కుంభ మేళా |
పావనత్వం, కోమలత్వం, శీతలత్వం గంగానదీ నీటి ప్రత్యేకత. విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమిపైకి వచ్చిందని, దీనిలో స్నానం చేస్తూ అన్నీ పాపాలు పోతాయని హిందువుల భావన. ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తుంటాయి. వీటికి అంతర్వాహినిగా సరస్వతీ నదిగా కూడా ప్రవహిస్తుంది. అందుకే ఈ తీరాన్ని త్రివేణి సంగమ తీరంగా పిలుస్తుంటారు. పర్వదినాల్లో ఈ నదిలో స్నానం ఆచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాక కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు.
కుంభమేళా ప్రాశస్త్యం:
కుంభమేళాకు హిందూపురాణాల్లో ప్రత్యేకమైన కథలు ఉన్నాయి. అసురుల చేతిలో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వ వైభవం కోసం విష్ణువును ఆశ్రయిస్తాడు. అమృతం కోసం
సాగర మధనం చేయాలని దానితో తిరుగుండదని విష్ణువు సలహా ఇస్తాడు. దేవ, దానవులు సముద్ర మధనం చేస్తూండగా అమృత కలశం ఒకటి బయటకు వస్తుంది. అమృతం కోసం దేవ దానవులు పన్నెండు రోజులు, పన్నెండు రాత్రులు (మనుష్యుల ప్రకారం 12 సంవత్సరాలు) ఘోర యుద్ధం చేశారు. దీన్ని రాక్షసులు తాగితే అజేయులవుతారని భావించిన దేవతలు మహా విష్ణువును ప్రార్థించగా, స్వామి మోహిని అవతారం ఎత్తుతారు. విష్ణువు చేతిలోని కలశం నుంచి నాలుగు అమృత చుక్కలు అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని నాసిక్‌లలోని పుణ్యనదుల్లో పడ్డాయని భాగవతం, విష్ణుపురాణం, మహాభారతం, రామాయణం తదితర పురాణాల కథనం. మరో కథ కూడా ఉంది. సాగర మధనంలో ఉద్భవించిన అమృత కలశాన్నిమోహిని అవతారం లోని విష్ణువు తన వాహనమైన గరుడుడి కిచ్చి భద్రపరచ మంటాడు. గరుడుడు కలశాన్ని తీసుకెళ్తుండగా నాలుగు చోట్ల ఈ చుక్కలు పడతాయట.
ఆ నాలుగు చోట్లే ''ప్రయాగ'' అలహాబాద్‌లోని ''హరిద్వార్'' (ఉత్తర ప్రదేశ్) ''నాసిక్'' (మహాష్ట్ర) ''ఉజ్జయిని'' (మధ్యప్రదేశ్) అందుకే ఈ నాలుగు చోట్ల కుంభమేళాలు జరుగుతాయి. ప్రతి
మూడేళ్లకోసారి ఒక్కోచోట రొటేషన్ పద్ధతిలో కుంభమేళా జరుగుతుంది. అంటే ఒక్కోచోట ప్రతి పన్నేండేళ్లకోసారి కుంభమేళా జరుగుతున్నది.
భక్త జనం |
మహా కుంభ మేళా-చరిత్ర,విశిష్టత:
-కుంభం అనగా కుండ లేదా కలశం అని అర్థం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనే ది ఒక రాశి. మేళా అంటే కలయిక లేదా జాతర అని అర్థం. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందు ధర్మ శాస్త్రాలు తెలుపుతున్నాయి. వేద కాలం నుంచి కుంభమేళా ఆచరిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీర సాగర మథనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృత భాండానికై దేవ-దానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు భాండాన్ని తీసుకొని పోతుండగా అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో కొన్ని అమృతపు చుక్కలు జారవిడిచారని నమ్ముతారు.
అందుకే ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒక సారి ఒక పట్టణంలో కుంభమేళా జరుగుతుందన్నమాట.
ఆరేళ్లకోసారి జరిగే దాన్ని అర్ధ కుంభమేళా అని.. పన్నెండేళ్లకొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభ మేళా అని, 144 ఏళ్లకోసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అంటారు. ఇక చరిత్రలో క్రీ.శ 629 ప్రాంతంలో హర్షవర్ధనుడి కాలంలో భారత పర్యటన చేసిన చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రచనల్లో సైతం కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. ది సీబీఎస్ సండే మార్నింగ్ అనే
ప్రముఖ అమెరికన్ షో 18, 2010 హరిద్వార్ కుంభమేళాను ప్రపంచంలోనే అతిపెద్ద మత కార్యక్రమంగా అభివర్ణించింది.ఏప్రిల్ 28, 2010న బీబీసీ కుంభమేళాను ..గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ గా ఒక రిపోర్టును వెలువరించింది. దీన్ని బట్టి కుంభమేళ ఎంత ప్రశస్తమైందో తెలుసుకోవచ్చు.
సమయం
సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోనూ, బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అహాబాద్ ప్రయాగలోనూ, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. చివరగా 2010 జనవరి-మార్చిలో హరిద్వార్‌లో పూర్ణకుంభమేళాను నిర్వహించారు.
కుంభ |
-ఎక్కడైతే ఈ మేళా నిర్వహిస్తారో అక్కడ నదీ జలాతో పవిత్ర స్నానాలు ఆచరించడం ఆనవాయితి. వేల పంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ప్రత్యేత. పురాతన సాంప్ర దాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు వొళ్లంతా విబూది రాసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులనే సాధువులు దిగంబరులై కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటివరకూ అత్యధికంగా నాసిక్ కుంభమేళాలో 7.5కోట్ల మంది పాల్గొన్నారు.
ఏ రోజుల్లో ప్రశస్తమంటే
కుంభమేళాలో కొన్ని రోజులను అత్యంత పవిత్రమెనవిగా భావిస్తారు. ఈ ఏడాది జనవరి 14 (మకర సంక్రాంతి), 27 (పౌర్ణమి), ఫిబ్రవరి 6 (ఏకాదశి), 10 (అమవాస్య), 15 (వసంత పంచమి), 17 (రథ సప్తమి), 18 (భీష్మాష్టమి), 25 (మాఘ పౌర్ణమి) దినాలలో ఎక్కువ మంది భక్తులు కుంభమేళాకు స్నానాలు చేయటానికి వస్తారని భావిస్తున్నారు.
రివేణి సంగమంలో ఆధ్యాత్మిక సంరంభం మహా కుంభమేళా -
అలహాబాద్ : మహాకుంభమేళా..ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ధార్మిక మహోత్సవానికి రంగం సిద్ధమైంది. యావత్ హిందువులు అత్యంత పవిత్రమైన తీర్థంగా భావించే అలహాబాద్‌లోని త్రివేణి సంగమంలో దాదాపు పది కోట్ల మందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరాలను ఉత్తరాదిన కుంభమేళా అంటారు.
కుంభమేళాలో సాధువులు |
ఉగ్రవాద దాడులు జరుగుతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో దాదాపు 7000 మంది కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దిగనున్నారు. అలాగే పలు కంపెనీల రాపిడ్ యాక్షన్
దళాలు, కేంద్ర విపత్తు నివారణ సంస్థ సిబ్బం దిని కుంభమేళా భద్రతా ఏర్పాట్లకు వినియోగించనున్నారు. -అలహాబాద్ ఐజీ అలోక్‌నాథ్‌ను శాంతి భద్రతల ఏర్పాట్లకై నోడల్ అధికారిగా నియమించారు. 2016లో కుంభమేళా జరిగినప్రాంతం దాదాపు 2,802 ఎకరాలు ఉంటే.. ఈసారి అది 4,932 ఎకరాలకు పెరిగింది. స్నానఘట్టాల వద్ద అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. కుంభనగరిలో 600 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇప్పటికే పుష్కర ఘాట్ల ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి