పల్లెల్లో పండగలు
1. భోగి పండుగ
వ్వయసాయ దారులైన పల్లె వాసులు తమ వ్యవసాయ పనులన్ని ఒక్క కొలిక్కి వచ్చి పంటలన్నీ ఇంటికొచ్చి న సమయాన వచ్చేదే సంక్రాంతి పండగ. మిగతా పండగలు ఎలా వున్నా రైతుకు ప్రాముఖ్యానిచ్చేదె సంక్రాంతి. ఇవి వరుస పండగలు. ఈ వరుసలో ముందుగా వచ్చేది బోగి పండగ. ఈరోజున తెల్లవారు జామునే ఇంటి ముందు బోగి మంటలు వేస్తారు. ఇంట్లో వున్న పాత సామానులు పనికి రానివన్ని అనగా చాటలు, గంపలు, తట్టలు, చీపుర్లు, అన్నీ ఎవరింటి ముందు వాళ్ళు బోగి మంట పెట్టి కాలుస్తారు. అవన్ని తొందరలో కాలిపోతాయి. ఆ తర్వాత కంపలు, చెత్త, కట్టెలు వేసి మండించి చలి కాచు కుంటారు. మంట వేడికి శరీరం ముందు భాగం బాగా వేడిగా వుంటే వాతావరణం లోని చలికి వీపు బాగ చాల చల్లగావుంటుంది. ఇదొక వింత అనుభూతి. తెల్లవారి కోడిని కోసి లేదా వేరె వూర్ల నుండి వేట కూర తెచ్చి వండి అందులోకి వడలు చేసి తింటారు. కొన్ని ప్రాంతాలలో చిన్న పిల్లలకు బోగి పండ్లు పోస్తారు. తరువాత వచ్చేది సంక్రాంతి,

2. సంక్రాంతి
సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దుల వారు పల్లెల్లో తిరుగుతుంటారు. గంగిరెద్దు

అదె పెద్ద పండగ. ఈ రోజున పెద్దలు తమ తల్లి దండ్రులు చనిపోయిన వారు వారి ఆత్మ శాంతి కొరకు ఉపవాసముండి స్నానం చేసి అయ్యవారి రాక కొరకు ఎదురు చూస్తుంటారు. అయ్యవారు అంటే ఆ ప్రాంత బ్రాంహడు. కొన్ని పల్లెలకు కలిపి ఒక బ్రాంహడు వుంటాడు. అన్ని శుభాసుభ కార్యాలకు అతను రావలసిందే. వేరెవ్వరు రావడానికి వీలు లేదు. ఇది అతని ఇలాకా. ఆ అయ్యవారు వచ్చి నంత వరకు ఆ గృహస్తుడు ఉప వాసముంటాడు. ఆతను వచ్చాక పూజా కార్యుక్రమాలు ప్రారంబించి గృహస్థుని చేత అతని పెద్దలకు తర్పణ, ఇస్తాడు, కాకులకు పిండ ప్రధానం చేయిస్తాడు. ఇలా పెద్దలకు తర్పణ ఇస్తున్నందుకె దీన్ని పెద్ద పండగ అన్నారు. పూజానంతరం, గృహస్తుడిచ్చిన దక్షిణ.. అనగా బియ్యం, కూరగాయలు, పప్పులు మొదలగునవి తీసుకొని మరొక్కరింటి కెళతాడు. ఈరోజున మాంసం వండరు. ఈ రోజున అనేక పిండి వంటలు చేస్తారు. ఈరోజు తప్పక వుండవలసిన పిండి వంట అరిసెలు పిల్లకు పిండిపంటలె పండగ. ఈరోజు నుండే గొబ్బెమ్మ పాటలు పాడతారు ఆడ పిల్లలు. ఇంటి ముందు కళ్ళాపి చల్లి అందమైన ముగ్గులేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మను తీరుస్తారు. గొబ్బెమ్మ అంటే ఆవు పేడను ముద్దగా చేసి ముగ్గు మధ్యలో పెట్టి మధ్యలో గుమ్మడి పూలు పెడ్తారు. ఆ ఊరి ఆడపిల్లలందరూ కలిసి ఒక జట్టుగా చేరి అలంకరించుకొని, ఒక పళ్లెంలో పశుపు ముద్దను వుంచి దానిపై దీపం పెట్టి, చుట్టు పూలను అలంకరించి ప్రతి ఇంటికి వచ్చి ఆ పళ్లేన్ని క్రింద పెట్టి దాని చుట్టు తిరుగుతు తమ రెండు చేతులు తట్టుతూ గొబ్బెమ్మ పాటలు పాడతారు. ఆ ఇంటి వారు దీపంలో నూనె పోసి వారికి బియ్యం కొంత డబ్బులు ఇవ్వాలి. చివరి రోజున ఆ పిల్లలందరు వచ్చిన బియ్యాన్ని పొంగలిపెట్టి తిని ఆనందిస్తారు. ఇది ఆ వూరి ఆడపిల్లల సంబరం. ఈ తతంగం అంతా ఏ వూరి ఆడపిల్లలు ఆవూర్లోనె. పక్క ఊరికెళ్లరు. కానీ.... ఇంత కాలము వ్యవసాయదారుల పొలాల్లో కూలీ చేసిన ఆడవాళ్ళు, ముఖ్యంగా హరిజనులు ఈ రోజున ప్రతి రైతు ఇంటి ముందు గొబ్బెమ్మ పాటలు పాడి ఆడతారు. వారికి రైతు కుటుంబం ధాన్యం, డబ్బులు శక్తాను సారం బారీగానె ఇస్తారు. ఇచ్చినది తక్కువనిపిస్తే వారు వెళ్లరు. బలవంతం చేస్తారు సాధించు కుంటారు. అదే విధంగా పరా వూరు నుండి కొంత మంది హరిజన మహిళలు వచ్చి గొబ్బెమ్మ పాటలు పాడతారు కాని ఇచ్చింది తీసుకుని వెళతారు. ఇలాంటి వారు యాచకులు కాదు. కేవలం సంక్రాంతి సందర్భంగానె గొబ్బెమ్మ పాటలు పాడి ఆసిస్తారు. అలాగె గంగి రెద్దుల వాళ్లకు కూడా ఇది పెద్ద పండగే. వారు గంగి రెద్దును ఆడించి రైతుల మెప్పించి బహుమతులను పొందుతారు. గంగిరెద్దుల వారు ప్రదార్శించె విన్యాసాలలో ముఖ్యంగా చెప్పుకో దగ్గది గంగిరెద్దుల వాడు రోడ్డుమీద వెల్లకిలా పడుకొని తన ఎద మీద గంగిరెద్దు ముందరి కాళ్లను పెట్టించుకొని ఆడించడము. రైతులు గంగిరెద్దుల వారికి ధాన్యాన్ని, వేసి పాత బట్టలను, చీరలను ఆ గంగిరెద్దు మీద వేస్తారు. ఆ విధంగా గంగిరెద్దు పైన అనేక మైన రంగులతో బట్టలు కనిపిస్తాయి. ఎవరైనా ఆడపిల్లలు ఎక్కువ బట్టలు వేసుకొని ఆడంబరంగా కనిపిస్తే గంగిరెద్దులా తయారయావేంది? అని అంటుంటారు. ఇది ఒక నానుడి.
3. కనుమ పండగ
మూడో రోజున వచ్చేది కనుమ పడుగ. కనుమ పడగ నాడు కూడా పిండి వంటలదే అగ్ర స్థానం. పార్వేట ఈ నాటి ప్రధాన ఘట్టం. వైష్ణవాలయం ప్రధానంగా వున్న ఒక పల్లె లోనుండి దేవుడిని పల్లికిలో మంగళ వాయద్యాలతో ఆ చుట్టు పల్లెలలో వూరేగించి చివరన దగ్గరలో వున్న కొండ ప్రాంతంలో గాని మైదాన ప్రాంతంలో గాని దేవుడిని దించి అక్కడ శమీ వృక్షం క్రింద పూజ నిర్వహించి, అప్పటికె పూజించి సిద్దం చేసు కున్న ఒక గొర్రె పొట్టేలును దూరంగా ఆ కొండ వాలులో కట్టేసి సుమారు ఒక కిలో మీటరు దూరంలో ఒక హద్దు ఏర్పరచి అక్కడ అందరు నిలిచి తమ తుపాకులతో దూరంగా వున్న గొర్రె పోతును కాల్చాలి. ఎవరు కాసిస్తే అది వారికే చెందు తుంది. ఎవరూ కాల్చ లేక పోతె అది ఇంతవరకు దేవుని వూరేగింపులో పాల్గొన్న మంగలి వారికి చెందు తుంది. మంగలి వారు ఆ జమ్మి చెట్టు కింద కూర్చొని ఆ పొట్టేలుకు ఎలాంటి దెబ్బ తగల కుండుటకు ఏవో కనికట్టు విద్యలు, మంత్రాలు వేస్తుంటారు. తుపాకులు లేనివారు తూటాలు తెచ్చుకొని ఇతరుల తుపాకులతో ప్రయత్నిస్తారు. చుట్టు ప్రక్కల పల్లె వాసులకు ఇదొక పెద్ద వినోద కార్యక్రమం. ఈ ఆచారానికి మాతృక తిరుమల లోని శ్రీ వేంకటేస్వర స్వామి వారికి కనుమ రోజున వేటగాని వేషం వేసి విల్లంబులు ధరింప జేసి గోగర్బం డాంకు ఎదురుగా వున్న పార్వేట మిట్టకు ఊరేగింపుగా తీసుక వస్తారు. అక్కడ స్వామి వారు క్రూర మృగాలను వేటాడి నట్టు కొన్ని కార్యక్రమాలు చేసి తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుతారు. ఆరోజుల్లో తిరుమల వాసుడు విల్లంబులతో క్రూర మృగాలను వేటాడితే ఈ నాడు మానవుడు తుపాకులతో బంధించి వుంచిన గొర్రె పోతును వేటాడ తారు. అదీ ఆ దేవుని పేరు మీద

4. పశువుల పండుగ
పశువుల పండగే ఈ వరుసలో చివరిది. ఈ రోజున పిండి వంటలదే పండుగ. సాయంకాలం ఊరి బయట కాటమ రాజు వద్ద పొంగిళ్లు పెట్టి పూజ చేస్తారు. కాటమ రాజు అంటే అక్కడేమి గుడి వుండదు. ఒక చెట్టు క్రింది తాత్కాలికంగా రెండు రాళ్లను పెట్టి వాటిని కడిగి వీబూతి పట్టెలు పెట్టి ఆ ప్రాంతమంతా శుభ్రం చేస్తారు. అక్కడి పూజారి ఆ వూరి చాకిలే. ఆ దేవుని ముందు వూరి ఆడవారందరు గిన్నెల్లో బియ్యం, బెల్లం తెచ్చి అక్కడే పొయ్యిలు ఏర్పాటు చేసి పొంగలి వండుతారు.. ఇంత లోపల చాకలి దేవుని వద్ద అలంకరణ పూర్తి చేస్తాడు. అందరు తలోక పొంగలి ముద్దను తీసి దేవుని ముందు కుప్పగా పెడ్తారు. చాకలి పూజా కార్యక్రమం కానిస్తాడు. అప్పటికే వూర్లో వున్న ఆవులను ఎద్దులను అన్నింటిని ఇక్కడికి తోలుకొస్తారు. కోళ్లను మొక్కుకున్న వాళ్ళు చాకలికి తమ కోళ్లను ఇస్తారు. అతను వాటిని కోసి దేవుని ముందు వేస్తాడు. పూజానంతరం పొంగలిని తలా కొంత ప్రసాదంగా తీసుకొని ఒక పెద్ద పొంగలి ముద్దను పశువుల కాపరికి ఇచ్చి తినమని, అతని వీపుకు ఇంకొక ముద్దను కొడతాడు చాకలి. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పొంగలిని తింటూ పశువులకున్న పగ్గాలను, దారాలను తీసేసి తరుముతాడు. అవి తలోదిక్కుకు వెళ్లి పోతాయి. అప్పటికి చేలన్నీ పరిగిలి పోయి వుంటాయి కనుక అవి ఎక్కడ ఏ చేల్లో దూరినా అడగడానికి లేదు. ఆరాత్రికి పాలు తాగె దూడలను కూడా కట్టడి చేయరు. అనగా పశువులకు స్వాతంత్ర్యం అన్నమాట. అదే పశువుల పండుగ. ఆ సందర్భంలోనె ఒక నెల నుండి కాటమరాజు ముందు ఆధారిన వచ్చి పోయె, పశువుల కాపరులు, రైతులు అక్కడ ఒక కంపో, కర్రో వేస్తుంటారు. ఈ నాటికి అది ఒక పెద్ద కుప్ప అయి వుంటుంది. పశువుల కాపరి ఆ కుప్పకు నిప్పు పెట్టి పశువులను బెదిరించి తరిమెస్తాడు. ఆ కంపల కుప్పను చిట్లా కుప్ప అంటారు. ఆ మంట ఆరిపోయిన తర్వాత అందరు అక్కడి నుండి నిష్క్రమిస్తారు. ఇంటి కెళ్లి దేవుని వద్ద కోసిన కోళ్లలు బాగు చేసుకుని కూర వండుకుని తింటారు.

ఈ పండుగకు జరిగే జల్లికట్టు చిత్తూరు జిల్లా మరియు తమిళనాడులో బారి ఎత్తున జరుగు తుంటాయి. వీధుల్లో డప్పులను వాయించి అలంక రించిన పశువులను తరుము తారు. అలా రెండు మూడు సార్లు పశువులను తరిమాక ఆ తర్వాత అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు రంగులతో అలంక రించిన బలమైన ఎద్దులలు, కోడెలను తరుముతారు. ముందుగా వాటి కొమ్ములకు రంగులు పూసి ఒక తువ్వాలు కట్టి అందులో వంద రూపాయలు వారి స్థాయిని బట్టి ఐదు వందల రూపాయలను కట్టి అల్లి వద్ద నిలిపి డప్పులతొ వాటిని బెదిరించి తరుముతారు. ధైర్యం వున్న వారు వాటిని పట్టి లొంగ దీసుకొని దాని కొమ్ములకు కట్టిన బట్టలోని డబ్బులు తీసుకోవచ్చు. దాని కొరకు కొంత మంది బలవంతులు తయారుగా వుంటారు. కొన్ని ఎద్దులు, లేదా కోడెలు తమ యజమానిని తప్ప ఇతరుల నెవ్వరిని దరి చేరనియ్యవు. అలాంటి వాటిమీద చెయ్యి వేయడమే ప్రమాదం. అటు వంటి వాటిని బెదరగొట్టిన తర్వాత వాటిని లొంగ దీసు కోవడం చాల ప్రమాధ కరమైన పని. అయినా కొందరు ఈ సాహసానికి పూను కుంటారు. ఇంకొన్ని ఎద్దులుంటాయి. అవి వట్టి బెదురు గొడ్డులు. వాటిని బెదిరిస్తే అవి చేసె వీరంగం అంతా ఇంతాకాదు. వాటిని ఆపడం అతి కష్టం. వీటి వలన ప్రమాదం ఎక్కువ. ఎందు కంటే ఇవి బెదిరి పోయి ఇరుపక్కల క్రీడను చూస్తున్న జనంలోకి దూరి పోతాయి. ఈ క్రీడలో చాల మందికి గాయాలవు తుంటాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరుగు తుంటుంది. ఇలాంటి క్రీడను ప్రభుత్యాలు నిషేధించినా ఫలితం లేదు. ఇటు వంటి క్రీడ పలాన పల్లెలో జరుగు తుందని ముందుగాని ఆ చుట్టు ప్రక్కల పల్లెల్లో దండోర వేసి తెలియ జేసి వుంటారు. దాంతో ఆ చుట్టు ప్రక్కల రైతులు తమ ఎద్దులను కోడెలను అలంకరించు కొని అక్కడికి తీసు కెళతారు.
5. గంగ పండగ:
రైతులు చేసుకునె పండగలలో వాటి ప్రధాన్యత రీత్యా గంగ పండగ రెండొ స్థానంలోకి వస్తుంది. ఇది మేనెలలో వస్తుంది. అప్పటికి వ్వవ సాయ పనులు అన్నీ పనులు పూర్తి అయి వుంటాయి. రైతులకు వ్వవ సాయ కూలీలకు ఇది ముఖ్యమైన పండుగ. ఈ పండగకు మాతృక తిరుపతిలో బారు ఎత్తున జరిగే గంగ జాతర. అందు చేత ఈ పండుగ చిత్తూరు జిల్లాలోనె ప్రాముఖ్యత. ఇతర జిల్లాలలో ఈ పండగ వున్నట్లు లేదు. ఇది ముఖ్యంగా వ్వవ సాయ కూలీల పండగ. ఇంకా చెప్పాలంటే హరిజనుల పండుగ. వారి ఈ పండగ రోజున ముఖ్యంగా పులి వేషం ఇంకా ఇతర వేషాలు వేసి ఆడి పాడి రైతులను మెప్పించి వారి నుండి రైతు స్థోమతను బట్టి బహుమతులను అనగా ధాన్యం, బెల్లం, వస్త్రాలు బహుమతిగా పొందు తారు. పులి వేషాలను ఎవరు బడితే వారు వేయలేరు. ఆ వేషం వేయడానికి మంచి దేహదారుడ్యం వుండాలి. మంచి ఆరోగ్య వంతుడై వుండాలి. ఎందుకంటే అతను వేసే గంతులకు చేసే విన్యాసాలకు అతని శరీరము సహకరించాలి. పులి వేష ధారి మొలకు ఒక లంగోటి మాత్రం కట్టుకొని శరీరమంతా పశుపు రంగు చారలు తీర్చి, తలకి పులి కన్నులవలె దిద్దిన, మద్యలో రంద్రాలున్న మరియు పులిచెవులు లాంటి చెవులున్న టోపి ధరించి, (దీనిని ఈ వేషం కొరకే తయారు చేసుకుంటారు.) నోట్లో పెద్ద నాలుకలాగ ఒక ఎర్రటి అట్టముక్కను పెట్టుకొని తయారవతాడు. అతని నడుముకు దారాలు కట్టి ఇద్దరు వ్వక్తులు పగ్గాలతో అతనిని పట్టుకొని నియంత్రిస్తూ వుంటారు. ఒక పొడవాటి వెదురు బద్దకు రంగు కాగితాలు కట్టి ఒక కొసన ఒక పెద్ద బుట్టను కట్టి దానిని కూడా రంగు కాగితాలను అతికించి వుటారు. ఒక వ్వక్తి దానిని రెండో చివరన పట్టుకొని పులి వేష ధారి వెనక నిలబడి రెండో చివరన నున్న బుట్ట భాగాన్ని పులి వేషదారుని ముందు వచ్చేటట్టు పట్టుకొని వూపుతూ వుంటాడు. ఇద్దరు ముగ్గురు డప్పులు కొడుతుండగా ఆ డప్పులకు అనుగుణంగా పులి వేష ధారి అడుగులు వేస్తూ, పైన వూగు తున్న రంగు కాగితాల బుట్టను చూస్తూ పులి లాగా ఆడుతుంటాడు. ఒక రిద్దరు ఉత్సాహ వంతులు అతనికి తోడుగా ఆడు తుంటారు. ఈ విధంగా ఆడుతూ వారికి సంబంధించిన పల్లెల్లో మాత్రమే అనగా వారు పనిచేసే రైతులున్న పల్లెల్లో మాత్రమే తిరుగుతారు. ప్రతి రైతు వారి స్థాయిని బట్టి ధాన్యము, ధనము, పాత బట్టలు ఇస్తారు. వారికిచ్చిన ప్రతిఫలము వారికి తక్కువగా అనిపిస్తే సాధించి తీరుతారు. రైతుల వంటి పైనున్న పై వస్త్రాన్ని లాక్కుంటారు. చివరగా ఆ యింటి నుండి వెళ్ళే టప్పుడు ఆ రైతు పేరున వారి కుటుంబం వారి పేరు పది నిముషాల సేపు ఆసువుగా పాట పాడగా దానికి తగిన డప్పు వాయిద్యాలు, ధరువులు వేసి పొగిడి తర్వాత మరొక ఇంటికి వెళతారు. పెద్ద రైతులు వారికి కొన్ని బట్టలు, డబ్బులు, ఒక బస్తా వడ్లను కూడా ఇస్తారు. సామాన్య రైతు సాధారణంగా ఒక గంప వడ్లును ఇస్తారు. ఈ పులివేష ధారణ ఆబాల గోపాలన్ని చాల అలరిస్తుంది.

సంవత్సరంపాటు రైతుల వద్ద పొలంలో పని సేసిన కూలీలు, ఇతర కుల వృత్తుల వారు ఈ పండగ నాడు రైతుల వద్ద నుండి ధాన్యం రూపంలో బాగానె నజరాన పొందుతారు. కూలీలైతే చిత్ర విచిత్ర వేషాలు ధరించి ఊర్ల లోని రైతులను మెప్పించి ఫలితం పొందుతారు. ముఖ్యంగా పులి వేషం వేషధారి ఆబాల గొబాలాలను మెప్పిస్తారు. చిన్న పిల్లలకు ఇది పెద్ద పండగ. పులి వేష గాని వెంబడి డప్పు, పిల్లనగొయ్యి, ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉండగా ఇతరులు ఆడుతుండగా పులి వేషధారి గంతులు వేస్తూ పల్టీలు కొడుతూ నానా హంగామా చేస్తాడు. ఇది అందరికీ పండగే.
ప్రధానమైన పల్లెల్లో ఈ రోజున దున్న పోతును బలి ఇస్తారు. వీధి మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన గుడిలోని అమ్మోరును పూజించి గుడి ముందు ఆడి పాడి తెల్ల వారజామున బలి కార్యక్రమం కానిస్తారు. ఆ భయాన దృస్యాన్ని చిన్న పిల్లలు చూడ కూడదని ఆ సమయాన్ని నిర్ణ యిస్తారు. ఈ విచిత్ర వేష దారులు అనేక బూతు పాటలు పాడుతూ ఆడుతూ వీధుల్లో తిరుగుతారు. ఈ పండుగ రైతులకు వ్వవ సాయకూలీలలకు ప్రత్యేకం. ప్రస్తుతం దున్న పోతు బలులు తిరుపతిలో గంగ జాతరలో గాని ఇతర పల్లెల్లో గాని జరగడం లేదు. కానీ సాధారణ పల్లెల్లో జరిగే కార్యక్రమం ఏమంటే హరిజనుల (ఇంత కాలం రైతుల పొలాల్లో పనిచేసిన కూలీలు) వివిధ వేష దారణతో ఆడి పాడి రైతులను మెప్పించి కొంత ధాన్యాన్ని బట్టలను ఉదారంగ పొందు తారు. వీరు ఇంత కాలం ఏరైతుల వద్ద పనిచేశారో వారి పల్లెలకే వెళతారు. వేరొకరి ఇళ్లకు వెళ్ళరు. పొద్దంతా వీరి ఆట పాటలతో మురిసి పోయిన పల్లె వాసులు సాయంత్రం కాగానె గంగమ్మకు పొంగిలి పెడ్తారు. దీని కొరకు ఒక వేప చెట్టు వుంటుంది. అక్కడ చాకలి ఒక రాయిని గంగమ్మ తల్లిగా ఏర్పాటు చేసి చుట్టు వేపాకు మండలతో చిన్న పందిరిని ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఆ పల్లె వాసులందరు పొంగిలి పెట్టి గంగమ్మ తల్లికి మొక్కు కుంటారు. సర్వ సాధారణంగా ప్రతి ఒక్కరు కోడిని బలి ఇస్తారు. ఈ పూజా కార్యక్రమాన్ని చాకలి విర్వహిస్తాడు. ప్రతి పలంగా అతనికి బలి ఇచ్చిన కోడి తల, అక్కడ కొట్టిన కొబ్బరి కాయ పై చిప్ప చాకలికి చెందు తారు. ఆ విధంగా ఆరోజు గంగ పండుగ పరి సమాప్తం అవుతుంది.
6. పొంగలి: సాధారణంగా పొంగలి అంటే తమిళ నాడు ప్రాంతంలో ఇడ్లి, దోసె, వడ, పంటి పదార్తాలతో బాటు ఇదొక అల్పాహారం. కాని ఈ ప్రాంతంలో పొంగలి అంటే దేవుని ముందు అప్పటి కప్పుడు పల్లె వాసులు అందరు కొత్త పొయ్యిలు ఏర్పాటు చేసి, కొత్త కుండలో, కొత్త బియ్యం వేసి అందులో కొత్త బెల్లం ఇతర సుగంద ద్రవ్యాలు వేసి అప్పటి కప్పుడు తయారు చేసె ప్రసాదమే పొంగలి. ఎక్కువగా గంగమ్మ జాతరల వద్ది పొంగిల్లు సామూహికంగా పెడతారు. దాన్నే ప్రసాధంగా గంగమ్మకు పెట్టి తర్వాత ఆ ప్రసాదం స్వీకరిస్తారు.
7. దీపావళి:దీపావళి,నరకచతుర్దశి ఇది పిల్లల పండుగ. ఈ రోజున అనేక పిండి వంటలు చేసి తిని, టపాకాయలు కాల్చడమే పిల్లలకు పండగ. ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని రకాల టపాకాయలు లేవు. అప్పట్లో కాల్చిన కొన్ని రకాలు ఇప్పుడు లేవు. ఆరోజుల్లో చిన్న శబ్దం చేసేవి మాత్రమే వుండేవి. అవి గాక చిటపటలు, తాటాకు టపాకాయలు, కాకర పువ్వొత్తులు, బత్తాసు పుల్లలు, సురు సురు బుడ్లు, ఇలాంటివాటిని మితంగా కొనేవారు. అవి ఆరోజుల్లో పెట్లొప్పు అనే ఒక గందకం పొడి దొరికేది. అర్ద రూపాయికి ఒక ఫలం పెట్లొప్పు దొరికేది. దాన్ని తవ్వలు అనె పరికరంలో వేసి రాతికేసి కొడితే పెద్ద శబ్దం వచ్చేది. తవ్వలు అనగా రెండంగుళాల పొడవు ఒక అంగుళం వ్వాసం కలిగిన ఇనుప ముక్కకు ఒక వైపున ఆర అంగుళం లోతున సన్నని గుంట వుంటుంది. రెండో వైపున దారం కట్టుకోడానికి ఒక రంధ్రం వుంటుంది. దానిని రోలు అంటారు. రెండోది రోకలి. ఇది కూడా ఇనుప పరికరమె. చిటికెన వేలు పరిమాణంలో వుండి ఒక వైపు రోలుకు సరిపడ వుండి రెండో వైపు ఒక రంధ్రం దారం కట్టు కోడానికుంటుంది. ఈ రెండు పరికరాలను చెరి ఒక కొసన దారానికి కట్టి రోలులో ఒక చెటికెడు పెట్లొప్పు వేసి రోకలిని అందులో పెట్టి దారం సాయంతో ఒక రాతి కొట్టితే పెద్దశబ్దం వస్తుంది. పిల్లలకు ఒక పలం పెట్లొప్పు ఒక రోజు కొట్టడానికి సరిపోయేది. ప్రస్తుతం అనేక రకాల టపాకాయలు వచ్చినా పల్లెల్లో వాటిని పరిమితంగానె కాల్చుతారు. వాటిపైన ఎక్కువ ధనం వ్వయం చేయరు.
8. శివ రాత్రి
ఈ పండగ ఉప వాసానికి జాగారణకు ప్రత్యేకం. పొద్దునంతా ఉపవాసముండి రాత్రులందు జాగారణ చేస్తారు. స్థానికంగా వుండే దేవాలయాలలో అనేక సాంస్క్రుతిక కార్యక్రమాలు జరుగు తుంటాయి. అవి భజనలు, హరి కథలు, వీధి నాటకాలు మొదలగు నవి వుంటాయి. అక్కడక్కడ వున్న శివాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. రాత్రులందు జాగారణ కొరకు ఆ కార్యక్రమాలకు వేళుతారు పల్లె వాసులు. ప్రస్తుతం ఈ శివరాత్రి పండుగ ఆరోజుల్లో జరిగినంత వైభవంగా జరగడం లేదు. ఏదో మొక్కు బడిగా జరుపుకుంటున్నారు. శివాలయాలల్లో మాత్రం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు జరుగు తున్నాయి.

9. సుడ్తుల పండగ:
ఈ సుడ్దుల పండగ కేవలం చిత్తూరు జిల్లలో అదీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే చేసుకునే పండుగ. కార్తీక పౌర్ణమి రోజున చేస్తారు. ఆ రోజున అన్ని పండగలకు చేసినట్లే ఇల్లు అలికి, ముగ్గులు పెట్టి పిండి వంటలు చేసు కుంటారు. సాయంత్రం దీపావళి పండగకు పెట్టినట్లు ఇంటి ముందు దీపాలను పెడ్తారు. దిబ్బల్లోను దీపాలు పెడతారు. ఆలయం ఉన్న కొండలపై కర్రదుంగలతో పెద్ద మంట వేస్తారు. దాన్ని ఆకాశ దీపం అంటారు. అది ఆ చుట్టు ప్రక్కల చాల దూరం వరకు కనిపిస్తుంది. రాత్రి కావస్తుందనగా పిల్లకు పండగ అప్పుడు కనిపిస్తుంది. పిల్లలందరు వారి పెద్దల సహాయంతో సుడ్తులు కట్టుకోవడంలో చాల సరదాగా వుంటారు. సుడ్తు అనగా గోగు పుల్లలను ఒక కట్ట లాగ కట్టి సుమారు పదడుగులకు పైతా కడతారు. దాని పొడుగు దాన్ని మోసే వారి వయస్సు, శక్తిని బట్టి ఇరవై అడుగుల పొడవు కూడా వుండొచ్చు. చీకటి పడగానా పిల్లలందరు వారి వారు సుడ్తులతో ఊరుముందర కూడతారు. అక్కడ ఒక పెద్ద మంట పెట్టి దాని నుండి వారి వారి సుడ్తులను వెలిగించుకొని పరుగులు తీస్తూ "డేహేరి గుళ్లారిగో డేహేరి మాముళ్లో అని గట్టి గా అరుస్తూ ఊరి బయట పరుగెడుతారు. అలా ఓ గంట సేపు అరిచి పరుగెత్తి... చివరికి ఊరిబయట ఒక చెట్టుకింద వున్న దేవుని ముందు దీవించి అక్కడే మిగిలిన ఆ సుడ్తులన్నింటిని నిలువుగా కుప్పవేస్తారు. అది పెద్ద మంటై పైకి లేస్తుంది. దాంతో పిల్లల కేరింతలు. ఆ మంటను "అవ్వాగుడిసె" అంటారు. ఆమంట పూర్తికాగానె కింద జానెడెత్తు నిప్పులు ఖణ ఖణ లాడుతు వుంటాయి. పెద్దపిల్లలు దానిపై ఇవతలనుండి అవతలికి నడుస్తారు. చిన్న పిల్లలు ఆచ్యర్యపోతుంటారు. అవి భయంకరంగా వున్న అవి మెత్తటి నిప్పులు గాన కాలవు. (గోగు పుల్లల నిప్పులు) అదొక సరదా ఆతర్వాత ఇద్దరు పెద్దపిల్లలకు ఒక పెద్ద దుప్పటి ఇచ్చి తెరలాగ పట్టుకోమని తెరకు అవతల చిన్న పిల్లలకు గోగు పుల్లలను ఇచ్చి కత్తిలాగ, బాణం లాగ, గద లాగ పట్టుకొమ్మని వారిని అక్కడ కోదరిని నెలబెట్టి, కొందరిని కూర్చో బెడతారు. ఒక చిన్న సుడ్తుకు మంట పెట్టి పిల్లలున్న వైపు పిల్లలకు కొంత దూరంలో మండుతున్న సుడ్దును అడ్దంగా, నిలువుకు తిప్పుతారు. ఆ మంట వెలుగులో పిల్లల నీడలు తెరపై పడి మంట కదులు తున్నందున పిల్లల నీడలు కూడా కదులుతాయి. తెరకు మరొకవైపు అందరు నిలబడి ఆనందిస్తారు. దీన్ని తోలుబొమ్మలాట అంటారు. కొన్ని వూర్లల్లో ఊరు వారందరు కలిసి "బండి సుడ్దు " అని పెద్ద సుడ్తు కడతారు. దాన్ని ఎద్దుల బండి మీద పెట్టి, మంట పెట్టి అది కాలుతుంటే ముందుకు జరుపు కుంటూ ఊరు బయట ఎద్దులతో పరుగులు తీయిస్తారు. ఇదొక సంబరం. ప్రస్తుతం ఈ పండగ పూర్తిగా కనుమరుగై పోయింది. గోగులను పండించడము పూర్తిగా మానేశారు. గోగులు లేవు సుడ్దులు లేవు. కాని కొండలమీద మాత్రము ఆకాశ దీపాలు వేస్తున్నారు.