అరుంధతీ నక్షత్రం⭐ : అంటే ఏమిటి ?
ముందు అరంధతీ నక్షత్రం (Alcor) కనిపించేది రాత్రి పూట మాత్రమే. తరువాత సప్తఋషి మండలం (Ursa Major) చివర వశిష్టుడి (Mizor) వెనకగా కొంచం చిన్నగా కనిపిస్తుంది అరుంధతీ నక్షత్రం. దీని వెనుక ఒక కథ ఉన్నది.
అరుంధతీ దేవి మహా పతివ్రత, అగ్ని హోత్రుడు సప్తఋషుల భార్యల అందానికి మోహింపపడి క్షీణించి పోతూ ఉండగా వివరం తెలుసుకున్న అగ్ని హోత్రుడి భార్య స్వహా దేవి వశిష్టుడి భార్య ఐన అరుధతి తప్ప మిగతా అందరి భార్యల వెషమూ వెయ్య గలిగింది, కానీ ఎంత ప్రయత్నించినా అరుంధతీ దేవి వేషం వెయ్య లేక పోయింది. అందుకనే మహా పతివ్రత అయిన అరుంధతి కూడా నక్షత్రం నూతన వదూవరులకి సప్తపది అయిన తరువాత చూపించ పడుతుంది . ఇది అగ్ని హోత్రుడు ఆవిడకి ఇచ్చిన వరము.

అరుంధతి భారత పురాణాలలో వశిష్ట మహాముని భార్య మరియు మహా పతివ్రత. భారతీయుల వివాహములో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక ముఖ్యవిధి.
అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లిసమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబు తారు. మాఘమాసాది పంచ మాసాల కాల మందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు.
ఈ చిత్రం: దీప్తి vs మాధవ్ వివాహ మహోత్సవం లో చిత్రీకరించారు - 2019 ! |
అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. ‘?’ మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లాడిని ? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి