ముఖంపై బ్లాక్‌హెడ్స్‌ని తొలగించే సులువైన చిట్కా…
- ఒక గిన్నె నిండా నీళ్లు బాగా మరగించండి, నీళ్లు బాగా కాగిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి, టవల్‌తో గాని దుప్పటితో గాని తల మీద కప్పుకుని ఆ నీటితో ముఖాన ఆవిరి పట్టండి.
- ఇలా 5 నుంచి 10 నిమిషాలు ఆవిరి పట్టండి.
- తరువాత ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ నీళ్లు తీసుకుని పేస్ట్‌లా చేయాలి.
- ఈ మిశ్రమంతో ముఖంపై బాగా స్ర్కబ్ చేసుకోవాలి.
- ఆ తరువాత కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకుని ముఖంపై బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో లేయర్‌లా పట్టించుకోవాలి, దానిపై టిష్యూ అతికించాలి, మళ్లీ ఇంకోసారి టిష్యూపై ఎగ్ వైట్ కోటింగ్ అప్లై చేయాలి.
- అది బాగా ఆరిన తర్వాత పీల్ ఆప్ చేయాలి. ఆ టిష్యూతో పాటు మీ ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్ అన్నీ వచ్చేస్తాయి.