నెల నెల బహిష్టు అయినపుడు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. అలా 3 రోజులు వస్తుంది. మైలు 5,6 రోజులు అవుతుంది. నాకు 5 నెలల క్రితం నాకు పెళ్ళి అయ్యింది. పెళ్ళయిన 5వ రోజున మమ్మల్ని కలిపారు. కాని 7 రోజుల కొకసారి చొప్పున నేను భర్తతో కలిసినపుడు యోని లోపల నొప్పిగా మంటగా వుంటుంది. అలా 2,3 రోజులుంటుంది. వద్దంటున్నామా వారు ఒప్పుకోరు. ఆ టైములో నా బాధ పగ వాళ్ళకి వద్దనిపిస్తుంది. యోనిపై దురద, నొప్పి ఉంటుంది. ఈ సమస్య గూర్చి నేను చాలా వీక్ అయిపోతున్నాను. నా సమస్యకు సలహా ఇవ్వగలరు.
ఋతు సమయంలో కడుపునొప్పికి రకరకాల కారణాలుంటాయి. హార్మోను హెచ్చుతగ్గులు కావచ్చు, పొత్తికడుపులో వ్యాధి ఉండటం కావచ్చు. చెప్పుకోదగ్గ కారణం ఏవిూ ఉండకనూ పోవచ్చు. ఒకసారి గైనకాలజిస్టుకి చూపించుకుంటే మందులు రాస్తారు. రతి సమయంలో యోని లోపల మంటకు కారణం సాధారణంగా యోని లోపల తడి చాలకపోవడం కాని, పొత్తి కడుపు లోపలి వ్యాధి కాని కారణమవుతుంది. దీన్ని కూడా గైనకాలజిస్టే మందులతో తేలిగ్గా పోగొడతారు. వ్యాధులేవిూ లేని పక్షంలో విూరిద్దరూ జననాంగాలకు జారుడు పదార్థం పూసుకుని రతిలో పాల్గొంటే మంట ఉండదు.