పసుపు కొట్టుట:
పెండ్లిపనులు మొదలు పెట్టుటకు మంచిరోజు చూసి పసుపుకొట్టవలెను, రోలుకు, రోకలికి 5 పోగులదారమునకు పసుపురాసి తమలపాకు ముడివేసి రెండిటికి కట్టవలెను. రోలులో 5 పసుపు కొమ్ములు వేసి, 5గురు ముత్తైదువులు దంచవలెను. ఈ పసుపు కొమ్ములు మెత్తగా నూరి తలంబ్రాలు బియ్యములో కలపవలెను.
ముత్తైదువులకు పండు, తాంబూలము, బొట్టు ఇవ్వవలెను. ఒక చాట బియ్యము 5గురు ముత్తైదువులు ఏరవలెను, పెండ్లి కూతురునకు ఒక చీర కొనిపెట్టవలెను, తరువాత రోజు నుంచి ఇంటికి రంగులు వేయించుట, మిగిలిన అన్ని పెండ్లి పనులు మొదలుపెట్టవచ్చును.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి