యోగాసనాలు వేయటంలోని సూచనలు:
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
- భోజనానంతరం వెంటనే యోగాసనాలు వేయకూడదు. భోజనం తరువాత కనీసం 4 గంటలు, అల్పాహారం (టిఫిన్) తరువాత 2గంటలు విరామం ఉండాలి.
- స్నానానికి ముందయినా, తరువాతయినా యోగాసనాలు వేయవచ్చు. అయితే దేనికయినా అరగంట గ్యాప్ ఉండాలి.
- ఆసనాలు, వ్యాయామం ఒకసారి కలగలుపు చేయకూడదు.
- వ్యాయామంచేసిన తరువాత శవాసనంవేసి విశ్రాంతి తీసుకుని ఆసనాలు వేయటం ప్రారంభించవలెను.
- ఒక ఆసనం వేసి తరువాత ఆ భంగిమలో శరీరానికి విశ్రాంతి నివ్వటం చాలా ముఖ్యం అన్ని సమస్యలనూ వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండాలి.
- ఒక్కో ఆసనానికీ మధ్య కొంత గ్యాప్ ఉండాలి.
- ఆసనాలు వేసి తరువాత హాయిగా విశ్రాంతిగా ఉండాలి.
- అలసిపోయినట్లుగా చెమటలు పట్టడంలాంటివి ఉండకూడదు.
- ప్రారంభంలోనే శక్తికి మించి ఆసనాలు వేయాలని అనుకోకూడదు.
- నెమ్మదిగా ప్రారంభించి విూ కనుగుణంగా సమయం పెంచుతూ ఉండాలి.
- ఈ ప్రతిరోజూ సాధన చేయటం వల్లనే పురోగతి ఉంటుంది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి