ఒక సారి స్వామి వివేకానందుల వారు, వారి గురువుగారైన శ్రీ రామకృష్ణ పరమహంస గారిని ఈ విధంగా అడిగారు.:
ప్ర|| గురువుగారూ నేను భగవంతుని చూడగలనా?
జ|| ఎందుకు చూడలేవు తప్పకుండా చూడగలవు.
ప్ర|| ఎప్పుడు?
జ|| నీలో భగవంతుని పట్ల పరిపూర్ణ ఆర్తి ఉన్నప్పుడు.
ప్ర|| ఆర్తి అంతే ఏమిటి?
జ|| ఒక మనిషి తలపట్టుకొని నీటిలో ముంచి అలాగే కొంతసేపు నీటిలో ముంచి,
పట్టుకొన్నప్పుడు, ఆ మనిషి గాలి కోసం(శ్వాస) గిలగిలా కొట్టుకొన్న విధముగా, తన్నుకొన్న విధముగా, నీవు భగవంతుని చూడాలనే ఆర్తితో గిలగిలా కొట్టుకొనుచున్నప్పుడు. భగవంతుడు తప్పకుండా కనిపిస్తాడు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి