" హిందూమతం లేదా హిందూ ధర్మం (Hinduism or Hindu Dharma) "
హిందూ మతం అతి పురాతన మరియు ప్రపంచంలో మొట్ట మొదట ఆవిర్భవించిన మతం హైందవ మతం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. పూర్వకాలమునందు భారతదేశమున ఏది ధర్మ నామముతో వ్యవహరింపబడినదో, అదియే ఇపుడు మత మను పేరుతో వాడబడుచున్నది. ధర్మము అనగా ఆచరణీయ కార్యము. మత మనగా అభిప్రాయము .
హిందూ అనే పదమును ఫార్సీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి ఫార్సీ భాషలో సింధు అని అర్థము,సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలచేవారు కాని ఇప్పుడు వేదాలు మరియు వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు.
హిందూమతం మరియు దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి. ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన హిందూమతాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.సుమారు రెండు బిలియన్ల హిందూ జనాభాలో 1000 మిలియన్లు భారతదేశం మరియు నేపాల్ లోనే నివసిస్తున్నారు. ఇంకా హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజి, సూరినాం, గయానా,ట్రినిడాడ్ మరియు టుబాగో, అమెరికా, రష్యా, న్యూజిలాండ్, మలేసియా, సింగపూర్ మరియు చైనా ముఖ్యమైనవి.
వేదాలు:
హిందువుల వేద సంపద చాలా అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు,మరియు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు మరియు ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, పురాణాలు మరియు మహా కావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు భగవద్గీత అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోంది.
హిందువు - పద వ్యుత్పత్తి మరియు అర్ధము:
"హిందూ అంటే "హింసాం దూషయతి ఖండయతి ఇతి హిందుః"" ఎక్కడైతే హింస, పాపము ఉన్నాయో దానిని ఖండించేవాడే హిందువు .ఋగ్వేదం సిందు నది పరివహక ప్రాంతాన్ని సప్త సింధు (ఏడు నదులు కల ప్రాంతం)అని పేర్కొంది. జొరాస్ట్రియనుల గ్రంథాలలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. ఈ పదం భారత దేశ ఉపఖండంలో (సింధు నది ఆవల) నివసించే వారిని గురించి చెప్పబడింది.
మరొక సిద్ధాంతం ప్రకారం హిందువులంటే హిందుస్థానం' వాసులు. బృహస్పతి ఆగమం లో ఈ క్రింది విధంగా చెప్పబడింది:
హిమాలయాత్ సమారభ్య యావత్ ఇందు సరోవరమ్, తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే.దైవ భావన మరియు విశ్వాసాలు:
(హిమాలయాల నుండి ఇందు సరోవరం వరకు వ్యాపించియున్నట్టి, దేవుడిచే నిర్మించబడిన దేశానికే హిందుస్థానం అని పేరు)
హిందూ మతంలో 'ఒకే దేవుడు', 'చాలా మంది దేవుళ్ళు', 'వివిధ స్థాయి దేవుళ్ళు', 'నిరాకార భగవంతుడు', 'సాకార భగవంతుడు' - ఇలా చాలా విధాలైన విశ్వాసాలు కలగలిపి ఉన్నాయి. కనుక హిందూమతం అంతటా సాధికారంగా ఒప్పుకొనే భావన ఇది అని చెప్పడం క్లిష్టతరమైన విషయమే.
ఎక్కువ మంది హిందువులు నమ్మే విషయాలలో ఒకటి - ఆత్మ శాశ్వతమైనది, నిరాకారమైనది. అద్వైతం వంటి వేదాంతాల ప్రకారం ఈ ఆత్మయే బ్రహ్మము (పరమాత్మ). అద్వితీయము. గుణ రహితము. ఆత్మ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానము లభించినవారికి మోక్షం (బంధనాలనుండి విముక్తి)సిద్ధిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
ద్వైతం, భక్తి వంటి వేదాంత సిద్ధాంతాల ప్రకారం ఆత్మ, పరమాత్మ వేరు వేరు. పరమాత్మకు స్పష్టమైన ఆకృతి ఉంది. జీవుడు పరమాత్మను చేరడమే ముక్తి. అందరికీ ప్రభువైనందున భగవంతుడు "పరమేశ్వరుడు", Bhagavan ("The Auspicious One"), or Parameshwara ("The Supreme Lord"). కాని ఆయా వేదాంత సూత్రాలను బట్టీ, వాటి వివరణను బట్టీ "బ్రహ్మ", "బ్రహ్మము", "ఈశ్వరుడు", "దేవుడు" వంటి పదాలను అర్ధం చేసుకొనే విధానంలో వైవిధ్యం ఉంటుంది. సాంఖ్యం వంటి సిద్ధాంతాలలో నాస్తికత లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
హైందవ మతం ఏకేశ్వరోపాసన, నాస్తిక వాదం, ఆస్తిక వాదం, ద్వైతం, అద్వైతం, లాంటి విభిన్న విశ్వాసాల సమ్మేళనం. ఇంతటి సంక్లిష్ట మైన భావాలు బహుశా మరే మతంలోనూ కనిపించవు. ఒక్క పదంతో వర్ణించాలంటే అది అసంపూర్తిగానే ఉంటుంది.
హిందువులలో చాలామంది ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు. అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంత శక్తి స్వరూపమైనటువంటి బ్రహ్మం నకు చెందినదే. బ్రహ్మం అనగా ఏదీ సాటిరాని సత్యం. అందుకనే దీనిని అద్వైతం(ద్వైతం కానిది)అన్నారు. దీని ప్రకారం మనుజులు తాము ఆత్మ స్వరూపులని, బ్రహ్మంలో భాగమని తెలుసుకోవడం జీవన పరమార్థం. ఉపనిషత్తుల ప్రకారం ఎవరైతే జీవులు తాము కేవలం దేహం మాత్రమే కాదని, సంపూర్ణ ఆత్మజ్ఞాన సంపన్నులై ఉందురో వారు మోక్ష ప్రాప్తినొందగలరు.
అద్వైతానికి విరుద్ధమైనది ద్వైతం. ద్వైతం అనగా నీవు, భగవంతుడు వేరనే భావన. పరమాత్మ స్వరూపుడు భగవంతుడైతే ఆత్మ స్వరూపులు మనుషులౌతారు. ఈ మర్గాన పయనించేవారు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, లేదా శక్తిని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. ఆత్మ భగవంతునిమీద ఆధారపడితే, మోక్షం దేవుని కృపమీద ఆధారపడి ఉంటుంది. పరమాత్మ స్వరూపుడను మహోన్నతమైన మూర్తిగా భావించినపుడు ఆయనను ఈశ్వరుడు, లేదా భగవానుడు లేదా పరమేశ్వరుడు అనవచ్చును. కానీ ఈశ్వర శబ్దాన్ని మీమాంసకులు మరియు అద్వైతాన్ని అనుసరించేవారు వేర్వేరు భావనలుగా స్వీకరిస్తారు. నాస్తికవాదం వైపు మొగ్గు చూపే సాంఖ్యకులు కూడా ఉన్నారు.
విశ్వాసాలు:
హిందూమతంలో ఓంకారం శబ్దానికి చాలా విశిష్టత ఉంది. ఈ శబ్దాన్ని ప్రణవ నాదమని, సృష్టికి పూర్వం అంతటా ప్రణవమే ఉండేదని, ఇదే పర బ్రహ్మ స్వరూపమని అంటారు. దాదాపు అన్ని మంత్రాలకు ముందు ఓంకారం ఉంటుంది.
హిందూ మతం చాలా వైవిధ్యమైనది. కొన్ని విశ్వాసాలు ప్రబలంగా ఉన్నప్పటికీ, పండితులు అందరి చేత ఆమోదించబడే విశ్వాసాలను క్రోడీకరించడం కష్టంగా భావిస్తున్నారు. ధర్మం (నీతి నియమాలు, విధులు), సంసారం, మోక్షం (సంసారం నుండి విముక్తి), మరియు ఇతర యోగ పద్దతులు మొదలైనవి ప్రబలమైనవి.
పరమాత్మ స్వరూపం:
హిందూ మతంలో భగవంతుని స్వరూపం మరియు సృష్టి గురించి భాగవతంలోని ద్వితీయ స్కందంలో శుకమహర్షి పరీక్షిత్మ్హారాజుకు చెప్పాడు. భగవంతుడిని పరమేశ్వరుడని, విరాట్పురుషుడని ఇంకా అనేక పేర్లతో హిందూమతం వర్ణిస్తుంది. భగవంతుడు శాశ్వతుడు అంత్యకాలంలో సృష్టి ఆయనలో లీనమౌతుంది. తిరిగి భగవంతుని నుండి సృష్టి అనేకరూపాలతో ఆయననుండి ఉద్భవిస్తుంది.
- హిరణ్యమయమైన భగవంతుని శరీరంనుండి ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని మూడు విధాలుగా ఈ జగతిని సృష్టించాడు.
- పరమాత్మ శరీరంలోని ఆకాశంనుండి ప్రవృత్తి సామర్ధ్యమైన ఓజస్సు,వేగ సామర్థ్యం,బలసామర్థ్యం ఉద్భవించాయి.
- ఆయనలోని సూక్ష్మరూపమైన క్రియాశక్తి వలన ప్రాణం పుట్టింది.ఆ ప్రాణం సమస్త జీవరాశిలో ప్రాణశక్తిగా ఉంది.
- భగవణ్తుని జఠరాగ్ని నుండి ఆకలి దప్పిక పుట్టాయి.
- పరమాత్ముని ముఖంనుండి నోరు, నాలుక, దవడలు పుట్టుకొచ్చాయి. నాలుక నుండి రసేంద్రియాలు ఉద్భవించాయి. ఆయన ముఖం నుండి వాగేంద్రియం పుట్టింది.
- వాగేంద్రియానికి అగ్ని దేవుడు అధిష్టాన దేవత అయ్యాడు. వాగేంద్రియం నుండి సంభాషించే శక్తి పుట్టింది.
- ఆయనలోని వాయు శక్తి నుండి ఘ్రాణేంద్రియం పుట్టింది. ప్రాణులకు వాసనా శక్తి వచ్చింది.ఘ్రాణేంద్రియానికి వాయువు అధిష్టాన దేవత అయ్యాడు.
- పరమాత్మ ఆత్మను అవలోకించగానే నేరాలు పుట్టాయి.
- నేత్రాల నుండి చూసే శక్తి వచ్చింది.నేత్రాలకు సూర్యుడు అధిదేవత అయ్యాడు.
- దిక్కులు అధిష్టాన దేవతగా కర్ణేంద్రియాలు పుట్టాయి.
- పరమాత్మ నుండి చర్మం పుట్టింది . దానికి స్పర్శా శక్తి వచ్చింది. చర్మం నుండి వెండ్రుకలు పుట్టాయి. వాటికి వృక్షాలు అధిదేవతలయ్యాయి.
- ఆ తర్వాత వాయువు నుండి చేతులు ఉద్భవించాయి వాటికి ఇంద్రుడు అధి దేవత అయ్యాడు.
- ఆ తరువాత పాదాలు పుట్టాయి. పాదాలకు విష్ణువు అధిదేవత అయ్యాడు. పరమాత్మఆనందపారవశ్యుడు కాగానే జననేంద్రియాలు పుట్టాయి.జననేంద్రియాల నుండి పునరుత్పత్తి శక్తి ఆవిర్భవించింది.జననేంద్రియాలకు ప్రజాపతి అధిష్టాన దేవత అయ్యాడు.
- మిత్రుడు అధిష్టాన దేవతగా పాయువు పుట్టింది. దానికి నిస్సార పదార్ధాలను విసర్జించే శక్తి పుట్టింది. జీర్ణమైన శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని స్వీకరించాలన్నప్పుడు మొదటి శరీరాన్ని వదలటానికి సాధనంగా బొడ్డు ఉపయోగపడుతుంది.ప్రాణ ఆపాన వాయువులు శరీరాన్ని వదిలి వేయగానే మృత్యువు సంభవిస్తుంది.
- క్రింది శరీరాన్ని పై శ్రీరాన్ని వేరు చేస్తూ మధ్య భాగంలో బొడ్డు ఉంటుంది. ఆ హారాన్ని జీర్ణం చేయడానికి ప్రేవులు, రక్తప్రసరణ ఇతర కార్యాలకు నాడీ వ్యవస్థ అవతరించాయి.వాటికి నదీ నదములు అధిష్టాన దేవతలు అయ్యాయి.
- పరమాత్మ ఒకసారి మాయను ధ్యానించగానే కామానికి, సంకల్పానికి నెలవైన హృదయం జనించింది.హృదయం నుండి సంకల్పం, బుద్ధి,చంద్రుడు, కాముడు జనించాయి. విరాట్పురుషుడి స్థూల శరీరం భూమి తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం, అవ్యక్తం అనే ఎనిమిది అనే ఎనిమిది ఆవరణలతో ప్రకాశిస్తుంది.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి