విజయదశమి పండుగ తరువాత వచ్చే పండుగ అట్లతదియ . ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఈ పండుగ రోజున చంద్రోదయ ఉమావ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పండుగ రోజు ముందురోజు న స్త్రీలు టం పాదాలకు , చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు . తదియ నాడు అట్లు వేసి అమ్మవారికి నివేదన చేస్తారు.
పూజా మందిరం లో ఓ పీటను వేసి .. ఆ పీటకు పసువు రాసి కుంకుమ అద్ది ... ఆ పీటపై బియ్యం పోసి చదును చేయాలి. పసుపు తో గౌరమ్మను చేసి కుంకుమ అలంకరించి తమలపాకు పై ఉంచి అలంకరించిన పీట పై గౌరమ్మను ఉంచాలి. చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచరాల తో ఉమాదేవిని పూజించాలి .
గౌరీదేవే ఉమాదేవి ... అందుకే పసుపు ముద్దతో గౌరీ దేవిని చేస్తారు. చంద్రోదయం ను చూసి ఉమాదేవిని పూజిస్తారు కనుకనే "చంద్రోదయ ఉమావ్రతం" అంటారు. అమ్మవారికి పది అట్లను నైవేద్యం గా పెట్టి ఒక ముత్తిడువకు పది అట్లు వాయినం ఇచ్చి పది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు .
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి