వృద్ధాశ్రమాలలో తల్లితండ్రులు:
ఈ నాటి ప్రపంచంలో యువత, బాల, బాలికలు, ఈ లోకం ధర్మపథంలో నడవాలంటే, నిలబడాలంటే, ప్రతి ఇంటిలోనూ నాన్నమ్మలు, అమ్మమ్మలు ఉండితీరాలి. కానీ నేడు నాన్నమ్మలు, అమ్మమ్మలు వృద్ధాశ్రమాలాలో ఉంటున్నారు. వృద్ధులు గనుక వారు మన ఇళ్లలోనే వారు ఉండితీరాలి.
ఎందుకంటే ఇక్కడ ఒక పర్యాయము బాగా ఆలోచించండి, మన కొరకు మన తల్లితండ్రులు నిద్రాహారాలు లేక మనకు సేవలు చేస్తూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో కదా, ఎన్ని ఉపవాసాలు చేశారో, ఎన్ని మ్రొక్కులు మ్రోక్కెరో, ఎంత శ్రమ చేసేరో, ఎంత వ్యధ చెందినారో, అన్నిశ్రమలూ పడితేనేకదా మనము ఈ రోజున ఇంతవారమయ్యాము. వారికి ఆకలేసినా వారు కడుపు మాడ్చుకొని మనకు మూడుపూటలా అన్నం పెడితే తిని వృద్ధి చెందినవారము కాదా? దినకూలీ చేసుకునే తల్లితండ్రులు కూడా నా బిడ్డ ఇంగ్లీషు చదువులు చదివి అభివృద్ధి చెందాలని వృద్దిలోనికి రావాలని, మనము పడే కాయ కష్టము మనబిడ్డలు పడకూడదని పస్తులుండి మనకు అన్నం పెట్టి మన స్కూల్ ఫీజులు కట్టినవారు మన తల్లితండ్రులు. మనము చిన్నతనములో కానీ, యవ్వనములో కానీ మన తల్లితండ్రులకు కోపముకలిగించే పనులు, విసిగించే పనులు, అసహ్యము కలిగించే పనులు చేయకనే ఇంతవారమయ్యామా? ఒకసారి మనస్పూర్తిగా ఆలోచించండి.
మరి ఆనాడు మనలను మన తల్లి తండ్రులు మనలను అసహ్యహిచుకొని, కోపగించుకొని వదలేసి ఉంటే మనము ఏ అనాధాశ్రమము పాలో అయి ఉండేవాళ్లము కదా? లేక ఏ వీధి రౌడీగానో, ఏ దొంగగానో, రాక్షస ప్రవృత్తులతో పదిమందీ అసహ్యకించుకొనేలా బ్రతుకుతూ ఉండేవారము. ఈ సభ్య సమాజములో నిర్భయముగా జీవించే అవకాశము ఉండేదా? ఇది నేర్పినవారు ఈ విధముగా మనలను తీర్చిదిద్ది,విద్యాబుద్ధులు, సభ్యత, సంస్కారములు నేర్పి ఈ నాడు మనకు ఈ సభ్య సమాజములో అందుచున్న ఈ గౌరవ ప్రతిష్టలను భిక్షగా పెట్టినవారు మన తల్లితండ్రులు.
మనము అభివృద్ధిలోకి వస్తే, ఒక ఉద్యోగము రావడం, ఉద్యోగములో ప్రమోషన్లురావడం, వ్యాపారమైతే ఆర్ధికముగా బాగా స్తిరపడి, ఉన్నతస్థాయికి రావడం, ఒకగొప్ప పదవిని చేపట్టి పదిమందిచేత మంచివాడు అనిపించుకొనడం ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి తల్లితండ్రులు ఎంత పొంగిపోతారో, ఒకవేళ వారు వృద్ధాశ్రమాలాలోఉన్నా వారికి ఈ విషయం తెలిస్తే ఎంత పొంగిపోతారో, పొంగి తబ్బిబై పోయి మనలను ఆ ఆనంద హృదయముతో దీవిస్తారు, ఆ దీవనలే మనకు శ్రీరామరక్ష. గుడిలో దేవుని ఆశీస్సులకన్నా, గుడిలో అమ్మవారి అనుగ్రహముకన్నా తల్లితండ్రులు ఆనంద హృదయముతో పరవశించి దీవించే దీవెనలు శ్రేయస్కరమైనవి. అవే మనకు శ్రీరామరక్ష. ఎందుకంటే కరచరణాదులతో కదలాడుతూ, మనకు సేవలుచేసి, వృద్ధాప్యములో మనచేత సేవలు చేయించుకొనే ప్రత్యక్ష్య దేవుళ్లు తల్లితండ్రులు. వారికి మించిన దైవములేదు.
కాబట్టి వారు పొరపా టునకూడా మనలను తిట్టరు శపించరు. వాడు పిల్లాపాపలతో పదికాలాలపాటూ చల్లాగాఉంటే అంతేచాలు అదే మాకు పదివేలు అంటారే కానీ,పొరపాటున కూడా మనలను తిట్టరు శపించరు అదే (అదే భగవంతుడు, భగవంతుడుకూడా ఎవరినీ శపించడు, తిట్టడు బగవంతునికి అందరూ సమానమే) మాతృహృదయం. మరి అలాంటి మన తల్లితండ్రులను, నాన్నమ్మలను ,అమ్మమ్మలను, తాతయ్యలను విజ్ఞులమైన మనము వృద్ధాశ్రమాలాలో ఉంచడము ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. అసలు వారిని వృద్ధాశ్రమాలలో ఉంచడానికి గల కారణాలను ఒక పరి లోతుగా పరిశీలిస్తే మనకు బోధపడేఅంశాలు, అమ్మ నాన్నలు మన మాట వినలేదనో, వారికి సేవలు చేయవలసి వస్తుందనో, మన సుఖసంతోషాలకు ఆటంకమనో, లేదా వారి అనారో గ్యమునకు, మందులకు, డాక్టర్లకు డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుందనో కారణాలు తప్ప మరే ఇతర కారణాలు కనబడుటలేదు. మనము మన తల్లితండ్రులను చిన్నతనములో,యవ్వనములో, చదువు కునే రోజులలో క్లేశములు కలిగించలేదా? మరి వారు కూడా మనలాగే ఆలోచించి మనలను నిర్లక్ష్యము చేసిఉంటే మనకు ఈ రోజు ఈ స్థితి ఉండేదా? మరి చిన్నతనములో, యవ్వనములో, చదువుకునే రోజులలో, మనము మన తల్లితండ్రులు కు కలిగించిన క్లేశములకంటే, మన తల్లితండ్రులు మనకు ఎక్కువ క్లేశము కలిగించినారా?బాగా ఆలోచించండి.
మరి మన పిల్లలు మన తల్లితండ్రులలాగే విసిగిస్తారు, కోపం తెప్పిస్తారు, అనవసర ఖర్చులు చేయిస్తారు మరి మనబిడ్డలను మనము పై కారణాల వలన ఏ ఆశ్రమములోనో లేదా ఏ వసతి గృహలలోనో వదలివేయగలమా?వదలలే ము. ఎందుకు? మనది కన్నప్రేమ, పెంచినప్రేమ, మమకారము, కడుపుతీపి, పేగుబంధము కదా! మన తల్లితండ్రులకు మనపట్ల ఇవి ఉండవా? మన పిల్లలకు బడిలోనో లేదా ఒక కాలేజీ లోనో మంచి మార్కులు వస్తే, లేదా MBBS లోనో , లేదా ఏ BITSPILANI లోనో, IIT లోనో, ఏదో ఉన్నత కళాశాలలో ఫ్రీ సీటు వస్తే మనము ఎంతసంతోషిస్తాము, పదిమంది మనలను మన బిడ్డలనూ అభినందిస్తుంటే ఎంత పొంగిపోతాము, మరి ఇవన్నీ మన తల్లితండ్రులకు మనమీద ఉండవా? వారు మన దినదినాభివృద్ధిని చూచి పొంగిపోవాలని, ఆ ఆనందాన్ని పదిమందితో వారి స్నేహితులతో బంధువర్గముతో పంచుకోవాలని ఆనందించాలని, వారికుండదా? ఆలోచించండి.
కాబట్టి మన తల్లితండ్రులను, నాన్నమ్మలను , అమ్మమ్మలను, తాతయ్యలను వృద్ధాశ్రమాలాలో కాక వారు మన ఇంటిలోనే ఉంటే, ఆలోచించండి మనము మన తల్లి,తండ్రుల ఋణమును కొంతవరకైనా తీర్చుకొన్నవారము అవుతాము. తల్లికి ఎంత సేవ చేసినా తల్లి ఋణము తీరేదికాదు.
తల్లితండ్రులకు సేవలు, సపర్యలు,చేయడం ఎంత గౌరవం ఎన్ని జన్మజన్మల పుణ్యమో, తల్లి ఋణము తీర్చుకునే భాగ్యము మనకు కలుగుతుంది. అందుకే “నేను ఇంకా మా అమ్మకు అన్నం పెడుతున్నాను” అని ఎప్పుడు కానీ పొరపాటున కూడా అనరాదు.అంతకంటే దౌర్భాగ్యపు బ్రతుకు, మానవత్వము ను మరచిన బ్రతుకు, మరొకటి లేదు. కృతఘ్నతకు ఇంత కంటే నిదర్శనము మరోటిలేదు. తల్లి సాక్షాత్తు పరదేవత. నేను ఇంకా ఇంత వయసు వచ్చినా(55 సం|| 60 స|| వచ్చినా అంటే తల్లి తండ్రులు కలిగి వున్నవారు) “నేను ఇంకా మా అమ్మ చేతి అన్నం తింటున్నాను” అని సగర్వంగా త్రికరణశుద్దిగా చెప్పుకొని పొంగి పోయే జన్మము ధన్యము. తల్లి తండ్రుల అవసరాలు తీర్చుచూ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
ఇక్కడ మరో విషయం బాగా ఆలోచించండి.
