మనమందరం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. అదేమిటంటే పనికి సంబంధించిన వివిధ అంశాల గురించి మన కుటుంబంతో సంభాషించడం. ఇలా కుటుంబంతో పని గురించి చర్చించడం పక్కన పెట్టాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు, కానీ నేను మాత్రం అలా చేయడం తప్పంటాను. పని గురించి కుటుంబంతో చర్చించడం ఒక విభిన్నమైన నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. మీ వ్యాపారాన్ని, పనిని బయటనుండీ గమనిస్తున్న మీరు నమ్మే వ్యక్తుల నుండి అందే సలహాలు ఏ రకంగా ఉంటాయో చెప్పలేం. వాళ్ళెవరో ఏదో వ్యాఖ్యానాలు చేసే బయటి వారు కాదు. వారు మీరు నమ్మే వ్యక్తులు, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు, మీరు గెలవాలని కోరుకునే వ్యక్తులు. వాళ్ళు అందించే సూచనలు చాలా విలువైనవి కావచ్చు. అది మీ భార్య కావచ్చు లేదా మీ ఐదేళ్ళ పిల్లాడు కావచ్చు, చెప్పలేం.
ఉన్నది జీవితం, జీవితం, జీవితం, అంతే! జీవితంలోని వివిధ అంశాలతో మనం ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి, అంతే!
వారంలో ఐదు రోజులు పనిచేసి, రెండు రోజులు జీవించడం చాలా తప్పని నేనకుంటాను. అది దారుణమైన రీతిలో జీవించడమవుతుంది. మీరు ఏడు రోజులూ జీవించాలి
మీరు ఏదైనా కొత్తగా సృష్టిస్తూ ఉన్నట్లైతే, పని(వృత్తి)కి సంబంధించిన సంభాషణలు ఆసక్తికరంగా ఎందుకుండవు? కుటుంబం కూడా అందులో పాల్గొనవచ్చు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీరు ప్రత్యక్షంగా పని చేస్తుండకపోవచ్చు, కానీ మీరు రేపటికి లేదా భవిష్యత్తుకి అవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ, వాటిని విస్తృతపరుస్తూ ఉండవచ్చు. కాబట్టి, పని-జీవితం అనే విభజన ఉండకూడదని నేనంటాను.
వారంలో ఐదు రోజులు పనిచేసి, రెండు రోజులు జీవించడం చాలా తప్పని నేనకుంటాను. అది దారుణమైన రీతిలో జీవించడమవుతుంది. మీరు ఏడు రోజులూ జీవించాలి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి