హిందువులు షోడశోపచార పూజా విధానంలో దేవుణ్ణి పూజిస్తారు. షోడశ అనగా పదహారు. ఉపచారాలు అనగా సేవలు.
అవి వరుసగా:
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
పూజా వస్తువులు |
- ఆవాహనం = మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించాలి.
- ఆసనం = వచ్చిన వారిని కూర్చోబెట్టాలి.
- పాద్యం = పాద పూజ చేయాలి.
- ఆర్ఘ్యం = చేతులు శుభ్రపరచాలి.
- ఆచమనీయం = దాహమునకు మంచి నీళ్ళివ్వడము.
- స్నానం = శుభ్రమైన నీటితో అభిషేకము చేయాలి.
- వస్త్రం = పొడి బట్టలు కట్టాలి.
- యజ్ఞోపవీతం = యజ్ఞోపవీతమును మార్చాలి.
- గంధం = శ్రీ గంధము చెట్టు చెక్కను సానపై సాదగా వచ్చిన సుగంధమును అలంకరించాలి.
- పుష్పం = పువ్వులతో అలంకరించాలి.
- ధూపం = అగరు బత్తీలు వెలిగించి ఉంచాలి.
- దీపం = ఆవు నెయ్యి లేదా మంచి నూనెతో దీపము వెలిగించాలి.
- నైవేద్యం = మడితో వండిన ఆహారమును లేదా ఫలములు, బెల్లము, మొదలగునవి సమర్పించాలి.
- తాంబూలం = తమలపాకులు వక్కలు తాంబూలముగా ఉంచాలి.
- నమస్కారం = మనస్పూర్తిగా నమస్కరించాలి.
- ప్రదక్షిణం = మన కుడి భుజము వైపున దేవుడు ఉండేలా చూచుకొని దేవుని చుట్టూ తిరగటము.