హిందూ ధర్మం (Hinduism or Hindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ మతం అతి పురాతన మతం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. పూర్వకాలమునందు భారతదేశమున ఏది ధర్మ నామముతో వ్యవహరింపబడినదో, అదియే ఇపుడు మత మను పేరుతో వాడబడుచున్నది.
ధర్మము అనగా ఆచరణీయ కార్యము.మత మనగా అభిప్రాయము. హిందూ అనే పదమును ఫార్సీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి ఫార్సీ భాషలో సింధు అని అర్థము,సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలచేవారు కాని ఇప్పుడు వేదాలు మరియు వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు. హిందూమతం మరియు దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి. ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన హిందూమతాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.
సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం మరియు నేపాల్ లోనే నివసిస్తున్నారు. ఇంకా హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజి, సూరినాం, గయానా,ట్రినిడాడ్ మరియు టుబాగో, అమెరికా, రష్యా మరియు చైనా ముఖ్యమైనవి హిందువుల వేద సంపద చాలా అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు,మరియు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు మరియు ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, పురాణాలు మరియు మహా కావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు భగవద్గీత అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోంది.
హిందూ ధర్మం చరిత్ర:
టిబెట్ లోని కైలాస పర్వతం పార్వతీ పరమేశ్వరుల నివాస స్థానంగా హిందువులకు పవిత్రమైనది.
క్రొత్త రాతియుగం నుండి హరప్పా మొహంజొదారో నాగరికత కాలం వరకు హిందూమతం గురించిన పురాతన ఆధారాలు ఉన్నాయి.(5500–2600BCE). (1500–500BCE) కాలానికి చెందిన అంశాలను 'చారిత్రిక వైదిక ధర్మం'కు చెందినవని అంటారు.
వేదాల ఆవిర్భావం నుండి హిందూమతం ఆచారాలు, సిద్ధాంతాలలో ఏర్పడిన స్పష్టత ఇప్పటికీ కొనసాగుతున్నది. వీటిలో అతి పురాతనమైనది [[ఋగ్వేదం]]. వేదాలలో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని వంటి దేవతల ఆరాధన, సోమయాగం వంటి యజ్ఞకర్మలు బహుళంగా చెప్పబడ్డాయి. విగ్రహారాధన కంటే మంత్రారాధన, యజ్ఞకాండలు వేదసాహిత్యంలో ప్రాముఖ్యత వహిస్తాయి. ఋగ్వేదంలోని ఆచారాలు, విశ్వాసాలు [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్ మతాని]]కి కొంత సారూప్యం కలిగి ఉన్నాయి.
వేదాల తరువాతి కాలాన్ని పురాణాల కాలంగా పేర్కొంటారు. వీటిలో మొదటివైనరామాయణం, మహాభారతం 500–100BCE, కాలంలో రూపుదిద్దుకొన్నాయి. తరువాత అనేక పురాణాలు వెలువడ్డాయి. పురాణాలలోని వివిధ అంశాలు నేటి హిందూమతాచారాలు, వ్యవహారాలు, విశ్వాసాలకు ప్రధాన ప్రమాణాలు.
హిందూ మతాన్నీ, అందులోని నమ్మకాలనూ మౌలికంగా ప్రభావితం చేసి, క్రొత్త పరిణామాలకు దారితీసిన మూడు ముఖ్యాంశాలు - ఉపనిషత్తులు, జైన మతము, బౌద్ధ మతము వీటిలో వేదాల సాధికారతను, వర్ణ వ్యవస్థ బంధాన్ని అంగీకరించకుండా మోక్షము లేదా నిర్వాణం పొందడం గురించి చెప్పబడింది. గౌతమ బుద్ధుడు మరింత ముందుకు వెళ్ళి ఆత్మ లేదా భగవంతుడు అన్న నమ్మకాలను ప్రశ్నించాడు. మౌర్యుల కాలంలో బౌద్ధం దేశమంతటా వర్ధిల్లింది (క్రీ.పూ 300 నుండి క్రీ.శ. 200 వరకు). తరువాత వివిధ వేదాంత దర్శనాలు అనేక విధాల సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. వీటిలో క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి చార్వాకుని నాస్తిక వాదం కూడా ఒకటి. క్రమంగా మళ్ళీ బౌద్ధమతాన్ని అణగద్రొక్కి హిందూమతం క్రీ.పూ. 400 నుండి క్రీ.శ. 1000 కాలంలో బలపడింది.
క్రీ.శ. 7వ శతాబ్దంలో భారత దేశంలో అరబ్బు వర్తకుల ద్వారా ప్రవేశపెట్టబడిన ఇస్లాం మతం తరువాత ముస్లిం పాలనా సమయంలో దేశమంతటా విస్తరించింది. ఈ కాలంలో రెండు మతాల మధ్యా వివిధ స్థాయిలలో ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. అదే సమయంలో సహ జీవన విధానాలు కూడా అభివృద్ధి చెందాయి. తరువాతి కాలంలో రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్యుడు వంటి ప్రవక్తల బోధనల వల్ల హిందూమతంలో మరికొన్ని నూతన విధానాలు నెలకొన్నాయి.
హిందూ మతంలో దైవ భావన:
హిందూ మతంలో 'ఒకే దేవుడు', 'చాలా మంది దేవుళ్ళు', 'వివిధ స్థాయి దేవుళ్ళు', 'నిరాకార భగవంతుడు', 'సాకార భగవంతుడు' - ఇలా చాలా విధాలైన విశ్వాసాలు కలగలిపి ఉన్నాయి. కనుక హిందూమతం అంతటా సాధికారంగా ఒప్పుకొనే భావన ఇది అని చెప్పడం క్లిష్టతరమైన విషయమే.
ఎక్కువ మంది హిందువులు నమ్మే విషయాలలో ఒకటి - ఆత్మ శాశ్వతమైనది, నిరాకారమైనది. అద్వైతం వంటి వేదాంతాల ప్రకారం ఈ ఆత్మయే బ్రహ్మము (పరమాత్మ). అద్వితీయము. గుణ రహితము. ఆత్మ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానము లభించినవారికి మోక్షం (బంధనాలనుండి విముక్తి)సిద్ధిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
ద్వైతం, భక్తి వంటి వేదాంత సిద్ధాంతాల ప్రకారం ఆత్మ, పరమాత్మ వేరు వేరు. పరమాత్మకు స్పష్టమైన ఆకృతి ఉంది. జీవుడు పరమాత్మను చేరడమే ముక్తి. అందరికీ ప్రభువైనందున భగవంతుడు "పరమేశ్వరుడు"), Bhagavan ("The Auspicious One"), or Parameshwara ("The Supreme Lord"). కాని ఆయా వేదాంత సూత్రాలను బట్టీ, వాటి వివరణను బట్టీ "బ్రహ్మ", "బ్రహ్మము", "ఈశ్వరుడు", "దేవుడు" వంటి పదాలను అర్ధం చేసుకొనే విధానంలో వైవిధ్యం ఉంటుంది. సాంఖ్యం వంటి సిద్ధాంతాలలో నాస్తికత లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
హైందవ మతం ఏకేశ్వరోపాసన, నాస్తిక వాదం, ఆస్తిక వాదం, ద్వైతం, అద్వైతం, లాంటి విభిన్న విశ్వాసాల సమ్మేళనం. ఇంతటి సంక్లిష్ట మైన భావాలు బహుశా మరే మతంలోనూ కనిపించవు. ఒక్క పదంతో వర్ణించాలంటే అది అసంపూర్తిగానే ఉంటుంది.
హిందువులలో చాలామంది ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు. అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంత శక్తి స్వరూపమైనటువంటి బ్రహ్మం నకు చెందినదే. బ్రహ్మం అనగా ఏదీ సాటిరాని సత్యం. అందుకనే దీనిని అద్వైతం(ద్వైతం కానిది)అన్నారు. దీని ప్రకారం మనుజులు తాము ఆత్మ స్వరూపులని, బ్రహ్మంలో భాగమని తెలుసుకోవడం జీవన పరమార్థం. ఉపనిషత్తుల ప్రకారం ఎవరైతే జీవులు తాము కేవలం దేహం మాత్రమే కాదని, సంపూర్ణ ఆత్మజ్ఞాన సంపన్నులై ఉందురో వారు మోక్ష ప్రాప్తినొందగలరు.
అద్వైతానికి విరుద్ధమైనది ద్వైతం. ద్వైతం అనగా నీవు, భగవంతుడు వేరనే భావన. పరమాత్మ స్వరూపుడు భగవంతుడైతే ఆత్మ స్వరూపులు మనుషులౌతారు. ఈ మర్గాన పయనించేవారు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, లేదా శక్తిని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. ఆత్మ భగవంతునిమీద ఆధారపడితే, మోక్షం దేవుని కృపమీద ఆధారపడి ఉంటుంది. పరమాత్మ స్వరూపుడను మహోన్నతమైన మూర్తిగా భావించినపుడు ఆయనను ఈశ్వరుడు, లేదా భగవానుడు లేదా పరమేశ్వరుడు అనవచ్చును. కానీ ఈశ్వర శబ్దాన్ని మీమాంసకులు మరియు అద్వైతాన్ని అనుసరించేవారు వేర్వేరు భావనలుగా స్వీకరిస్తారు. నాస్తికవాదం వైపు మొగ్గు చూపే సాంఖ్యకులు కూడా ఉన్నారు.
దేవుళ్ళు, అవతారాలు:
రాధాకృష్ణులు, హిందూమతంలో పూజింపబడే అనేక దేవతలలో ఒక జంట
హిందూ పురాణాల ప్రకారం దేవతలు లేదా దేవుళ్ళు అనగా స్వర్గ లోక నివాసులు, పరమ పవిత్రులు, పూజింపదగిన వారు. హిందూ గ్రంథాల్లో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి గురించి ఎన్నో రకాలైన కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత మంది దేవుళ్ళు ఉన్నా పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనే సృష్టి అంతటికీ మూలాధారం. ధర్మాన్ని పరిరక్షించడానికి మరియు సకల మానవాళిని సరియైన దారిలోకి మళ్ళించడానికి స్వర్గం నుంచి మానవ రూపంలో భువి పైన జన్మించిన వారిని అవతార పురుషులు లేదా అవతార మూర్తులు అంటారు. రామావతారం, కృష్ణావతారం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి.
కర్మ, సంసారం, మోక్షం, కర్మ అంటే సామాన్యార్థములో చేతలు, పని చెయ్యడము, విధి మరియు కార్యకారణ నియమము అని చెప్తారు. ఉపనిషత్తుల ప్రకారము ఒక వ్యక్తి లేక జీవాత్మ, బాహ్యముగా కానీ లేక మానసికముగా కానీ చేసిన పనుల వలన సంస్కారాలను ప్రోగు చేసుకుంటుంది. లింగ శరీరము (అనగా బాహ్య శరీరమునకు మరియు ఆత్మకు మధ్య గలది) ఈ సంస్కారాలను తర్వాతి జన్మలకు తీసుకుని వెళుతుంది.ఈ విధముగా అపజయము ఎరుగని, తటస్థ, మరియు విశ్వ నియమము, ఐన కర్మ ఒక వ్యక్తి మరు జన్మకు, ఆ జీవాత్మ ఏ కుటుంబంలో పుట్టాలి అనేది నిర్ణయిస్తుంది. చర్య, ప్రతిచర్య, పుట్టుక, మరణము మరియు పునర్జన్మ అను చక్రాన్ని సంసారము అంటారు. హిందువుల ఆలోచన ప్రకారము కర్మకు, పునర్జన్మకు చాలా ప్రాముఖ్యత ఉంది.
భగవద్గీత ప్రకారము:
" చినిగిన బట్టలను ఏ విధము గా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో అదే విధముగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. " ( భగవద్గీత రెండవ అధ్యాయము 22 వ శ్లోకము) సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణము అవుతుంది. ఐనా మోక్షము ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది. చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతటతానే పరమాత్మతో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకము.
జీవితము యొక్క పరమార్థము మోక్షము అనగా పరమాత్మతో ఐక్యము కావడము అని చెప్పబడుతోంది.అనగా ఆత్మ సాక్షాత్కారము, జీవేశ్వరుల ఐక్యత, ఆత్మ యొక్క పరిపూర్ణ నిస్వార్థత, అమాయకత్వము నుండి విడుదల మరియు పరిపూర్ణ మనశ్శాంతి. ఈ విధమైన స్వేచ్ఛ మనిషిని సంసారము నుండి విడుదల చేసి పునర్జన్మ లేకుండా చేస్తుంది. మోక్షానికి నిర్వచనములు హిందూ మతములో పలురకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు "అద్వైతం" ప్రకారము మోక్షము పొందిన తర్వాత వ్యక్తిత్వము నశించిపోయి విశ్వాత్మ అనగా భగవంతునిలో లీనమవుతుంది. ద్వైతుల ప్రకారము జీవాత్మ అనేది పరమాత్మలో ఒక భాగమని మరియు మోక్షము తర్వాత పరమాత్మతో పరమాత్మ లోకంలో అతని సాన్నిధ్యములో అనంతకాలము ఉంటామని భావిస్తారు. అయితే ద్వైతుల ప్రకారము మోక్షము అనగా " చక్కెరను రుచి చూడడము", అద్వైతుల ప్రకారము " చక్కెర గా మారిపోవడము" అని అర్థము.
4 జీవన గమ్యాలు:
హళెబీడు లోని హొయసలేశ్వర మందిరంలో త్రిమూర్తుల శిల్పాలు: బ్రహ్మ, విష్ణువు, శివుడు.
సంప్రదాయ హిందూధర్మము రెండు ముఖ్యమైన జీవిత కాల ధర్మాలను అంగీకరిస్తుంది: అవి గృహస్థ మరియు సన్యాస ధర్మాలు.
గృహస్థ ధర్మము నాలుగు విధాల పురుషార్థాలను భోధిస్తుంది. అవి
జీవన యోగము:
జీవితంలో అనుసరించవలసిన నియమాలగురించీ, సాధించవలసిన లక్ష్యాలగురించీ వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటి సాధనకు పాటించే మార్గాన్నియోగము అని అంటారు. ప్రతి మనిషి తన జీవిత పరమార్థాన్ని చేరుకోవడానికి యోగులు వివిధ రకాలైన పద్ధతులను ఉపదేశించారు. వీటిలో ఏదైనా ఒక యోగాన్ని సాధన చేసేవారిని యోగి అని అంటారు. భగవద్గీత, యోగ సూత్రాలు, హఠయోగ ప్రదీపిక మరియు వీటన్నింటికీ మూల గ్రంథాలైన ఉపనిషత్తులు యోగం కోసం అంకితమైనవి. ఎవరైనా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని (మోక్షం, సమాధి, లేదా నిర్వాణం)చేరుకోదలచిన వారు క్రింద పేర్కొన్న మార్గాలను అనుసరించ వచ్చు.
వివిధ యోగాల ఆచరణ గురించీ, వాటిలోని భేదాల గురించీ, వాటి మధ్యనున్న సమన్వయం గురించీ అనేక గ్రంథాలు, సూత్రాలు, అభిప్రాయాలు, ఆచారాలు ఉన్నాయి.
వేదాలు మరియు వేదాంత శాస్త్రము:
హిందూ మతం యొక్క మొట్టమొదటి గ్రంథాలైన వేదాలు శ్రుతులకిందకు వస్తాయి. వేదాలను హిందూ ప్రజలు ప్రాచీన ఋషులు కనుగొన్న శాశ్వత సత్యాలుగా కీర్తిస్తారు. కొద్ది మంది భక్తులు మాత్రం వేదాలు ఏ ఒక్కరో లేక భగవంతుడే ఏర్పరిచినట్లు భావించక అన్ని కాలాలలోనూ ఆచరించదగిన ఆధ్యాత్మిక నియమాల సారంగా భావిస్తారు. కాలగమనంలో వేదాలకు కొత్త కొత్త భాష్యాలు పుట్టుకొస్తున్నాయి.
వేదాలు నాలుగు. అవి (1) ఋగ్వేదము, (2) సామవేదము, (3) యజుర్వేదము, (4) అధర్వణవేదము.అన్నింటికన్నా మొట్టమొదటిది మరియు ముఖ్యమైనది ఋగ్వేదము. ప్రతి ఒక్క వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని సంహిత అంటారు. ఇందులో పవిత్రమైనటువంటి మంత్రాలు లిఖించబడి ఉంటాయి. మిగతా మూడు భాగాలలో వ్యాఖ్యానాలు ఉంటాయి. సంహితం కన్నా ఇవి కొంచెం ఆలస్యంగా రచింపబడి ఉండవచ్చునని పండితుల భావన. మిగతా మూడు బ్రాహ్మనలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మొదటి రెండు భాగాల్ని కర్మకాండలు అనీ తరువాతి రెండు భాగాలను జ్ఞానకాండలు అనీ పిలుస్తారు. కొన్ని భాగాలు కర్మకాండలను గూర్చి ప్రస్తావిస్తే ఉపనిషత్తులు ఆధ్యాత్మిక థృక్కోణాన్ని, తత్వశాస్త్ర బోధనలను, మరియు బ్రహ్మము, పునర్జన్మను గూర్చి ప్రస్తావిస్తాయి.
ఇక స్మృతి పురాణాలనగా గుర్తుంచుకొన్నవి. వీటిలో రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు అతి ముఖ్యమైనవి. అత్యంత ప్రాముఖ్యం పొందిన హిందూ మూలగ్రంథం భగవద్గీత మహాభారతంలోని అంతర్భాగం. మహాభారత సంగ్రామ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు పాండవ రాజకుమారుడైన అర్జునునకు ఉపదేశించిన సర్వ వేదాల సారాంశమే గీతాశాస్త్రం. పురాణాలు వివిధ రకాలుగా హిందూ భావజాలాన్ని వ్యక్తీకరిస్తాయి. ఇంకా దేవీ భాగవతం, తంత్రాలు, యోగ సూత్రాలు, తిరు మంత్రం, శివ స్తోత్రాలు, ఆగమ పురాణాలు స్మృతుల కిందకు వస్తాయి. వివాదాస్పదమైన మనుస్మృతి కుల వ్యవస్థను గూర్చి వివరిస్తుంది.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

- " కామము " : శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు
- " అర్థము " : ధన సంపాదన మరియు కీర్తి
- " ధర్మము" : మత లేక సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడము
- " మోక్షము " : పునర్జన్మ రాహిత్యము లేక సంసారచక్రము నుండి విడుదల
జీవన యోగము:
జీవితంలో అనుసరించవలసిన నియమాలగురించీ, సాధించవలసిన లక్ష్యాలగురించీ వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటి సాధనకు పాటించే మార్గాన్నియోగము అని అంటారు. ప్రతి మనిషి తన జీవిత పరమార్థాన్ని చేరుకోవడానికి యోగులు వివిధ రకాలైన పద్ధతులను ఉపదేశించారు. వీటిలో ఏదైనా ఒక యోగాన్ని సాధన చేసేవారిని యోగి అని అంటారు. భగవద్గీత, యోగ సూత్రాలు, హఠయోగ ప్రదీపిక మరియు వీటన్నింటికీ మూల గ్రంథాలైన ఉపనిషత్తులు యోగం కోసం అంకితమైనవి. ఎవరైనా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని (మోక్షం, సమాధి, లేదా నిర్వాణం)చేరుకోదలచిన వారు క్రింద పేర్కొన్న మార్గాలను అనుసరించ వచ్చు.
- భక్తి యోగం (ప్రేమ మరియు భక్తితో కూడిన మార్గం)
- కర్మ యోగం (విధులను సక్రమంగా నిర్వర్తించడం )
- రాజ యోగం (ధ్యాన మార్గం)
- జ్ఞాన యోగం (జ్ఞాన సముపార్జన)