గోముఖాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…'
గోముఖాసనం:
- - సుఖాసనంలో కూర్చొని ఉండాలి.
- - ఎడమపాదము కుడి పిరుదుల క్రింద ఉంచాలి.
- - కుడి మోకాలు ఎడమ మోకాలి మీద ఉంచాలి.
- - కుడి చేతిని పైనుండి, ఎడమ చేయిని క్రింద నుంచి వెనుకకు తీసుకు వెళ్ళి రెండు చేతివేళ్ళను ఒకదానితో మరొకటి పట్టుకోవాలి.
- - తల ఎడమవైపు త్రిప్పుచూ శ్వాస తీసుకుని కుడివైపు త్రిప్పుచూ శ్వాసను వదలాలి.
- - తర్వాత కాళ్ళను మార్చి చేయాలి.(3 లేక 5 సార్లు)
1. భుజాలు, చేతులు, మెడ నరాల సమస్య, తుంటి సమస్యలు , జననేంద్రియ సమస్యలు నివారించుకోవచ్చు, వీపుకండరాలు, ఎముకలు బలోపేతమగును.
2. ఋతుక్రమము, సక్రమమగును, అధిక మూత్రసమస్య తొలగును.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి