతి రైతు..... తమ పిల్లలకు వ్యవసాయం పని వద్దను కొని వారిని బడికి పంపిబాగా చదివించి ఏదైన ఉద్యోగంలో చేర్చాలని చూస్తున్నాడె తప్ప తనకు వారసత్యంగా వచ్చిన వ్యవసాయాన్ని మాత్రం తన పిల్లలకు ఇవ్వదలచు కోలేదు.
ఒక నాడు రైతు తన పిల్లలకు ""చదవడం రాయడం వస్తే చాలు, వాళ్లేమైనా ఉద్యోగాలు చెయ్యాలా ? ఊళ్లేలాలా? ఈ పొలం చేసుకొని స్వతంత్రం గా బతికాలి "" అని అనుకొన్న అదే రైతు నేడు తన పిల్లలకు వ్యవసాయమె వద్దంటు న్నాడు.
పల్లె ప్రజల మానసిక పరిస్థితే గాదు, సామాజిక పరంగా చూసినా పల్లెల్లో చాల మార్పులు వచ్చాయి. ఆడ పిల్లల తల్లి తండ్రులు తమ పిల్లలను వ్యవసాయ దారులకు ఇచ్చి పెళ్ళి చేయమని ధీమా చెపుతున్నారు. ఆడ పిల్లలు కూడా వ్యవసాయ దారులను పెడ్లాడమని కచ్చితం చేప్పేస్తున్నారు.
దీనిని బట్టి వ్యవసాయ దారుల పరిస్థితి ఎంత దారుణంగా వుందో ఊహించ వచ్చు. వ్యవసాయ దారులైన ఆడ పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారంటే.... సామజిక పరంగా రైతుల పరిస్థితి రాబోవు కాలంలో ఎలా వుంటుందో ఊహకు అందదు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి