పెదాలకు లిప్ గ్లాస్‌ను వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు…
పెదాలకు లిప్ గ్లాస్‌ను వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే అసలైన అందం మీ సొంతం అవుతుంది. పెదాలకు రంగు ఇచ్చే సాధనం పేరే లిప్ గ్లాస్. ఇది పెదాలను కళకళలాడించడమే గాక మృదువుగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది.
లిప్ స్టిక్ పై దీనిని వాడొచ్చు. లేకుంటే లేతగా కన్పించేందుకు దీనిని మాత్రమే వాడవచ్చు. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కలిగిన లిప్ గ్లాస్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. లిప్‌స్టిక్‌పై దీనిని వాడే సమయంలో గట్టిగా రుద్దకూడదు. లేకుంటే లిప్‌స్టిక్ అలాగే కారిపోతుంది.
తక్కువగా అప్లై చేయాలి: లిప్ గ్లాస్ అప్లై చేసే ముందు తక్కువగా అప్లై చేయాలి. తక్కువగా అప్లై చేసినప్పుడు పెదాలు తడిగా, నిండుగా జ్యూసిగా కనబడుతాయి. లిప్ స్టిక్ అప్లై చేసిన తర్వాత మరింత అందంగా కనబడాలంటే, లిప్ స్టిక్ తర్వాత మినిమాల్ లిప్ గ్లాస్ అప్లై చేయాలి. లిప్ గ్లాస్ అప్లై చేసేటప్పుడు పెదవులకు చివరగా అప్లై చేయకూడదు. అలా చేయండం వల్ల పెదవుల క్రిందిగా లిప్ గ్లాస్ కారినట్లు కనబడుతూ అస్యహ్యంగా ఉంటుంది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి