పదహారు రోజుల పండుగ:
అంకురార్పణ చేసినప్పుడు మూకుళ్ళలో మట్టిపోసి నవధాన్యములను చల్లింతురు. మూకుళ్ళు ఇంటికి తెచ్చుకుని ప్రతిరోజు నీరు పోయాలి. అవి మొక్కలు మొలచును. ఆ మూకుళ్ళలో మొక్కలు, మట్టితీసి కడగవలెను. ఆ మొక్కలు 3గుమ్మముల వద్ద రెండు వైపుల కొన్నికొన్ని మొక్కలు వుంచాలి. శుభ్రము చేసిన మూకుడుకు పసుపురాసి బొట్టుపెట్టి 1గిద్ద బియ్యము, పండు తాంబూలము, జాకెటు ముక్క, దక్షిణ పెట్టి పెండ్లికూతురు చేత ఇప్పించవలెను. భోజనములో అట్లు వడ్డించాలి. భోజనము అయిన తరువాత మంగళసూత్రములు బంగారు గొలుసులోకి మార్చవలెను. పెండ్లిరోజున ఇంట్లో పెండ్లికుమారునికి, తండ్రికి, తల్లికి బట్టలు పెట్టవలెను. ఉదయమే నవదంపతులకు హారతిపట్టి స్నానము చేయించవలెను.
పెండ్లికుమారుడు స్నానము అయినాక దేవుని వద్ద కూర్చొని ఉత్తర జన్యములు, బటువు, కంకణము తీయవలెను. వడిగట్టు బియ్యము అమ్మాయి వాళ్ళ బియ్యము అబ్బాయివారికి, అబ్బాయివారి బియ్యము అమ్మాయి వారికి వచ్చును. ఆరోజు ఆ బియ్యముతో పొంగలి చేసి నైవేద్యము పెట్టవలెను. బటువు, కంకణము, ఉత్తర జన్యములు పెండ్లికుమారుని సోదరికి ఇవ్వవలెను.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి