యంత్రమును ఎందుకు పూజించాలి?
యం యంత్రమును ఎందుకు పూజించాలి? త్రం అనేది ఎవరైనా ఒక దేవతామూర్తి యొక్క బీజాక్షరాల సమూహముతో జ్యోతిష్య మరియు తాంత్రిక శాస్త్రాల రీత్యా ఉన్న మంత్రములతో ఆ ప్రత్యేకమైన చక్రములలో నిక్షేపము చేసి మొత్తానికి ఆ యంత్రములో సర్వ శక్తులను, అష్ట దిగ్పాలకులను ఆవాహనం చేసే ఒక దివ్యమైన చక్రం. యంత్రములో ఉన్నటువంటి బీజాక్షరాల ప్రభావం వలన నెగెటివ్ ఎనేర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనేర్జీ పెరుగుతుంది.ఎక్కడైతే యంత్ర స్థాపన జరుగుతుందో అక్కడి నుండి నెగెటివ్ ఎనేర్జీ దూరమయ్యి పాజిటివ్ ఎనేర్జే వచ్చి చేరుతుంది. ఈ యంత్ర సాధనా ప్రభావం మన మనస్సుపై పడుతుంది. మానవుని శరీరమును నిత్యం ప్రభావితం చేసేది మనస్సు మాత్రమే. ఆ మనస్సు పై మానవుని సకల ఆరోగ్యము కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా దేవాలయమునకు వెళ్ళినపుడు మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.ఆ దేవాలయము నుండి అడుగు బయట పెట్టగానే ఏదో మాయ కమ్మినట్టు మన మనస్సు యధా విధిగా మారిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే దేవాలయములో ప్రతిష్ట చేసిన విగ్రహాల క్రింద వివిధ వేద మంత్రములతో, బీజాక్షరములతో ఒక యంత్రమునకు జీవం పోసి ప్రతిష్ట చేసి ఉంచుతారు. ఆ యంత్ర ప్రభావము వల్లనే ఆ ప్రాంతం మొత్తం పాజిటివ్ శక్తిగా ఉంటుంది. ఆ పాజిటివ్ శక్తి మన మనస్సు పై పడి మన మనస్సును ఉత్తేజపరుస్తుంది. ఏ సమస్య గురించి మనకు బాధలు కలుగుతున్నాయో అలాంటి ప్రతి సమస్యకు ఒక నిర్ధిష్టమైన యంత్రమును తెలుపటం శాస్త్రమును అవపోసన పట్టిన ఒక్క జ్యోతిష్యునికే ఇది సాధ్యపడుతుంది. ఆ నిర్ధిష్టమైన యంత్రమును ప్రత్యేక బీజాక్షరాలతో, నిర్ధిష్టమైన రోజుల కాలము పాటు శ్రద్ధగా పూజించినట్లైతే సమస్య నుండి విశ్రాంతి లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే యంత్రం అనేది భగవంతునికి ప్రతిబింబం లాంటిది.యంత్రము అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత వాస స్థానం అని కూడా అంటూ ఉంటారు.
మహా సుదర్శన యంత్రము |
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి