ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒక చర్మసంబంధ సమస్య. చర్మపు ముడతలు, పల్లాలు ముదురు రంగులో వెల్వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారడమే కాకుండా చెడు వాసన కూడా వస్తుంటుంది. ఈ వ్యాధిలో సాధారణంగా చంకలు, గజ్జలు, మెడ వెనుక చర్మపుముడతలు నలుపుగా, మందంగా తయారవుతుంటాయి. సాధారణంగా అధిక బరువు కలిగిన వ్యక్తుల్లోనూ, షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంటుంది.
చిన్నతనంలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే, పెద్దయిన తరువాత షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా అరుదైన ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది అమ్లాశయపు క్యాన్సర్కిగాని లేదా కాలేయపు క్యాన్సర్కిగాని హెచ్చరిక లక్షణంగా కనిపించవచ్చు. ఈ లక్షణం కనిపిస్తున్నప్పుడు సాధారణంగా దీనికి దారితీసే వ్యాధి స్థితిని సరిదిద్దితే సరిపోతుంది.
లక్షణాలు
చంకలు, గజ్జలు, మెడలోని చర్మపు ముడుతలు, పల్లాలు ముదురు రంగులోకి మారతాయి మందంగా, వెల్వెట్ గుడ్డ మాదిరిగా తయారవుతాయి ఈ మార్పులు వెంటనే కాకుండా నెమ్మదిగా, కొన్ని నెలలు, సంవత్సరాలపాటు చోటుచేసుకుంటాయి. వ్యాధి ప్రభావానికి గురైన చర్మం నుంచి చెడు వాసన వస్తుంటుంది. కొద్దిగా దురదగా కూడా అనిపిస్తుంటుంది.
కారణాలు
ఇన్సులిన్ హార్మోన్ని శరీరం వినియోగించుకోలేకపోవటం (ఇన్సులిన్ రెసిస్టెన్స్): క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) ఇన్సులిన్ హార్మోన్ని విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇన్సులిన్ అనేది షుగర్ని శరీరం వినియోగించుకోవడానికి సహాయపడుతుందన్న సంగతి కూడా తెలిసిందే. ఒకవేళ ఈ ఇన్సులిన్ శరీరం గుర్తించలేకపోతే దానిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల చర్మం ముడతలు మందంగా, నలుపుగా తయారవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్వల్ల మున్ముందు కాలంలో షుగర్ వ్యాధివచ్చే అవకాశం ఉంటుంది.
- అధిక బరువు : స్థూలకాయుల్లో చర్మం ముడతలు మందంగా నల్లగా తయారవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ప్రధాన కారణం అధిక బరువు. స్థూలకాయం షుగర్ వ్యాధికి ఒక ముఖ్యమైన ప్రేరకం.
- హార్మోన్ సమస్యలు : అండాశయాల్లో నీటి బుడగలు పెరగటం, థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గటం, కిడ్నీల మీద ఉండే ఎడ్రినల్ గ్రంథులు వ్యాధిగ్రస్తం కావటం వంటి కారణాలవల్ల చర్మపు ముడుతలు మందంగా, నల్లగా తయారవుతాయి.
- మందులు : సంతాన నిరోధక మాత్రలు, కార్టికోస్టీరాయిడ్ మందులు, నియాసిన్ వంటి మందుల వాడకం వల్ల కూడా చర్మపు ముడతలు నల్లగా మందంగా
- తయారై ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ రావచ్చు.
- క్యాన్సర్ : శరీరపు అంతర్గ భాగాల్లో పెరిగే కాన్సర్ కణితులవల్ల కూడా చర్మం మీద ముడతలు నల్లగా మందంగా తయారవుతాయి. ఆమాశయం, పెద్దప్రేగు, కాలేయానికి సంబంధించిన క్యాన్సర్లలో ఇలాంటి లక్షణం కనిపిస్తుంటుంది.
- ప్రేరకాలు (రిస్కులు): అధిక బరువు, వంశపారంపర్యత, జన్యువులు.
ఈ వ్యాధిని నిర్థారించడానికి కొంత సమాచారాన్ని మీరు డాక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు: -
- మీ కుటుంబంలో నలుపుదనంతోకూడిన మందపాటి చర్మం ముడతలు ఉన్నాయా?
- మీ కుటుంబంలో షుగర్ వ్యాధి ఉందా? -మీకు అండాశయానికి, లేదా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా?
- మీరు ఇతర వ్యాధులకు ఏవన్నా మందులు వాడుతున్నారా?ఎప్పుడైనా స్టీరాయిడ్ మందును వాడాల్సిన అవసరం వచ్చిందా?
- ఈ లక్షణాలు ముందుగా ఎప్పుడు మొదలయ్యాయి?
- సమయం గడిచే కొద్దీ ఇవి తీవ్రతరమవుతున్నాయా?
- మీ శరీరంలో ఏ భాగాలు వ్యాధి లక్షణాలను ప్రదర్శిస్తున్నాయి?
- మీకు గాని లేదా మీ కుటుంబంలో ఇతరులకు ఎవరికైనా గాని క్యాన్సర్ వచ్చిన ఇతివృత్తం ఉందా?
చికిత్సల ఉద్దేశ్యం-లక్షణాలను కలిగించే అంతర్గత వ్యాధిని ముందుగా గుర్తించి అదుపులో ఉంచటం. చర్మం ఎబ్బెట్టుగా కనిపించకుండా మచ్చల గాఢతను తగ్గించటం -ఆహారంలో మార్పులు చేర్పులను సూచించటం -ఒకవేళ అధిక బరువు కలిగి ఉంటే బరువు తగ్గేలాఆహార, విహార, ఔషధాపరమైన చికిత్సలను సూచించటం చర్మంమీద నలుపు రంగు మందపాటి వైద్య
సలహాతో వాడుకోవాల్సిన ఔషధాలు:
- పంచతిక్తఘృత గుగ్గులు.
- మహామంజిష్టాది క్వాథం.
- మహాభల్లాతక రసాయనం.
- అమృత భల్లాతక లేహ్యం.
- లంకేశ్వర రసం.
- అరగ్వదాది ఉద్వర్తనం.
- మహా మరీచ్యాది తైలం.
- శే్వత కరవీరాది తైలం.
కారణాన్ని బట్టి ట్రీట్ మెంట్ చేయాలి . మదుమేహము అదుపులో ఉండేటట్లు , కాన్సర్ అయితే దానికి తగిన వైద్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది. సాధారణము గా ఇది దానంతట అదే తగ్గిపోవును .. . దాని మూలాన్ని బాగుజేసుకుంటే.
Restoderm or Total derm వంటి ఆయింట్ మెంట్స్ బయట మచ్చలు పైన పూత గా రాస్తే కొద్దికాలము లో ఇది పూర్తిగా మామూలు చర్మము రంగులోనికి మారిపోవును .
హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి