తెలుగు పల్లెల్లో విద్యావిధానం
అప్పటికింకా ప్రభుత్య బడులు పల్లెల్లో లేవు. పాత కాలపు విద్యా విధానమే అమలులో వుండేది. వాటిని వీధి బడులు అనే వారు. వూరి పెద్దలు చదువుకున్న ఒకతన్ని తీసుకొచ్చి అతనికి సకల సౌకర్యాలు కల్పించి ఎక్కడైనా ఖాళి ఇంట్లో గాని, అందుకొరకు కట్టిన సపారులో గాని, పెద్ద ఇండ్లలోని తాళావారంలో గాని, లేదా చెట్ల క్రింద గాని నేలమీద గాని వుండేవి, నేల మీద ఇసుక పోసి దాని పై పిల్లలు కూర్చునేవారు. అయ్యవారు కూర్చోడానికి ఒక మట్టి తో కట్టిన దిమ్మ 'అరుగు ' వుండి దాని పైన చాప వేసి వుండేది.
అప్పటికింకా ప్రభుత్య బడులు పల్లెల్లో లేవు. పాత కాలపు విద్యా విధానమే అమలులో వుండేది. వాటిని వీధి బడులు అనే వారు. వూరి పెద్దలు చదువుకున్న ఒకతన్ని తీసుకొచ్చి అతనికి సకల సౌకర్యాలు కల్పించి ఎక్కడైనా ఖాళి ఇంట్లో గాని, అందుకొరకు కట్టిన సపారులో గాని, పెద్ద ఇండ్లలోని తాళావారంలో గాని, లేదా చెట్ల క్రింద గాని నేలమీద గాని వుండేవి, నేల మీద ఇసుక పోసి దాని పై పిల్లలు కూర్చునేవారు. అయ్యవారు కూర్చోడానికి ఒక మట్టి తో కట్టిన దిమ్మ 'అరుగు ' వుండి దాని పైన చాప వేసి వుండేది.
బడి సమయము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు వుండేది. శలవులు మాత్రము ప్రతి పండగకు, అమావాస్యకు మరియు పౌర్ణమినకు మాత్రమే. ఈ మద్యలో పిల్లలు సద్ది తాగడానికి తొమ్మిది గంటలకు, మధ్యాహ్నము ఒంటి గంట ప్రాంతములో అభోజనానికి,, సాయంకాలము నాలుగు గంటలకు విరామముండేది. ఇక సూర్యాస్థమయానికి బడి వదిలే వారు. బడికి వచ్చే పిల్లలు ఎవరు ముందుగా వస్తే వారు సురి రెండో వాడు చుక్క, వారికి దెబ్బలు మినహాయింపు వుండేది. ఆతర్వాత వచ్చే వారికి అయ్యవారు తన బెత్తముతో మూడో వానికి మూడు దెబ్బలు, నాలుగో వానికి నాలుగు దెబ్బలు ఇలా దెబ్బలు కొట్టే వాడు.
1. అయ్యవారు (ఉపాద్యాయుడు) చదువు చెప్పే విధానము. ఆ రోజుల్లో ఒకే ఉపాద్యాయుడుండేవాడు. ఐదు సంవత్సరాలు వయస్సు దాటితేనే బడిలోనికి చేర్చే వారు. మొదటగా ఓనమాలు నేర్పేవారు. మేము చదివేటప్పటికే పలకా బలపము వచ్చేశాయి. అంతకు మునుపు ఇసుకలో అక్షరాలు నేర్చుకునేవారట.
వ్రాయడానికి పలకు ఉన్నప్పటికీ చదువు అంతా నోటి పాటమే ఎక్కువ. అనగా ఒక పిల్ల వాడు గాని, అయ్యవారు గాని ఎలుగెత్తి ఒక ఎక్కము గాని, పద్యభాగము గాని చెప్పితే దానిని పిల్లలందరు గట్టిగా అరచి చెప్పేవారు. అంతా కంఠాపాటమన్నమాట. కొత్తవారెవరైనా ఊరిలోనికి వస్తే బడి ఎక్కడున్నదో సులభముగా తెలిసి పోయేది. ఎందుకనగా పిల్లలు కోరస్ గా పాఠాలను బట్టి పెట్టుతుంటే ఆ శబ్ధము గ్రామమంతా వినబడేది. పిల్లలు పద్యాలను ఆ విధంగా బట్టీ పెట్టుతుంటే ఊరిలోని పెద్దలు వారి ఇళ్లముందు అరుగుల మీద గాని, రచ్చ బండ మీద గాని కూర్చున్న వారు సుమతీ శతక, వేమన శతక పద్యాలను ఆ విధంగా నేర్చు కున్నవారు ఎక్కువ. ఆ రోజుల్లో చదువుకున్న పెద్దలు అతి తక్కువ.
ఇప్పట్లోలాగ ఆ రోజుల్లో పిల్లలకు తరగతులు లేవు. వున్నవల్లా పెద్దబాల శిక్ష, బాల రామాయణము, అమరకోశము, ఆదిపర్వము, గజేంద్ర మోక్షము ఇలా వుండేవి. అందరికి లెక్కలు మాత్రము వుండేవి. అందులో ముందుగా ఎక్కాలు, తరువాత కూడికలు, తీసివేతలు, గుణకార బాగహారాలు, వడ్డీ లెక్కలు, బాండు వ్రాసే విధానము, ఇలా వుండేవి. లెక్కల్లో నోటి లెక్కలు అనే ఒక విధానముండేది. అందులో అయ్యవారు ఒక విద్యార్థులకు ఒక లెక్క ఇస్తాడు. ఒక ఆసామి రెండు వందల రూపాయలను నూటికి నెలకి ఒక రూపాయి చొప్పున వడ్డికి ఇచ్చాడు. మూడు సంవత్సరాల తర్వాత అప్పు తీసుకున్న వాడు చెల్లించాల్సిన మొత్తమెంత? అయ్యవారు లెక్క చెప్పుతున్నప్పుడే పిల్లలు మనసులో లెక్క వేసుకోవాలి. అయ్యవారు లెక్క పూర్తి చేయగానే సమాదానము చెప్పాలి. అలా ఎవరు ముందు చెపితే వారు గొప్ప. ఇలా వుండేవి లెక్కలు. ఇప్పట్లో లాగ ఆ రోజుల్లో దశాంశాలు, కిలోలు వంటి మెట్రిక్ పద్ధతి వుండేది కాదు. అది ఆనాటిది రూపాయలు, అణాలు, పైసలు లాగానే, ఇతర గణాంకాలు అనగా కొలతలు, బరువులు, మొదలగునవి.... మణుగు, వీశెలు, శేరులు, ఫలము, తులము ఇలా అంగుళము, గజము, ఫర్లాంగు, మైలు, క్రోసు ఇలా దూరాల కొలతలుండేవి.
2. ఆ కాలములో ఓనమాలు, ఎక్కాలు కా గుణితము ఇసుకలో దిద్దించి చెప్పించుచుండిరి. నేటికిని దాని జాడలు పెక్కు పల్లెలలో ఉన్నాయి. పేర్లు వ్రాయడము నేర్పినపిమ్మట పలక పట్టించేవారు. తర్వాత భాగవత భారతాలు చదివించేవారు.