కథ:
ఒక బ్రాహ్మణ బాలిక సవతి పోరునూ, దరిద్రాన్నీ భరించలేక... ప్రతిరోజూ శివలింగం ముందు దు:ఖిస్తుండగా, ఒకనాడు శివదేవుడు ప్రత్యక్షమై "అమ్మాయి! గతంలో నువ్వు మొగ్గ దోసిళ్ళ నోము నోచి ఉల్లంఘించడం వల్లనే నీకీ కష్టం వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆ నోమును యాధాప్రకారం ఆచేరిస్తే, సవతి తల్లి పోరూ తప్పుతుంది. సర్వ దరిద్రాలూ తొలిగిపోతాయి ” అని చెప్పాడు.
అది విన్న బాలిక ఆ విధంగానే చేయగా ఏడాది గడిచేసరికి సవతి తల్లికి మనసు మారి, ఆ కన్యను ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. అంతలోనే సంపన్నుల యింటి సంబంధం వచ్చి, ఆమెకు ధవంతుడైన యువకునితో వివాహం జరిగి దరిద్రమూ తొలగిపోయింది.
విధానం:
ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు ఒక పళ్ళెంలో పసుపు పోసి, దానిమీద మూడు దోసిళ్ళ నీరు పోసి, దానిని వంటికి రాసుకుని శివుణ్ణి స్మరించాలి. పై కథ చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఏడాది తరువాత ఉద్యాపన చేయాలి.
ఉద్యాపనం:
మూడు దోసిళ్ళ పువ్వులూ, మూడు దోసిళ్ళ పగడాలు, మూడు దోసేళ్ళముత్యాలూ తీసుకుని శివాలయానికి వెళ్లి , శివుడికి వాటిని ధారబోసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి