'కర్మ అంటే మరేదో కాదు విద్యుక్త ధర్మకు కర్మ అది శుచియై, పవిత్రమై ఉంటుంది. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. ఈ ధర్మాలు ఆయా వర్ణాలకు విడిగా ఉంటాయి. కాబట్టి వారి విధులు, మరొక వర్ణానికి, తేడా వర్గానికి, తప్పని తోచవచ్చు.
ఉదా.: క్షత్రియుడు, పాలకుడిగా, ప్రజాసంరక్షణ ధ్యేయంతో శత్రువు లను చంపవచ్చు ఇది దోషం కాదు. విద్యుక్త ధర్మమే అవుతుంది. వీటినే ధర్మసూక్ష్మాలుగా భావించాలి. కర్మలు విధిని ధిక్కరించలేవు. వాటి స్వాధీనంలోనే ఉంటాయి. విధి భగవంతుని నిర్ణయం. అయితే తెలిసి, తెలిసి విషితత్త్వాలు ధిక్కరించేవారు మాత్రం దోషులే!
విహిత కర్మలంటే
ప్రాచీనులు వర్ణవ్యవస్థలో ఆయా వర్ణాలకు కొన్ని విహిత కర్మలు నిర్ణయించినారు. వారు సామాజిక సంఘటిత స్వరూపం కాపాడమనే ఈ వ్యవస్థ నేడు కులాలలో ఎబిసిడి అని ఏర్పాటు చేసి నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అనేది తదాచర కాలంలో మరింత స్వార్థబుద్ధితో కల్పించినవే. అందరికి సమాన అవకాశాలు కల్పించటం నేటి ప్రభుత్వాల విధి. ఒకవిధంగా ఇది ప్రభుత్వ విషిత కర్మనే అవు తుంది.
బ్రాహ్మణులతో యజ్ఞయాగాది క్రతువులు, విహిత కర్మలు, క్షత్రియులకు, యుద్ధాలు చేయుట, దుష్టశిక్షణ, శిష్టరక్షణ విహితకర్మలు. ఈవిధంగా మిగతా వర్ణాలకు విహిత కర్మలు న్నాయి. వీటన్నింటిని ధర్మం తప్పక అనుభవంలో పెట్టాలన్న భగవంతుడు, తాను మాత్రం అందరికి సమానుడు అని చాటాడు. భగవంతుడే సృష్టికర్త. అతన్నిసృజించి తరించటం విషయంలో అందరూ సమానమే. అందుకే మానవులందరిని సంభో దిస్తూ ఈ శ్లోకం చెప్పాడు.
శ్లోః యతః ప్రవృత్తి దూతానం మేన సర్వమిదం తతమ్, స్మకర్మణాః తమభ్యర్చ్యసిద్ధిం విదంతి మానవః -మోక్షసద్వినియోగంఅని సమస్త సృజనాధిపతి అయిన ఆ దేవదేవుని స్వాభావిక ధర్మ, కార్యాచరణ ద్వారా పూజించి, మానవులు తరించుచున్నారు. అని అన్ని వర్ణాల, వర్గాల ప్రజలు దేవుని పూజించి, తనలో ఏకం కావచ్చునన్నాడు.
అంటే, మానవజాతిలోగాని, వర్ణవర్గాల్లో గాని, ఏవిధమైన విచక్షణ, లేదా భిన్న త్వం కానీ లేదని సూచించినట్టే కదా. కర్మలలో భిన్నత్వం సామాజిక ధర్మాల విభజనకు మాత్రమేనని, ఆయా కర్మలు వారివారి స్వాభావిక క్రియలు మాత్రమే అని తనని చేరటానికి ప్రతిబంధకం కాదు అని స్పష్టం చేసాడు.