తల్లి తండ్రులను మనం సేవించడం వలన మనకు పుణ్యప్రదము మరియు వయో వృద్ధులు , జ్ఞానవృద్ధులు అనుభవ వృద్ధులు ఐన తల్లితండ్రులు ఇంటిలో ఉండడం వలన వారి ద్వారా మన పిల్లలకు మనము అపారమైన, విలువ కట్టలేని, ఆధ్యాత్మికమైన, ధార్మికమైన, పురాణ విషయ సంపదలు, అనుభవపూర్వ కమైన మంచి చెడు విషయములు, అందించినవారమౌతాము. వాటి యొక్క విలువలు మనకు ఇప్పుడు తెలియవు. మన పిల్లలు ప్రయోజకులై ఈ ప్రపంచంలో బ్రతుకు తెరువుకై వెళ్ళినపుడు మాత్రమే అవగతమవుతాయి. ఈ సమాజంలో ప్రతి మనిషి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ పరంగా ఉదయం నుండి సాయంకాలంవరకు, మరీ రాత్రి వరకు బయట అలసి సొలసి విశ్రాంతికై ఇంటికి చేరుతారు. అప్పుడు మన పిల్లలు సందేహాలు, ధర్మ విషయాలు, న్యాయాన్యాయ విషయాలు, సమాజ విషయ సందేహాలు మనల్ని అడిగితే, మనము మన శారీరక, మానసిక, బడలికల వలన విసుగు ప్రదర్శించడం. లేదా మీ టీచర్లను అడగండి అనడం, మరీ మరీ అడిగితే ఇప్పుడు కాదు, అని విసిగించుకోవడం జరుగుతుంది. ఔనా? మరి మన పిల్లల సందేహాలు మన పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఎలా తెలుసుకుంటారు ఆలోచించండి.
కాబట్టి ఇంటిలో అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఉన్నట్లయితే మనకు ఈ శ్రమ ఉండదు కదా?మరియు పిల్లలకు తల్లి దగ్గర, నాన్నమ్మ, అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ, విశ్వాసము అపారము అనిర్వచనీ యము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు.
- మరొక్క విషయము ఆలోచిస్తాము మనకు ఈ యవ్వనము శాశ్వతమా?
- ఈ దేహము శాశ్వతమా? మన శరీయములో ఉన్న ఈ బలము శాశ్వతమా? ఈ సంపదలు శాశ్వతమా?
- మనకు వృద్ధాప్యము రాదా?
- మరి మనలను మనబిడ్డలు వృద్ధాశ్రమములో ఉంచరని గ్యారంటీ ఉందా?
- అపుడు మనకు కలిగే ఆలోచనలు మనలో జరిగే సంఘర్షణలు ఇపుడు మనతల్లితండ్రులకు ఉండవా? ఎక్కడుంది ధర్మము. మనము మనసంస్కృతి ఎక్కడికి వెళుతోంది?
- నిజానికిమనము ఎక్కడ ఉన్నాము?
- కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగములలో ఈ వృద్ధాశ్రమాలు ఉన్నట్లు దాఖలాలు లేవు. ఈ కలియుగములోనే అనాధాశ్ర మాలు, వృద్ధాశ్రమాలు, చైల్డ్ కేర్ సెంటర్లు పట్టణాలలో వీధికొకటి వెలుస్తున్నా యి. మరీ ప్రతి మండల కేంద్రములో ఒక వృద్ధాశ్రమము వెలుస్తున్నది. ఇది వ్యాపారమే కావచ్చు కానీ ఆశ్రమ నిర్వాహకులు ఎంత సేవచేసినా ఆ వృద్దులకు తృప్తికలుగుతుందా?
- మనము ఇచ్చే పది రూపాయలతో వారి సేవలకు విలువ కట్టగలమా?మరి వారు ఎంతో సహృదయముతో సేవాధృక్పధముతో వారుచేసే శ్రమకు, సహనానికి, సేవలకు మనము విలువ కట్టగలమా?
- ఆ వృద్ధులు తృప్తిపడితేనేకదా వారి సేవలకు విలువ? ఆ వృద్దులకు ఏమను కుంటారు మనబిడ్డే ఉంటే ఎంతబాగా చూచు కొనేవాడో కదా అంటారు కానీ తృప్తిపడరు. అవునా?
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి