కొత్తగా తల్లి అయిన వారికి సూపర్ ఫూడ్స్..!
అద్భుతమైన గర్భాధారణ కాలం తర్వాత, మీరు ఇప్పుడు ఒక బిడ్డకు తల్లై ఉంటారు. మీ శిశువు కోసం అన్ని రకాల శ్రద్దతీసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ప్రసవం తర్వాత హాస్పటల్ నుంచి ఇంటికి వచ్చిన మొదటి రోజు నుండే మీ లైఫ్ స్టైల్ మీ మారిపోతుంది. మీ శరీరం మైండ్ మీద ఒత్తిడి పడుతుంది. గర్భాధారణ సమయంలో జరిగిన హార్మోనుల్లో మార్పులు మైండ్ సెట్‌ను తిరిగి నార్మల్ కండిషన్‌కు తీసుకురావాలి. అందకు కొంత సమయం పడుతుంది. మీ అంతకు మీరు స్వతహాగా కేర్ తీసుకోవడానికి బేబీని జాగ్రత్తగా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలతో పాటు డైట్ ఫాలో అవ్వడం చాలా అవసరం.
ప్రసవం తర్వాత కొత్త తల్లి పోస్ట్ నేటల్ డైట్‌ను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తీసుకొనే ఆహారపు అలవాట్లు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు తీసుకొనే ఆహారం మీదే మీ బేబి పెరుగుదల ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకొనే పౌష్టికాహారంతోనే బిడ్డకు సరిపడా ఫీడింగ్ చేయవచ్చు. శిశువుకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో సరైన న్యూట్రిషియన్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. పౌష్టికాహార లోపం వల్ల ఆ ప్రభావం శిశువు మీద చూపెడుతుంది. మీరు తీసుకొనే ఆహారం పరిమాణంలో కంటే పోషకవిలువల నాణ్యత చూడాలి. సాధారణ ఆహారం లేదా హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల అది మీకు కానీ, మీ శిశువు కానీ ఎటువంటి ప్రయోజనం కలిగించదు. మరి ప్రసవం తర్వాత కొత్తతల్లి తీసుకోవాల్సిన పోస్ట్ నేటల్ డైట్ సూపర్ ఫుడ్స్ క్రింది స్లైడ్ లో చూడండి. ఇవి అటు కొత్తగా తల్లైన వారికి మరియు వారి శిశువు ఆరోగ్యానికి చాలా మంచిది.
పోస్ట్ నేటల్ డైట్ సూపర్ ఫుడ్స్:
- పెరుగు: ప్రసవం తర్వాత మీరు తీసుకొనే ఆహారంలో పెరుగును చేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది మీకు కావల్సినంత క్యాల్షియంను, ప్రోటీనులను అంధించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
- ఉసిరి కాయ (గూస్ బెర్రీ): ఉసిరికాయలో ఐరన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయను పోస్ట్ నేటల్ డైట్ లో చేర్చి తీసుకోవడం చాలా అవసరం. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కొత్త తల్లి కోల్పోయే ఐరన్ కంటెంట్ ను తిరిగి క్రమం చేయడానికి ఐరన్ రిచ్ గా ఉండే ఈ ఉసిరికాయ బాగా సహాయపడుతుంది.
- నీళ్లు: ప్రతి రోజూ తగినన్ని నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నీరు ఎక్కువగా త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్లో ఉంచుతుంది. అంతే కాదు ప్రసవం తర్వాత ఏర్పడే మలబద్దక సమస్యను నివారిస్తుంది. ఇంకా ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భాధారణ సమయంలో తీసుకొన్న వివిధ రకాల మందులు మాత్రల వల్ల దెబ్బతిన్న చర్మాన్ని(పొడిబారిన చర్మాన్ని)తిరిగి యదాస్థితికి తీసుకు రావడానికి నీళ్లు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.
- అరటి: ప్రసవం తర్వాత మీ శరీరానికి కావల్సినంత శక్తిని, బలాన్ని అంధించడంలో అరటి పండు అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే అరటి పండులో హై ఐరన్ కంటెంట్ తో పాటు పొటాషయం పుష్కలంగా ఉంటుంది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి