ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభన కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతోంది . ఉపనిషత్తుల కాలం లో ఉద్భవించిన 'సత్యం , శివం , సుందరం ' ప్రేమ వచనాలు అనంతర కాలం లో ఒకే మహామహితాత్మునిలో కేంద్రీకృతమై భారత దేశాన్ని ఆధ్యాత్మికం గా , రాజకీయం గా స్పందింపజేసాయి. శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి , యోగేస్వరేస్వరుడు ,మహానుభావుడు అయిన ఈతని పుట్టిన రోజునే పండగ గా హిందువులు జరుపుకొంటారు .
సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు
"పైకొని చూడరె వుట్ల పండుగ నేడుమహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడం ద్వారా లోక కళ్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడుతాయి.
ఆకడ గొల్లెతకు ననందము నేడు
అడర శ్రావణబహుళాష్టమి నేడితడు
నడురేయి జనియించినాడు చూడ గదరే.
హిందూమతానికి ఆదర్శప్రాయ గ్రంధమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మ దినమైన శ్రీకృష్ణాష్టమి వేళ శ్రీ కృష్ణ దేవాలయాలను దర్శిస్తే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యఫలం భక్తుల సొంతమౌతుంది. అందుకే కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తే చాలా శుభప్రదం.
శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించిన సమయంలో కృష్ణ ధ్యాన శ్లోకములు పఠిస్తే చాలా మంచిది. అలాగే ఆ దేవదేవుని సన్నిధిలో అష్టోత్తర పూజను చేయిస్తే చేయించిన వారికి సఖల సుఖాలు సొంతమౌతాయి. దీనితోపాటు కృష్ణ సహస్రనామ పూజను కూడా చేయిస్తే చాలా మంచిది.
దేవాలయ సందర్శన వేళ శ్రీకృష్ణుని లీలా వినోద మాలిక శ్రీభాగవతం గ్రంధాన్ని కొని దాన్ని పఠించగల్గితే స్వర్గ సౌఖ్యం సొంతమౌతుంది. కృష్ణాష్ఠమి సందర్భంగా సన్నిహితులకు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందించడం శుభకరం.
కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణుని దేవాలయ నిర్వాహకులు సైతం శ్రీకృష్ణుని లీలలను తెలిపే వివిధ నృత్య నాటకాలను, శ్రీకృష్ణుని చరితకు సంబంధించిన ఉపన్యాసాలను ఏర్పాటుచేస్తే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు... దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు రోహిణి నక్షత్రమున ... కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి