పాలు బలమైన ఆహారం:
పాలు కూడా జంతు సంబంధమైనదే అయినా, శాకాహార సంబంధమైనదిగానే పరిగణింపబడుతున్నది. వెన్న, జున్ను, పెరుగు, మజ్జిగ, నెయ్యి, కోవాలు పాల సంబంధిత పదార్థాలు. పాలతో మానవాళికి ఉన్న సంబంధం ఈనాటిది కాదు. మానవ సమాజం స్థిరనివాసం ఏర్పరచుకున్నప్పటి నుండి పశువులను మచ్చిక చేసుకోవటం. వాటి నుండి పాలను పిండుకోవటం మనకు తెలిసినదే.
అంటే మానవజాతి, నాగరితకు ఎంత చరిత్ర ఉన్నదో, పాలకూ అంతే చరిత్ర ఉన్నది. కొద్ది కాలం క్రితం వరకు, కులమతాలతో నిమిత్తం లేకుండా, బ్రాహ్మణ, క్షత్రియులతో సహా, అందరి ఇండ్లలోనూ పాడిపశువులు ఉండేవి. పాడి ఒక సంపద. ఇప్పుడు రోజులు మారినా, పాలతో మన అవినాభావ సంబంధం మాత్రం నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నది.
ఇప్పుడు ఆవుపాలు కేవలం శుభకార్యాల వరకే లభిస్తున్నాయి. కర్నాటక వంటి రాష్ట్రాలలో గేదెపాలు లభించవు. ఆవుపాలు మాత్రమే లభిస్తాయి. ఆవుపాలు వేడి చేస్తాయని, సులభంగా జీర్ణం అవుతాయని ఒక నమ్మకం కూడా ఉన్నది.
పోషకల విలువల విషయానికి వస్తే కొద్దిపాటి తేడాలతో, ఆవుపాలలోను, గేదెపాలలోను పోషకాలు దాదాపు సమానం.
అందువలన అవుపాలా? గేదెపాలా అన్నదానితో నిమిత్తం లేకుండా.
పాలలోని పోషక విలువలు:
పాలు మినహాయించి ఏ ఒక్క పదార్ధానికీ ఇంత విశిష్టత లేదు. కేసిన్ అనేక ఒక ప్రొటీన్ కేవలం పాలలో మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క ప్రొటీన్ ఉంటే దాదాపు 80 శాతం మాంసకృత్తులు లభించినట్లే. పాలలో ఉండే క్రొవ్వు అతి సులభంగా జీర్ణం అవుతుంది. పాలలో ఉండే పిండి పదార్ధం లాక్టోస్ రూపంలో ఉండి త్వరగా శరీరానికి వంటపడుతుంది. పాలలో ఉండే ఎ విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బి విటమిన్ నాడీబలాన్ని వృద్ధి చేస్తుంది. విటమిన్ డి ఎముకలు, దంతాల దారుఢ్యానికి ఉపకరిస్తుంది.
మన శరీర నిర్మాణం ఎముకల పటుత్వం, దంత దారుఢ్యం, శారీరక ఎదుగుదల, దృఢత్వం అంతా 15 సంవత్సరాలలోపే ఉంటుంది. అందువలన చిన్న పిల్లలు పాలు ఎక్కువగా తీసుకుంటే శరీర దారుఢ్యం, పటుత్వం, ఎముకలు, నాడీ వ్యవస్థ నిర్మాణం అంతా సమతుల్యంగా ఉంటుంది. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే, శరీరం ఎదుగుదలలో ఏదో ఒక లోపం రావచ్చు. ఆ తర్వాత ఆ లోపాన్ని సరిదిద్దుకోవటం ఎంతో కష్టతరం. అందుకే శరీర ఎదుగుదలకు పరిపూర్ణంగా దోహదపడే పాలు పిల్లలకు అమృతప్రాయం. పరిపూర్ణ సమీకృత ఆహారం. పెద్దలకూ అదేవిధంగా ఉపయోపడుతుంది. అయితే పాలను గురించి తెలుసుకునే క్రమంలో కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవటం అవసరం. పాలు ఎంత శ్రేష్టమైనవి అనేది, ఆ గెదె లేక ఆవు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది.
అదేవిధంగా గేదె లేక ఆవుకు ఏదైనా అనారోగ్యం ఉంటే, వాటి ద్వారా లభించే పాలు కూడా అనారోగ్యకరమైనవే అవుతాయి. ఇందువలన లాభం కన్నా నష్టం ఎక్కువ అన్ని విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే సమయంలో వర్తమాన వ్యాపార యుగంలో పాలధారను పెంచే కృత్రిమ హార్మోన్ ఇంజక్షన్లను ఇచ్చి పాలు పిండుతున్నారు. ఈ ఇంజక్షన్ ఎంత తీవ్రమైనది అంటే ఇంజక్షన్ ఇచ్చిన ఒక్క నిమిషంలోనే పాలు ఎక్కువగా వస్తాయి. ఇటువంటి పాలు విషంతో సమానం. ఈ విషయాలన్నీ మనకు తెలియవు.
అందువలన, వర్తమాన ప్రపంచంలో, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, గేదె లేక ఆవు నుండి నేరుగా పితికే పాలకన్నా పాకెట్ పాలే ఒక రకంగా మంచివని భావించుకోవచ్చు. ఎందుకంటే పాకెట్ పాలను తయారు చేసే క్రమంలో పాలు కొన్ని రసాయన ప్రక్రియలకు లోనవుతాయి. ఆ క్రమంలో పాలలో ఉండే దుష్ట బాక్టీరియా, రోగమయ క్రిములు కనీసం కొంతమేరకైనా నశించటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్యాకెట్ పాలలో క్రొవ్వు చాలా అత్యల్పంగా ఉంటుంది. అందువలన కొలెస్ట్రాల్ భయం కూడా ఉండదు. కాని ఇప్పుడు అవి కూడా కల్తీ అయిపోయాయి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

వేదకాలం నుండి శుభకార్యం నుండి అశుభ కార్యందాకా, పూజలోను హోమాలు, క్రతువులలోను అనివార్యము. అవిభాజ్యము అయిన పదార్థం ఏది అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి ఆవు పాలే. శిశువు భూమిమీద పడ్డప్పటి నుండి సుమారు ఆరునెలలు, సంవత్సరం వరకు తల్లి చనుబాలే శిశువుకు ప్రాణాధారమైనా, అప్పటి నుండి ఆవు పాలు లేదా గేదెపాలే ప్రాణాధారం అంటే అతిశయోక్తి కాదు.ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం పది నుండి పన్నెండు సంవత్సరాలు వచ్చే వరకు బడికి వెళ్లే పిల్లలకు ప్రధాన పోషకాహారం పాలే అన్నది నేటికీ వాస్తవమే. ఇప్పటిమాట తెలియదు కాని, కొన్ని సంవత్సరాల క్రితం వరకు హైస్కూలు స్థాయివరకు పరీక్షలలో అతి తరచుగా అడగబడే ప్రశ్న పాలు సమీకృతాహారం ఎందువలన అంటే.. మనజీవన విధానంలో పాలకు ఉన్న విశిష్టతను అర్ధం చేసుకోవచ్చు. ఇంత విశిష్టమైన పాలను గురించి తెలుసుకోవటం ఎంతో అవసరం. పాలు అంటే ప్రధానంగా గుర్తుకువచ్చేవి ఆవు పాలు, గేదె పాలు.
ఇప్పుడు ఆవుపాలు కేవలం శుభకార్యాల వరకే లభిస్తున్నాయి. కర్నాటక వంటి రాష్ట్రాలలో గేదెపాలు లభించవు. ఆవుపాలు మాత్రమే లభిస్తాయి. ఆవుపాలు వేడి చేస్తాయని, సులభంగా జీర్ణం అవుతాయని ఒక నమ్మకం కూడా ఉన్నది.
పోషకల విలువల విషయానికి వస్తే కొద్దిపాటి తేడాలతో, ఆవుపాలలోను, గేదెపాలలోను పోషకాలు దాదాపు సమానం.
అందువలన అవుపాలా? గేదెపాలా అన్నదానితో నిమిత్తం లేకుండా.
పాలలోని పోషక విలువలు:
- పిండి పదార్థాలు,
- క్రొవ్వు పదార్థాలు,
- మాంసకృత్తులు,
- కాల్షియం ,
- భాస్వరం,
- మెగ్నీషియం,
- ఇనుము,
- సోడియం,
- పొటాషియం,
- పీచు పదార్ధం మొదలైనవి.