స్ధిత ఊర్ధ్వపాదవిస్తృతాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…
స్ధిత ఊర్ధ్వపాదవిస్తృతాసనం:-
- - కూర్చొని కాళ్ళను సగం చాపి మడమలు నేలకు ఆనించాలి.
- - చేతులతో బొటనవేళ్ళను పట్టుకోవాలి.
- - చేతుల సాయంతో కాళ్ళను నేలకు కొంచెం పై భాగానికి తీసుకురావాలి.
- - పిరుదులు భాగం మాత్రమే నేలమీద ఉండాలి.
- - సుదీర్ఘ శ్వాస తీసుకుంటూ కాళ్ళను వెడల్పు చేసి చేతులు, కాళ్ళు నిటారుగా ఉంచి చేయాలి.
- - ఉండగలిగినంత సేపు ఉండి పూర్వపుస్ధితికి రావాలి.(3 లేదా 5 సార్లు)
1. కాళ్ళు, తొడలు, చేతులు, జబ్బలు, భుజాలు, కండరాలు, ఎముకలు పుష్టివంతంగా తయారవుతాయి.
2. వెన్నెముక చివరిభాగం బలోపేతమై మూలాధారచక్రం సక్రమమగును.
3. సయాటికా, పక్షవాతం లాంటి వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది.
4. మూలశంక వ్యాధి తొలగును జననేంద్రియ సమస్యలు నివారించుకోవచ్చు.
5. ఋతుక్రమము సక్రమమగును.
హెచ్చరిక:
పైన నుదహరించిన యోగ-విధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ సూత్రాలు మాత్రమే, పూర్తి యోగాసనాలు నేర్చుకొనుటకు యోగ అధ్యాపకుడిని సంప్రదించగలరు ! ...
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి