సీమంతము:
స్త్రీకి ప్రధమ గర్భమందు 4,6,8 నెలలలో ఏ నెలయందైనను భర్త శ్రీమంతమను సంస్కారము చేయవలెను. మరియు 8వ నెలలో విష్ణు దేవతా పూజ చేయవలెను. (ముహూర్త దర్పణం). ఉపయుక్త తిధి, వారదులు:
- తిథులు: విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, పూర్ణమి.
- వారములు: సోమ, బుధ, గురు, శుక్ర వారములు.
- నక్షత్రములు: రోహిణి, మృగశిర, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి.
- లగ్నములు: మేష, వృషభ, మిధున, తుల, ధనస్సు, కుంభ, మీనములలో అష్టమశుద్ది గలవి.
సీమంతోన్నయనము (సీమంతము)
సీమంతమనగా జుట్టును ఉన్నయనముగా తీర్చిదిద్దుట. అనగా జుట్టుదువ్విపాపిటను తీర్చి దిద్దుట అని చెప్పవచ్చును. దీనినే సీమంతము అనికూడ అందురు. సీమంతము నేడు కేవలం వేడుకగా మాత్రమే జరుపుచున్నారు. గాజులు పెట్టించి, లడ్డు మొదలైన తీపి పదార్థములు, నూతన వస్త్రములు గర్భిణీ స్త్రీకి యిచ్చి, పూలజడవేసి వేడుక చేసుకుంటున్నారు. ఈ సీమంతోన్నయన సంస్కారము నాలుగవ నెలయందు గాని పురుడు వచ్చేలోగా ఎపుడైనా చేయవచ్చును. వారి వంశాచారము బట్టి చేయవచ్చును. ఇది భార్యా భర్తలు యిరువురు కలిసి చేయవలసిన సంస్కారము.
సీమంతమునకు నాలుగు రోజులు ముందుగా మట్టి మూకుళ్ళలో యవలుచల్లి మొలకెత్తించవలెను. ఆ మెలకలను, ఏదుపందిముళ్ళను, మేడికొమ్మను, వీటిని కట్టేతాడును పాత్రాసాధనలో పెట్టిహొమానంతరం భార్యను అగ్నికి పడమర వైపున తూర్పు ముఖముగా కూర్చుండబెట్టి ఆమె ఎదురుగా భర్త నిలబడి మంత్రయుక్తముగా ఏదుపందిముల్లు, 3 ధర్భకట్టలు, మేడికొమ్మతో చేర్చి ఒక మారు గ్రహించి నాభి ప్రదేశమునుంచి పాపిటి వరకు పైకి శరీరము తాకుతూ తీసుకువెళ్ళి పడరమవైపు పారవేసి చేతులు ఉదకముతో తుడుచుకొనవలెను. మొలకెత్తిన యవలు తలపైపోసి కట్టవలెను. నక్షత్రములు కనుపించువరకు గర్భిణీ స్త్రీ మౌనముగా ఎవరితోను మాట్లాడకుండా ఉండవలెను. నక్షత్ర దర్శన మైన తరువాత దైవ ప్రార్ధన చేసి మాట్లాడవచ్చును. 8వ మాసమందు విష్ణు దేవతార్చన చేయవలెను.
గమనిక: యాజుషస్మార్తాను క్రమణిక, సంస్కార చింతామణి, సంస్కార దీపికలలో శ్రీమంతోన్నయన సంస్కారం గురించి వ్రాసియున్నది. అందులో చూచి ఆవిధముగా ఆచరించవలెను.
శ్రీ మంతము ఎలా జరుపుకుంటారో - ఈ వీడియోలో చుడండి !
సీమంతానికి కావలసిన వస్తువులు :
పూజా సామాగ్రి, గాజులు, చీరె, రవిక, స్వీట్లు, అద్దం, దువ్వెన, కాటుక మొదలైనవి.
సీమంతము చేయువిధము:
(శ్రీమంతోన్నయనం ప్రధమేగర్భె చతుర్ధేమాసి బ్రాహ్మణాంభోజయిత్వా)
- ప్రథమేగర్భె చతుర్థేమాసి షస్ఠేస్టమేవా శుభేహనిదంపతీ మంగళస్నాతౌభూత్వా ||
- ఏవంగుణ------- శుభతిధౌ ధర్మపత్నీ సమేతోహం మమ ధర్మపన్యాః ప్రధమగగర్భ సంస్కారంద్వారా సర్వగర్భ శుద్ధ్యర్ధం శ్రీమంతోన్నయనం కర్మకరిష్యమాణః తదాదౌ శుద్ధ్యర్ధం --- సహస్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే ||
- ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తర్థ్యం శ్రీమహాగణాధిపతి పూజాం కరిష్యే|| గణాధిపతి పూజాం పుణ్యాహవాచనం కృత్వా | ఆచమ్య ||
- ఏవం -- ప్రీత్యర్ధం మమ భార్యాయాం జనిష్యమాణ సర్వ గర్భాణాం బీజగర్భ సముద్భవైనో నిర్వహణద్వారా ప్రధమగర్భ సంస్కారాతిశయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమంతోన్నయనం కర్మ కరిష్య ||
- ఇతి సంకల్పం|| పునః ప్రాణానాయమ్య ఏవంగుణ---పత్నీసమేతోహం శ్రీమంతోన్నయనాంగత్వేనోభయోఃరక్షార్ధం రక్షాబంధనం కరిష్యే||
- ఏవం--ప్రీత్యర్ధం శ్రీమంతోన్నయనాంగత్వేన అభ్యుదయికంకర్మకరిష్యే||
- తదంగత్యేన బ్రాహ్మణపూజాం కరిష్యే||
- తదంగ--కర్మణః పుణ్యాహం వాచయిష్యే||
- ఓం కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంత్విత్యాదిపత్నీ మార్జనాంతం కుర్యాతు ||
- పునః ప్రాణానాయమ్య--ఏవం--ప్రీత్యర్ధం మమధర్మపత్యాం ప్రధమగర్భ సంస్కారద్వారా సర్వగర్భ సంస్కారార్ధం శ్రీమంతహొమం కరిష్యే||
- ఔపాసనాగ్నౌహొమం కుర్యాత్||
- అథవాలౌకికాగ్నౌహొమం కుర్యాత్ శ్రీమంతోన్నయనంకర్మ యస్మిన్నేకదినే భవత్ | తత్ర పుంసువనంచేత్తు పూర్వా పుంసువనక్రియా| ఏతస్మిన్ దివపేచేత్తు యుగపద్గర్భ కర్మణి| తత్రపుంపుసువనం పూర్వం పశ్చాత్సీమంతమాచరేత్|| సత్యవ్రతః||
- స్రీయధాకృతసీమంతా ప్రసూయేత కథంచన| గృహీతపుత్రా విధివత్పునస్సంస్కారమహతి|| ఇతి శ్రీమంత ప్రయోగస్సమాప్తః
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి