శంఖు స్థాపన:
ఇంటి పొడవును 9 భాగాలుగా చేసి ఇందులో పాదాల నుంచి 3 భాగాలు విడిచిపెట్టాలి. మిగిలిన 3 భాగాలలో వాస్తుపురుషుడి పాదాలు వున్న నాభిస్థానం. ఈ నాభిస్థానంలో తవ్వి నవధాన్యాలతో శంఖువును స్థాపించాలి.
ముందు శంఖువును ధాన్యరాశిపై వుంచి వాస్తుపూజ చేసినాక శంఖుస్థాపన చేయాలి. గంధపు చెక్కతోకాని, మారేడు, అత్తి, మద్ది, వేప, చండ్రకొయ్యతో కాని శంఖువును తయారు చేస్తారు. శంఖుస్థాపనకు మొదటి జాము ప్రశస్తం. రెండవ, మూడవ జామున, రాత్రులందు, శంఖుస్థాపన చేయకూడదు. ఇల్లు కట్టుకునే ముందు శంఖుస్థాపన చేయడం మంచిది. దీని వల్ల కొన్ని దోషాలు నివారణ అవుతాయి.
బ్రాహ్మడి జాబితా ప్రకారము అన్ని తెచ్చుకొనవలెను. ముందు రోజురాత్రి గుంట తీయించవలెను. జంపకనాలు, కుర్చీలు, పీటలు, మంచినీళ్ళు, గ్లాసులు మొదలగునవి. వచ్చిన అతిధులకు టిఫిన్లు, టీ ఇచ్చి, బొట్టు, పండు తాంబూలము ఇచ్చి పంపవలెను.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి