నైవేద్యం అనునది భుజించడానికి మునుపు దేవునికి ఆహారము సమర్పించు ప్రక్రియ. కావున దేవునికి ఆహారము సమర్పించు మునుపు, ఆ ఆహారము వండునప్పుడు దాని రుచి చూడటము నిషిద్ధము. ఆహారమును దేవుని మూర్తి ముందు ఉంచి పూజించడం జరుగుతుంది. ఆ పై దానిని పుణ్యఫలంగా ఆరగించవచ్చు.
ఈ పదము సంస్కృతం నుండి వచ్చింది. నైవేద్యము అంటే సరైన అర్థము దేవునికి
సమర్పణ అని - ఈ సమర్పణ ఆహారపదార్థమే కానవసరము లేదు. ఈ సమర్పణ భౌతిక వస్తు సంబంధమే అవ్వవలసిన అవసరము లేదు. ఒక మొక్కు, ప్రతిజ్ఞ, ఏదైనా చేయవలను లేక చేయరాదు అన్న నిశ్చితాభిప్రాయము మున్నగునవన్నీ కూడా నైవేద్యముగా భావించవచ్చు. అయితే నైవేద్యానికి, ప్రసాదానికి ఉన్న తేడా తెలుసుకోవడం అవసరం. వాడుకలో రెండూ సమానార్థంలో ఉపయోగించినప్పటికీ, ప్రసాదమంటే దేవుని దగ్గర లభ్యమయ్యేదిగా అర్థం. సాధారణంగా తమ మనోవాంచలు నెరవేర్చుకోవడం దేవతలకు పూజ చేసి ప్రత్యేక రోజులలో ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సరియైన పద్ధతేనా?? కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. వాస్తవానికి అతడు భక్తుడి నుండి ఏమీ ఆశించడు. అతను మనఃస్పూర్థిగా ఇచ్చినదేదైనా సంతోషంగా స్వీకరిస్తాడు. అది ఫలమైనా, పుష్పమైనా ఏదైనా సరే. అది కూడా భక్తుని సంతృప్తి పరచడానికే తీసుకుంటాడు. కనుక తన సంతృప్తికై భక్తుడు తన ఇష్టదైవానికి తీపి వంటకమో, పుష్పమాలయో, ధూపదీపాలో లేక మరే ఇతరమైనవో సమర్పించుకుంటాడు . అంతే కాని ఏ దేవుడు నాకిది కావాలని అడగడు. ఇచ్చింది కాదనడు. దైవానికి నైవేద్యం సమర్పించడమంటే భగవంతుడికి పూర్ణంగా శరణు జొచ్చడమని భావం. దేవుడి పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్ధనా లక్ష్యంపై మనసు సంపుఉర్నంగా లగ్నం కాదు. ప్రసాదం అంటె దేవునికి లంచం ఇవ్వడం కాదు. భక్తుడు తనకోసమై తనదనుకుంటున్న సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం. అలాగే అది తనకు భగవానుడే ఇచ్చాడు అని భావించడం అనేది నైవేద్యం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.
ప్రమదలందరికీ పండుగ పిండివంటల సన్నాహాలకి స్వాగతం. అసలేనైవేద్యాలు తయారుచేసుకొవాలి. పూజకి అన్నీ సిధ్ధం చేసుకోవాలి. భక్తిగా పూజచేసుకోవాలి.
అందుకని సులభంగా 9 రకాలు చెసుకునె విధానం. ప్రమదలందరూ చదివితరించుదురుగాక.
- పులగం. (ఇది అమ్మవారికి చాలా ప్రీతి). చేసుకోవడం అందరికి తెలుసనేఅనుకుంటున్నాను. నాలుగు పప్పుబద్దలు, బియ్యం, చిటికెడు పసుపు కలిపిచిన్నగిన్నెలో కుక్కర్ లొ పెట్టెయ్యడమే.
- పరవాన్నం.(ఇది కూడా అమ్మవారికి ఇష్టమైనదే). బియ్యంతో కాని, సేమ్యాతోకాని చేసుకోవచ్చు.
- పులిహార. (ఇది అమ్మవారికే కాదు, చాలామందికీ ఇష్టమైనదే) . వివిధరకాలుగాచేసుకోవడం తెలుసుకదా.
- దధ్ధోజనం.(గుళ్ళో కూడా ఈ ప్రసాదం పెడుతుంటారు). వండిన అన్నంలోపెరుగు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమిర కలుపుకుని, కాస్తఇంగువ, ఆవాలు, 2 మెంతిగింజలు, 2ఎండు మిరపకాయముక్కలు వేసి నేతిపోపుపెట్టుకోవడమే.
- కేసరి. (అదే సత్యనారాయణస్వామివారి ప్రసాదం). 1కప్-బొంబాయిరవ్వ, 1కప్-పంచదార, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కావలసినన్ని జీడిపప్పులు, కిస్ మిస్,సువాసనకు యాలకులపొడి.ముందుగా రవ్వలో పంచదార కలిపేసుకుని రెడీగా పెట్టుకోవాలి. (అలాగయితేప్రసాదం వుండలు కట్టకుండా వుంటుంది). తర్వాత స్టౌవ్ వెలిగించుకునిఅందులొ1టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు, కిస్ మిస్ లువేయించుకోవాలి. వేగాక 2కప్పుల నీరు పోసుకుని, మరిగాక కలిపి పెట్టుకున్నరవ్వ, పంచదార వేసి ఒక్క నిమిషం వుడకనివ్వాలి. అప్పుడందులో యేలకుల పొడివేసి, మిగిలిన నెయ్యివేసి కలిపేసుకుంటే కేసరి రెడీ. సగం నైవేద్యానికిఅట్టిపెట్టుకుని మిగిలిన సగంతో సొజ్జప్పాలు చేసుకొవాలి. ఒక్క దెబ్బకిరెండు ప్రసాదాలన్నమాట.
- సొజ్జప్పాలు. ( పల్చగా చెసుకుంటే కరకరలాడుతూ వుంటాయి). 1కప్ మైదాచపాతిపిండిలా కలుపుకున్నాక, అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. అవిచిన్న వుండగా చేసి అరచేతిలొ తట్టుకుంటూ మధ్యలో కేసరి చిన్న వుండగా చేసిపెట్టి చిన్న పూరీలా చేతితోనే వత్తుకోవాలి. అవి ఆయిల్ లో వేయించుకోవాలి.(డీప్ ఫ్రై అన్నమాట).
- గారెలు. (అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం). ఇది చెయ్యడం అందరికీతెలుసుకదా. అవే మరికొన్ని ఎక్కువగా చెసుకుంటే మరో నైవెద్యం. అదే ఆపడలు (పెరుగుగారెలు)
- ఆవడలు. (లేదా పెరుగు గారెలు). ఇవి చెయ్యడం అందరికీ తెలుసనేఅనుకుంటున్నాను.
- మైసూరుబజ్జీ.- ఇది చెయ్యడం చాలా సులభం. 1కప్ మైదా, 1/4 కప్బియ్యంపిండి, 1కప్ పెరుగు, 1స్పూన్ పచ్చిమిరపకాయముక్కలు,1/4స్పూన్వంటసోడా, తగినంత ఉప్పు. అన్ని బాగా కలిపి చిన్న చిన్న వుండలుగా నూనెలోవేసి డీప్ ఫ్రై చెయ్యడమే.
ఏమైనా సవరణలుంటే నిస్సంకోచంగా చెప్పండి
10. మహానైవేద్యం - దసరా ఉత్సవాలలో 7 వ రోజు అమ్మవారికి 108 తీపిపదార్దాములతోతయారుచేసిని మహానైవేద్యము ను సమర్పిస్తారు .
11. చెక్కెర పొంగలి : ఆశ్వయుజ అష్టమి రోజున గౌరీమాతను ఆరాధించి చేక్కేరపొంగాలి , బెల్లం పాయసం గాని నైవేద్యం గా సమర్పిస్తారు .
-----------------------------------------------
మరికొన్ని నైవేద్యాలు:
- శ్రీ వేంకటేశ్వరస్వామికి - వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టవలెను. తులసిమాల మెడలో ధరింపవలెను.
- వినాయకునకు - బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజింపవలెను.
- ఆంజనేయస్వామికి - అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజింపవలెను.
- సూర్యుడుకు -మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం
- శనీశ్వరుడు - శనీస్వరునకు నేయి నైవేద్యము
- లక్ష్మీదేవికి - క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.
- సత్యన్నారాయణస్వామికి - ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.
- దుర్గాదేవికి - మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.
- సంతోషీమాతకు - పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.
- శ్రీకృష్ణునకు - అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించవలెను.
- శివునకు - కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.
- శ్రీ షిర్డీ సాయిబాబాకు - పాలు, గోధుమరొట్టెలు , పాతిక బెల్లం నైవేద్యం.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి