ఉగాది |
తరతరాలుగా భారతీయులు అనుసరిస్తున్న చంద్రమాన-సౌరమాన పంచాంగం ప్రకారం సంవత్సరంలోని మొదటి రోజుని “చంద్రమాన ఉగాది” అంటారు. తూర్పు సంస్కృతి నుంచి వచ్చే అన్నిటి లాగానే, పంచాంగం(క్యాలండర్) కూడా మనిషి శరీరంలో, చేతన(consciousness)లో జరుగుతున్న వాటికి అనుగుణంగానే ఉంటుంది. ఉగాది నుండి మొదలయ్యే మొదటి 21 రోజులలో భూమి ఒక పక్కకు వొంగి ఉండటం వల్ల ఉత్తరధృవం అత్యధిక సూర్యశక్తిని పొందుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల మనుషులకు ఇబ్బందికరంగా ఉంటుండవచ్చు కానీ, భూమి యొక్క బ్యాటరీలు నింపబడేది కూడా ఈ సమయంలోనే.
ఉగాదిని ‘నూతన సంవత్సర ఆరంభదినం’ గా జరుపుకుంటున్నది కేవలం నమ్మకం వలనో లేదా అనుకూలంగా ఉంటుందనో కాదు. దాని వెనుక మానవ శ్రేయస్సును ఎన్నో విధాలుగా పెంపొందించే ఒక శాస్త్రవిజ్ఞానమే ఉందిఉష్ణమండలాల్లో సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండే ఈ సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఈ సాంప్రదాయంలో, సంవత్సరంలో ఈ భాగాన్ని శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆముదం లాంటి నూనెలను విస్తృతంగా పూసుకొని ప్రారంభిస్తారు. గ్రహగతితో మానవ అనుభావానికి ఉన్న సంబంధాన్ని పట్టించుకోని ఆధునిక క్యాలండర్ల మాదిరిగా కాక, చంద్రమాన-సౌరమాన క్యాలండర్ గ్రహగతి వల్ల మనిషిలో కలిగే అనుభవాన్ని, అతనిపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. అందుకే ఈ క్యాలండర్ని అక్షాంశాల ఆధారంగా సరిచేస్తారు.
ఉగాదిని ‘నూతన సంవత్సర ఆరంభదినం’ గా జరుపుకుంటున్నది కేవలం నమ్మకం వలనో
లేదా అనుకూలంగా ఉంటుందనో కాదు. దాని వెనుక మానవ శ్రేయస్సును ఎన్నో విధాలుగా పెంపొందించే ఒక శాస్త్రవిజ్ఞానమే ఉంది.మన దేశంలోని ప్రగాఢ జ్ఞానాన్ని ఈ రోజున ఒక పనికిమాలిని విషయంగా పరిగణిస్తున్నారు. దానికి కారణం కొన్ని దేశాలు మన దేశం కంటే ఎక్కువ ఆర్ధిక పురోగతిని సాధించడమే. మనం కూడా ఆ ఆర్ధిక పురోగతిని తొందరలోనే సాధిస్తాం, కాని ఈ సంస్కృతి అందిస్తున్న ప్రగాఢ జ్ఞానాన్ని కొన్ని సంవత్సరాలలో సృష్టించలేం. ఇది వేలాది సంవత్సరాల కృషి ఫలితం.
నూతన సంవత్సరం ఆరంభించడానికి మీరు చేయగలిగే అతి సులభమైన పని ఏమిటంటే మీరు ఫోన్ ఎత్తుకున్నప్పుడు, “హలో”, “హాయ్” లేదా అలాంటిదేదో అనకండి. “నమస్తే”, “నమస్కారం”, “నమస్కార్” అని అనండి. ఇలాంటి పదాలను మన జీవితంలో ఉచ్చరించడంలో ఒక ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే మనం భగవంతునితో ఏమైతే అంటున్నామో లేదా చేస్తున్నామో, అదే మన చుట్టూ ఉన్న వాళ్లకు చేస్తున్నాము. ఇది అత్యున్నత జీవన విధానం.
మీకు ఒకటి ప్రవిత్రమైనదీ, మరొకటి అపవిత్రమైనదీ అయితే, అసలు విషయాన్ని మీరు ఏ మాత్రం గ్రహించటం లేదని అర్ధం. ఈ నూతన సంవత్సరాన్ని అందరిలో దైవత్వాన్ని గుర్తించే అవకాశంగా మీరు మలచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి