తమ తల్లిదండ్రులపై ప్రేమ లేదనుకుంటే అది పొరపాటే వారి పితృ భక్తిని శంకించాల్సిన అవసరం లేదేమో కాని తల్లితండ్రులను సరిగ్గా చూసుకొకపొవడం, ఒకే ఊరి లొ ఉండి వృద్ధాశ్రమాలలొ పెట్టడం తప్పు.
ఇటువంటి వారిని నిరుత్సాహపరిచి శిక్షించే విధంగా చట్టాలు వస్తే బాగుంటుంది. ఇప్పటికే కొన్ని కోర్టులు వేరుకాపురం గురించి తీర్పులివ్వడం మంచి పరిణామం.
కని పెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం మంచిది కాదని కోర్టులు మందలించటం మన జీవన విధానంలో అన్ని బంధాలను ఏ విధంగా దూరం చేసుకుంటున్నామో
గుర్తు చేస్తోంది.
మాతృ దేవో భవ పితృ దేవో భవ అన్న వేధ మంత్రాన్ని వల్లే వేసిన నోటితోనే బయటికెల్లిపోమ్మని ఎలా అనగలుగుతున్నారు.
కడుపు కట్టుకొని వారు సంపాదించిన ఆస్తులను మాత్రం అక్కున చేర్చుకొని అనాథలుగా వారిని వ్రుద్దశ్రమాల్లో చేర్చేముందు మీకూ అదే గతి అత్యంత వేగంగా వచ్చేస్తుందని గమనించండి
మీక్కూడా చావుకు ముందు వచ్చే చివరి మజిలీఅదే కాగలదు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి