పాశ్చ్యాత్త దేశాలలో మధ్యపానకు చేసే అలవాటు ఎక్కువ . మద్యపానం దుష్ఫలితాల్లో మరోటి వచ్చి చేరింది. గర్భం ధరించిన సమయంలో తల్లులకు ఈ అలవాటు ఉంటే.. వారికి పుట్టిన మగ పిల్లల్లో పెద్దయ్యాక సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలం అసుపత్రి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇది సంతాన లోపాన్ని కలిగించకపోయినా పిల్లల్ని కనటంలో తీవ్రమైన ఇబ్బందులు మాత్రం తెచ్చిపెడుతోందని పరిశోధకులు చెబుతున్నారు.
మిగతా వారితో పోలిస్తే.. గర్భంలో ఉండగా తీవ్రమైన మద్యం ప్రభావానికి గురైన వారిలో పెద్దయ్యాక వీర్యకణాల సంఖ్య మూడింతలు తగ్గుతుండటం గమనార్హం.
''గర్భిణులు మద్యం తాగితే వారి గర్భంలోని శిశువు వృషణాల్లో వీర్యాన్ని ఉత్పత్తి చేయటానికి ఉపయోగపడే కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే పెద్దయ్యాక వీర్యకణాల నాణ్యతను దెబ్బ తినటానికి కారణమవుతుండొచ్చు'' అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డా|| సెసిలా రామ్లావ్-హన్సెన్ తెలిపారు.
ఇలాంటి అధ్యయనం జరగటం ఇదే తొలిసారని, ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే తండ్రుల మద్యపానం అలవాటుతో దీనికి సంబంధం ఉన్నట్టు బయటపడలేదు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి