మహాభారత నాటకోత్సవాలు
మహా భారత నాటకాలు కేవలం చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమైన ఈ మహా భారత నాటకోట్సవాలు సుమారు ఇరవై రోజులు జరుగుతాయి. ( భారతంలోని ఘట్టాలు 18 రోజులే జరుగుతాయి. మిగతా రెండు రోజులు భారతానికి సంబంధం లేని వేరే నాటకాలు జరుగుతాయి.) ఈ మహాభారత నాటకోత్సవాలు బహు జనాదరణ పొందింది. ద్రౌపతీ సమేత పంచ పాండవుల ఆలయం వున్న వూర్లల్లోనే ప్రతి సంవత్సరం, లేదా రెండు మూడు ఏండ్ల కొక సారి జరుగుతుంది. ఆ సందర్భంలో అక్కడ జరిగే తిరునాళ్లు ప్రజలకు పెద్ద వినోధం. గతంలో ఈ భారత నాటక మహోత్సవాలు జరిగే మైదానంలో అనేక అంగళ్ళూ, రంగుల రాట్నం, చిన్న పిల్లలలి చిన్న ఆటలు, పెద్దలకు చింత పిక్కలాటలు, తోలు బొమ్మలాటలు, ఇలా అనేక విశేషాలతో ఈ జాతర జరుగు తుంది. ఇరవై రోజుల పాటు మహా వైభవంగా జరిగే ఇలాంటి మరెక్కడా జరగదు. పైగా ఈ వుత్సాహం పగలూ రాత్రి కూడా వుంటుంది. పగటి పూట మహాభారతంలో ఒక ఘట్టాన్ని హరికథ రూపంలో చెప్పి అదే ఘట్టాన్ని రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. పగటి పూట జరిగే హరికథా కాలక్షేపానికి సుధూర ప్రాంతాల నుండి కూడా ఎద్దుల బళ్ళ మీద తరలి వస్తారు జనం.
ఈ ఇరవై రోజుల్లో మూడు నాలుగు ప్రధాన ఘట్టాలుంటాయి. ద్రౌపది వస్త్రాపహరణ, బక్కాసుర వధ, అర్జునుడు తపస్సు మాను ఎక్కుట, కృష్ణ రాయ బారం,చివర ధుర్యోధన వధ. వీటిలో పగలు కూడా జరిగే ఘట్టాలు మూడు.
అవి 1. బక్కాసుర వధ, 2. అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. 3. ధుర్వోధనుని వధ.
1. బక్కాసుర వధ.
భీముని వేష దారి అలంక రించిన ఒక ఎద్దుల బండి పై కూర్చొని ఆ చుట్టు పక్కల నున్న పల్లెల్లో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తిరుగు తాడు. పల్లెల్లోని ప్రతి ఇంటి వారు ఇందు కొరకు తయారు చేసిన ఫలహారాలను ఆ బండిలో వేస్తారు. అలా తిరిగి సాయంకాలానికి ఆ బండి భారతం మిట్టకు చేరు కుంటుంది. బండి పైనున్న భీమ వెషధారి దారి పొడుగునా బండి లోని ఆహార పదార్థాలను తింటూ, లేదా తిన్నట్టు నటిస్తూ హావ భావాలను ప్రదర్శిస్తూ వుంటాడు. చివరకు ఆ బండి భారతం జరిగే మైదానానికి చేరిన తర్వాత అందులోని ఆహార పదార్థాలను అక్కడున్న వారందరికి పంచు తారు. ఆ రాత్రికి బక్కాసుర వధ నాటకం ప్రదర్శిత మౌతుంది.
2. ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుట
ఇది పగటి పూట జరిగే ఒక ఘట్టం: ఒక పొడవైన మానును భారత మిట్టన పాతి వుంటారు. దీనికొరకు అశోక వృక్షాన్ని ఎంచు కుంటారు. అది దొరకని పక్షంలో మరేదైనా పొడవుగా వున్న వృక్షాన్ని ఎంచు కుంటారు. దాన్ని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి, పైన సుమారు రెండడుగుల వెడల్పు, ఐదు అడుగుల పొడవున్న చెక్కను అమర్చి దాని పై అర్థ చంద్రాకారంలో ఎర్రటి వస్త్రాన్ని కట్టతారు. పూలతో ఆ వేదికను బాగ అలంక రించి వుంటారు. అర్జున వేష దారి తన వెంట పెద్ద జోలెలను మెట్లకు తగిలించు కొని, పద్యాలు పాటలు పాడుతూ మెట్లను ఎక్కుతుంటాడు. ఆ తపస్సు మాను చుట్టు పిల్లలు కలగని తల్లులు తడి బట్టలతో సాష్టాంగ ప్రమాణ ముద్రలో 'వరానికి' వడి వుంటారు. వారు చేతును ముందుకు సాచి దోసిళ్లను పట్టుకొని వుంటారు. అర్జునుడు మెట్లు ఎక్కుతూ పాటలు పాడుతూ తన జోలిలో వుండే, వీభూతి పండ్లను, నిమ్మకాయలను, అరటి పండ్లను పూలను విసురు తుంటాడు. ఆ విసిరనవి క్రింద 'వరానికి' పడివున్న వారి చేతిలో పడితే వారికోరిక నెరవేరి నట్లే. చుట్టు అనేక మంది ప్రేక్షకులు కూడా వుంటారు. వారు కూడా అర్జునుడు విసిరే ప్రసాదం కొరకు ఎదురు చూస్తుంటారు. అర్జునుడు చివరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వేదిక పై ఆసీనుడై విల్లంబులు చేత బూని కొన్ని పద్యాలు పాడతాడు. ఈ వుత్సవానికి కూడా ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఈ కార్యక్రమం ఆ రోజు మధ్యాహ్నం తర్వాత సుమారు రెండు మూడు గంటలు సాగు తుంది.
3. ధుర్వోధనుని వధ
పగటి పూట జరిగే మహాభారత ఘట్టాలలో చివరిది.... అత్యంత ప్రజాదరణ కలిగినది ధుర్యోధన వధ:. దీని కొరకు మైదాన మధ్యలో.... ధుర్యోధనుడు వెల్లకిలా పడుకొని వున్నట్లున్న అతి బారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసి వుంచు తారు.
దానికి తొడ భాగంలో ఎర్రని కుంకుమ కలిపిన కుండను గాని గుమ్మడి కాయను గాని పాతి వుంటారు. ధుర్యోధన పాత్ర దారి గధను చేత బూని ఆ విగ్రహంపై తిరుగుతూ పాట పాడు తుంటాడు. భీమ వేష దారి ఆ విగ్రహం చుట్టు తిరుగుతూ పాటలు పద్యాలు పాడు తుంటాడు. భీముడు..... ధుర్యోధనుని విగ్రహం పైకి ఎక్కరాదు. ధుర్యోధనుడు అప్పు డప్పుడు క్రిందికి దిగు తాడు. అప్పుడు ఇద్దరు కొంత సేపు యుద్ధం చేస్తారు. ఇలా సుమారు రెండు మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరించి చివరి ఘట్టా నికొస్తారు. అప్పుడు భీమ వేష దారి ధుర్యోధనుని విగ్రహానికి తొడలో దాచిన గుమ్మడి కాయను పెద్ద కర్రతో పగల కొడతాడు. దుర్యోధన వేషదారి అ విగ్రహంపై పడి పోతాడు. నాటకం సమాప్తం. అంత వరకు ఏకాగ్రతో నాటకాన్ని వీక్షిస్తున్న వందలాది ప్రజలు ఒక్కసారిగా ధుర్యోధనుని విగ్రహం మీద పడి రక్తంతో (కుంకుమతో) తడిసిన ఆ మట్టిని, అందంగా అలంక రించిన తల భాగంలోని రంగు మట్టిని తలా కొంత పీక్కొని వెళ్లి పోతారు. ఆ మట్టిని తమ గాదెలలో వేస్తె తమ గాదె ఎన్నటికి తరగదని వారి నమ్మకం. అలాగె ఆ మట్టిని తమ పొలాల్లో చల్లితే తమ పంటలు సంవృద్ధిగా పండ తాయని ప్రజల నమ్మకం.
వీధి నాటకాలు ఉత్సాహ వంతులైన కొంతమంది ఊరి వారు వేషాలు కట్టి ఊరి మధ్యలో ఒక వేదిక ఏర్పాటు చేసి దానికి తెరలు కట్టి నాటకాన్ని తమ హావ భావాలతో రక్తి కట్టిస్తారు. ఈ నాటకాలను నేర్పే ఒక గురువు కూడా వుంటాడు. నాటకం వేయడానికి ముందు ఒక నెల నుండి వేషాలు లేకుండా పాటలు, మాటలు గురువు గారి సమక్షంలో తర్పీదు పొందు తుంటారు. దానిని చూడడానికి కూడా ఆ వూరి జనం వస్తుంటారు. దానిని వద్దిక అంటారు. ప్రధాన నాటకాన్ని చూడ్డానికి చుట్టు ప్రక్కల పల్లెల నుండి జనం చాల మంది వస్తుంటారు. ఎక్కువగా ద్రౌపది వస్త్రాపహరణ నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు.
శ్రీ కృష్ణ రాయబారము నాటకములో ఒక దృశ్యము. శ్రీ కృష్ణుడు, ధుర్యోధనుడు, అర్జునుడు.
వీధి నాటకాలలో ప్రత్యేకత
ఈ వీధి నాటకాలకు ఒక ప్రత్యేకత వుండేది. ఉదాహరణకు: ధుర్యోధనుడు రంగ ప్రవేశం చేసే టప్పుడు తెర వెనకనుండి ముందుకు తన సోధరులతో రంగస్థలం మీదికొచ్చి ఆయుధాలతో రంగస్థలం మీద వృత్తాకారంలో తిరుగుతూ రాజు వెడలె రవి తేజములలరగ కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరయగ అంటూ ధుర్యోధన మహారాజు సభకు వచ్చె నని పాట పాడగా వెనక వున్న అతని సోదరులు వంత పాడతారు. అదేవిధంగా తెర వెనక నున్న ఇతర నటులు కూడ వెనకనుండి వంత పాడుతారు. అనగా వచ్చిన ఆ వేషధారి తాను ఎవరు? అన్న దానికి సమాదానమిస్తాడు. అలా ప్రేక్షకులు ఆ వచ్చినది ధుర్యోధనుడు అని గుర్తిస్తారు. ఆ విధంగా ప్రతి వేషధారి తాను ఎవరు అనే దానికి సమాదానంగా తానే పాట ఆట ద్వార తెలియజేస్తాడు. అలా పరిచయం అయ్యాక పాట రూపంలోనే ఇలా పాటలు మాటలు అంటాడు. సుఖమా మన రాజ్యమెల్ల సుఖమా అనగా వెనక నుండి కోరస్ గా సుఖమే మన రాజ్యమెల్ల సుఖమే అని పాట అందుకుంటారు. ఆ తర్వాత ధుర్యోదనుడు "ధుర్యోధన...ధుర్యోధన,.. ధుర్యోధన... అంటూ కలియ దిరుగు తుంటే వెంటనున్న అతని తమ్ములు తెర వెనకునున్న వారు రాజే రాజే రాజే అంటు కోరసగా అంటారు తర్వాత ధుర్వోధనుడు మంత్రీ మన రాజ్యంలో వర్షాలు నెలకు మూడు సార్లు పడుతున్నాయా? పంటలు బాగా పండుతున్నాయా? ధర్మము, న్యాయము చక్కగా అమలు జరుగు తున్నాయా? అని అడుగగా... మతి: అవును మాహారాజా మన రాజ్యంలో నెలకు మూడు వర్షాలు పడుతున్నాయి, బంగారు పంటలు పండు తున్నాయి. ప్రజలు సుఖంగ వున్నారు అని సందర్బాను సారంగా.... కొంత సంభాషణ జరుగుతుంది. ఇదయిన తర్వాత అసలు నాటకంలోని అంశం ప్రారంబమౌతుంది. ఆ విధంగా పల్లెప్రజలు ధుర్యోధనుడు దుష్టు కాదని చాల చక్కగా ధర్మ పాలన చేశాడని.... అర్థం చేసుకుంటారు. ఇలా ప్రతి పాత్ర తన పరిచయాన్ని చెప్పిన తర్వాతనే అసలు కథలోకి వెళ్ళతాడు. ఆ విధంగా నాటకం సాగుతుంది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి