తిరుమల: తిరుమలలో గురువారం నాడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 5 గంటలు, కాలి నడక భక్తులకు 4 గంటల సమయం కేటాయించారు.
- అలిపిరి మెట్లదారిలో గాలిగోపురం, శ్రీవారిమెట్టు మార్గంలో ఉచిత సుదర్శనం టోకన్లు భక్తులకు టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల నుంచి భక్తుల కోసం వారి లగేజిని ఉచితంగా తిరుమలకు తరలించే కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- టీడీడీ చైర్మెన్ , పాలకమండలి సభ్యులు, మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖుల సిఫారసు ఉత్తరాల పై తిరుమల జెఇఓ కార్యాలయంలో దర్శనం, సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ దరఖాస్తులను సేవకు ముందురోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జెఇఓ కార్యాలయంలో సమర్పించాలి. సాయంత్రం 5 గంటలకు సెల్ఫోన్ మెసేజ్ ఆధారంగా సేవలు మంజూరు అయినది లేనిది తెలియ పరుస్తారు.
- 50 రూపాయల సుదర్శన్ టోకన్లు తిరుపతిలోనే శ్రీనివాసం కాంప్లెక్సు, ఆర్టిసి బస్టాండు, అలిపిరి లగేజి కౌంటర్, శ్రీవారి సన్నిధి, రేణిగుంట రైల్వేస్టేషన్ సమీపంలో బయోమెట్రిక్ పద్దతి పైన భక్తులు పొందవచ్చు.
- తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం (సిఆర్), వైకుంఠం క్యూ కాంప్లెక్స్ , అన్నదానం, కళ్యాణకట్ట, కాటేజి విచారణ కార్యాలయాల వద్ద పిర్యాదుల పెట్టెలను టీటీడీ ఏర్పాటు చేసింది.
- భక్తుల సమస్యలను ప్రతినెలా మొదటి శుక్రవారం డయల్ యువర్ ఇఓ కార్యక్రమంలో 0877 – 2263261 నెంబరు ద్వారా ఫోన్లో కార్యనిర్వహణాధికారితో మాట్లాడి అమూల్యమైన సలహాలను అందించవచ్చు.
- తిరుమలలో 18 వేల మంది భక్తులకు సరిపడే 3 యాత్రికుల వసతి సముదాయాలు అందుబాటులో ఉన్నాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులు, తదితర సౌకర్యాలు ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ ఉన్న లాకర్లలలో భక్తులు తమ లగేజీలను భద్రపరుచుకోవచ్చు.
- సిఆర్ ఓ అడ్వాన్సు రిజర్వేషన్ కౌంటర్లో ముందుగా గదులు రిజర్వ్ చేసుకున్న భక్తులకు 100 రూపాయల గదులు హెచ్విడిసి, రాంభగీచా అతిథిగృహాలు, వరాహస్వామి అతిథిగృహాలు వీటిలో కేటాయిస్తారు.
- సిఆర్ఓ టీబి కౌంటర్లో 100 రూపాయల గదులు శేషాద్రినగర్, సప్తగిరి అతిధిగృహాలు, టీబిసి, ప్రాంతాలలోని కాటేజిలను కేటాయిస్తారు.
- సిఆర్ఓ జన్రల్లో, సప్తగిరి సత్రాలలో అద్దె గదులు పొందవచ్చు, ఉచిత గదులను కూడా ఇక్కడ కేటాయిస్తారు. 50 రూపాయలు అద్దె ప్రాతిపదికన శేషాద్రినగర్, శంఖుమిట్ట, అంజనాద్రినగర్, గరుడాద్రినగ ర్లోని గదులను ఈ కౌంటర్ ద్వారా పొందవచ్చు.
- వివిఐపిల కోసం 100 రూపాయల నుంచి 6000 వేల రూపాయల వరకు వివిధ రకాల అద్దె గదులను పద్మావతి అతిథి గృహంలో పొందవచ్చు.
- శ్రీవారి అర్జిత సేవలు వసతి సమాచారం కోసం టీటీడీ కాల్ సెంటర్ నెంబర్లు
- 0877 – 2233333 , 2277777 , 2264252.
- టీటీడీ దాతల వివరాలకు 0877 – 2263472 కు సంప్రదించండి.
- ఉచితసేవలకు ఇతర కార్యక్రమాలకు లంచం అడిగితే విజిలెన్సు టోల్ ఫ్రి 18004254141 నెంబర్కు సంప్రదించండి.