కర్మ అంటే సామాన్యార్థములో చేతలు, పని చెయ్యడము, విధి మరియు కార్యకారణ నియమము అని చెప్తారు. ఉపనిషత్తుల ప్రకారము ఒక వ్యక్తి లేక జీవాత్మ, బాహ్యముగా కానీ లేక మానసికముగా కానీ చేసిన పనుల వలన సంస్కారాలను ప్రోగు చేసుకుంటుంది. లింగ శరీరము (అనగా బాహ్య శరీరమునకు మరియు ఆత్మకు మధ్య గలది) ఈ సంస్కారాలను తర్వాతి జన్మలకు తీసుకుని వెళుతుంది.ఈ విధముగా అపజయము ఎరుగని, తటస్థ, మరియు విశ్వ నియమము, ఐన కర్మ ఒక వ్యక్తి మరు జన్మకు, ఆ జీవాత్మ ఏ కుటుంబంలో పుట్టాలి అనేది నిర్ణయిస్తుంది. చర్య, ప్రతిచర్య, పుట్టుక, మరణము మరియు పునర్జన్మ అను చక్రాన్ని సంసారము అంటారు. హిందువుల ఆలోచన ప్రకారము కర్మకు, పునర్జన్మకు చాలా ప్రాముఖ్యత ఉంది.
భగవద్గీత ప్రకారము:
" చినిగిన బట్టలను ఏ విధము గా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో అదే విధముగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. " ( భగవద్గీత రెండవ అధ్యాయము 22 వ శ్లోకము) సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణము అవుతుంది. ఐనా మోక్షము ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది. చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతటతానే పరమాత్మతో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకము.
జీవితము యొక్క పరమార్థము మోక్షము అనగా పరమాత్మతో ఐక్యము కావడము అని చెప్పబడుతోంది.అనగా ఆత్మ సాక్షాత్కారము, జీవేశ్వరుల ఐక్యత, ఆత్మ యొక్క పరిపూర్ణ నిస్వార్థత, అమాయకత్వము నుండి విడుదల మరియు పరిపూర్ణ మనశ్శాంతి. ఈ విధమైన స్వేచ్ఛ మనిషిని సంసారము నుండి విడుదల చేసి పునర్జన్మ లేకుండా చేస్తుంది. మోక్షానికి నిర్వచనములు హిందూ మతములో పలురకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు "అద్వైతం" ప్రకారము మోక్షము పొందిన తర్వాత వ్యక్తిత్వము నశించిపోయి విశ్వాత్మ అనగా భగవంతునిలో లీనమవుతుంది. ద్వైతుల ప్రకారము జీవాత్మ అనేది పరమాత్మలో ఒక భాగమని మరియు మోక్షము తర్వాత పరమాత్మతో పరమాత్మ లోకంలో అతని సాన్నిధ్యములో అనంతకాలము ఉంటామని భావిస్తారు. అయితే ద్వైతుల ప్రకారము మోక్షము అనగా " చక్కెరను రుచి చూడడము", అద్వైతుల ప్రకారము " చక్కెర గా మారిపోవడము" అని అర్థము.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి