మూత్రం (Urine) జంతువుల శరీరం నుండి బయటికి వ్యర్ధ పదార్ధాల్ని పంపించే ద్రవం. ఇది రక్తం నుండి వడపోత ద్వారా మూత్ర పిండాలలో తయారవుతుంది. మూత్ర నాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరి మూత్ర విసర్జనం ద్వారా శరీరం నుండి బయటకు పోతుంది. మన శరీరంలో జీవక్రియలలో తయారయ్యే వివిధములైన వ్యర్ధ పదార్ధాలు ముఖ్యంగా నైట్రోజన్ సంబంధించినవి రక్తం నుండి బయటికి పంపించాల్సిన అవసరం ఉన్నది. నీటిలో కరిగే ఇతర వ్యర్ధాలకు ఇదే పద్ధతి వర్తిస్తుంది.
మూత్రాన్ని రకరకాల మూత్ర పరీక్షల ద్వారా దాని లోని వివిధ పదార్ధాలను గుర్తించి విశ్లేషించవచ్చును. సాధారణము గా మూత్రము లో ప్రోటీన్ పోవడము జరుగదు .మూత్రంలో అల్బుమిన్ : అల్బుమిన్ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు. శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే శుద్ధి యంtraaలు కిడ్నీలు. అలాంటి కిడ్నీలు పనిచేయడం మానేస్తే.. మన శరీరమే విషతుల్యం అయిపోతుంది.
మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. వీళ్లలో చాలామందికి తమ కిడ్నీలో సమస్య ఉందన్న విషయమే తెలియదు. కిడ్నీ జబ్బులకి సవాలక్ష కారణాలు. కారణం తెలిస్తే కిడ్నీజబ్బులను ఎదుర్కోవడం కూడా పెద్ద కష్టం ఏమీ కాదు.
మూత్రంలో ఏమాత్రం ప్రోటీన్ పోతున్నా మధుమేహులు జాగ్రత్త పడటం మంచిది. ఎందుకంటే మధుమేహుల్లో కిడ్నీ సమస్యలూ తలెత్తే అవకాశముంది. దీంతో మూత్రంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ పోవటం కనిపిస్తుంది. ఇలాంటివారికి గుండెపోటు, పక్షవాతం, గుండెవైఫల్యం ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా 90% మంది మధుమేహుల్లో మూత్రంలో అల్బుమిన్ స్థాయులు మామూలు మోతాదులోనే ఉంటాయి. అయినప్పటికీ వీరికి కూడా గుండెజబ్బుల ముప్పు పెరుగుతోందా? అనేదానిపై ఇటలీ పరిశోధకులు తొమ్మిదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఈ ప్రోటీన్ మోతాదు కొద్దిగా పెరిగినా గుండె సమస్యల ముప్పు పొంచి ఉంటున్నట్టు గుర్తించారు. ఇక దీని మోతాదు పెరుగుతున్నకొద్దీ ముప్పూ ఎక్కువవుతూ వస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మధుమేహులు మూత్రంలో అల్బుమిన్ పోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
మూత్రము లో ప్రోటీన్ పోవడాన్ని ఈ క్రింది రకాలుగా చెప్పవచ్చు :
- మైక్రోఆల్బుమినూరియా,
- మాక్రో ఆల్బుమినూరియా,
- ప్రొటినూరియా లేదా ఆల్బుమినూరియా
- యూరిన్ - క్రియాటినిన్ రేషియో,
మూత్రము లో ప్రోటీన్ కనిపించే కొన్ని ముఖ్యమైన వ్యాధులు :
- మధుమేహము --diabetes
- రక్తపోటు --hypertension,
- కాలేయ వ్యాధులు --liver cirrhosis,
- గుండె జబ్బులు --heart failure ,
- ఒకరకమైన చర్మ వ్యాది --systemic lupus erythematosus.
- మూత్రపిండాల వ్యాధులు ..Glomerulo nephritis , nephrotic syndrome,
- గర్భిణీ లలో మూత్రము లో ప్రోటీన్ ఉంటే గుర్రపు వాతవ (eclampsia) అనే సీరియస్ వ్యాధికి దారితీయును,
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి