ఇంగువను ఆహారంలో వాడితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
ఇంగువను చాలా మంది పలు వంటకాల్లో రుచి కోసం వేస్తుంటారు. అయితే నిజానికి ఇది ఓ మొక్క నుంచి వస్తుంది. ఫెరూలా అని పిలవబడే ఓ రకమైన వృక్షజాతికి చెందిన పాలను ఉపయోగించి ఇంగువను తయారు చేస్తారు. ఈ క్రమంలో వంటల్లో ఇంగువ వేయడం వల్ల రుచి మాత్రమే కాదు, దాంతో ఇంకా అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి. ఇంగువ వల్ల మనకు కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- ఇంగువ వేసిన ఆహారం తింటే గ్యాస్ సమస్య ఉండదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణ సమస్య బాధించదు. మలబద్దకం, అసిడిటీ ఉండదు. ఇతర జీర్ణ సమస్యలున్నా పోతాయి.
- పలు రకాల అల్సర్లను నయం చేసే శక్తి ఇంగువకు ఉందని పలు పరిశోధనలు తేల్చి చెప్పాయి. అంతేకాదు, ఆకలి లేకున్నా దీంతో చేసిన పదార్థాలను తింటే బాగా ఆకలి పుడుతుంది.
- యునానీ వైద్యంలో ఇంగువను పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా వాడుతున్నారు. ఫిట్స్, ఇతర మానసిక సమస్యలకు ఇంగువ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
- మహిళల్లో రుతు క్రమంలో వచ్చే సమస్యలు సహజం. అయితే వాటితోపాటు రుతు క్రమం సరిగ్గా లేని మహిళలు కూడా ఇంగువతో చేసిన ఆహారం తింటే దాంతో వారిలో రుతుక్రమం మెరుగవుతుంది. ఇది సంతాన సాఫల్యత అవకాశాలను పెంచుతుంది.
- ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి. తీవ్రమైన పడిశెం (ఇన్ఫ్లుయెంజా) వచ్చినా ఇంగువతో చేసిన ఆహారం తింటే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఇంగువ వేసిన ఆహారం తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇన్సులిన్ లాగా పనిచేయడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది.
- రక్త నాళాల్లో కొవ్వు గడ్డకట్టకుండా చూస్తుంది. దీంతో రక్త సరఫరా పెరిగి గుండె సమస్యలు రావు.
- తలనొప్పి, ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. ఆయా నొప్పులను తగ్గించే గుణం ఇంగువకు ఉంది.
- ఇంగువను వంటల్లోనే కాక డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. దీంతో పైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే దాన్ని గోరు వెచ్చని నీటితోనో లేదా మజ్జిగతోనో తీసుకోవాల్సి ఉంటుంది