వివరంగా చెప్పాలంటే సూర్యుడు పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి.
ప్రతి సవత్సరం లో మనకు పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. కానీ చల్లటి శీతాకాలం లో మంచు కురిసే మాసం లో అనగా జనవరి నెలలో, మకర రాశి లో ప్రవేశించే రోజు ఎంతో ముఖ్యమైనది, దీనినే మకర సంక్రాంతి గా పిలుస్తారు.
పురాణాల ప్రకారం ఈరోజు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంచబడుతాయి అని చెప్పబడింది.
ఈ పండుగ విశేషం లో కి వెళితే , పండుగ నెల రోజుల ముందు నుంచే ఇళ్ళ ముందు ముగ్గులు తప్పనిసరి వేస్తారు.ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెడతారు. ముఖ్యం గా "మన పల్లేటుల్ల" లో గంగిరెద్దులు ఆడించే వాల్లు , హరిదాసులు ,జానపద కళాకారులు , బుడబుక్కల వాళ్ళు కనువిందు చేస్తారు. ఇంతటి ఆహ్లాదకర వాతావరణం లో గడుపుటకు దూరం కూడా లెక్క చేయకుండా బందువుల ఊళ్లకు వస్తారు.
మరొక విశేషం ఈ రోజు కొత్త దాన్యం పోలాల్లోంచి ఇంటికి తరలిస్తారు.
పండుగ రోజు ఆనందం గా పనులు చేస్తారు పల్లెటూరి జనం.
కొత్త సంవత్సరం కొత్త అల్లుళ్ళు ఇంటికి వచ్చినప్ప్పుడు చేసే మర్యాదలు, మరదల్లు బావ లని ఆటపట్తించే చాలా గొప్పగా ఉంటాయి .
పిండి వంటల విషయని కొస్తె ఈరోజు పాలు పొంగిస్తారు, అలా పొంగించిన పాల తో పాయసం చేస్తారు. ప్రతి ఇంట్లో అరిసెలు,బురేలు,జంతికలు ఇలా రకరకాల వంటలు తయారవుతాయి.
వినోద కార్యక్రమాల్లో ముఖ్యం గా , ఎడ్ల పంధెలు, కోళ్ల పంధెలూ , కానీ వీటిని ప్రభుత్వం నిషేదించింది. అయిన పల్లెటూళ్లలో జరుగుతాయనుకో , ఆచారం గా వచ్చినవి త్వరగా మరిచిపోరు పల్లె జనం.
మరొక వినోదం ఏంటంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా భారత దేశం అంత గాలి పటాలు ఎగురవేస్తారు.
తమిళనాడు లో అయితే "జల్లి కట్టు" ఒక కార్యక్రమం.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి